For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూజించు, ఆచ‌రించు... గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కొట్టు!

|

ఈ కాలంలో మంచి జాబ్ అని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం క‌ల‌లు కంటారు, త‌పిస్తారు. మంచి ఉద్యోగం అంటే.. ఒక్కొక్క‌రికీ ఒక్కోలా అభిప్రాయం ఉంటుంది. ఇదే మంచి జాబ్ అని చెప్ప‌లేం. అయితే నేటి యువ‌త‌కు మాత్రం గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ అంటే మంచిద‌ని దాన్ని సాధించాల‌నే భావన ఉంది. అలాంటి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే పోటీకి త‌ట్టుకొని వివిధ టెస్టుల్లో పాస్ అవ్వాలి క‌దా! పైగా వివిధ ద‌శ‌ల్లో జ‌రిగే వ‌డ‌పోత‌ల్లో క్వాలిఫై అయితే త‌ప్ప ప్ర‌భుత్వ కొలువు ద‌క్క‌దు.

ఎంతో ప‌రిశ్ర‌మ, స్థిర చిత్తం ఉంటే త‌ప్ప మెరిట్ జాబితాలో పేరు రాదు. అయితే అంద‌రూ అనుకున్న‌ట్టు కేవ‌లం హార్డ్ వ‌ర్క్ ఒక్క‌టే స‌రిపోదు. ఒక్కోసారి ల‌క్ కూడా అవ‌స‌రం అవుతుంది. అలా ల‌క్ క‌లిసి రావాలంటే పూజ‌లు, వ్ర‌తాలు లాంటివాటిని చేస్తే బాగుంటుంద‌ని పెద్ద‌లు చెబుతారు. ఏమో ఏ పుట్ట‌లో ఏం పాముందో.. చేసేస్తే పోలా అని అనుకునేవారికి ఇవిగోండి మార్గాలు...

శివలింగంపైన నీళ్లు చ‌ల్లండి
 

శివలింగంపైన నీళ్లు చ‌ల్లండి

శివ‌లింగంపైన ప్ర‌తి సోమ‌వారం నీళ్లు పోయండి. ఆ త‌ర్వాత అన్నం, ప‌చ్చిపాలు నైవేద్యంగా స‌మ‌ర్పించండి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గి ప్ర‌భుత్వ కొలువు సిద్ధిస్తుంది. అన్ని దేవుల్ల‌కెల్లా ప‌ర‌మ‌శివుడి మ‌న‌సు త్వ‌ర‌గా క‌రుగుతుంది. అందుకే ఆయ‌న ఆశీర్వ‌చ‌నాలు ఉంటే అనుకున్న‌ది త‌ప్ప‌నిస‌రిగా సిద్ధిస్తుంది.

గులాబీల‌తో హ‌నుమంతుడికి...

గులాబీల‌తో హ‌నుమంతుడికి...

ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమాన్ మందిరానికి వెళ్లండి. గులాబీల‌ను స‌మ‌ర్పించి ఇష్టంగా ప్రార్థించండి. అంత ఎత్తు, బ‌ల‌మైన ఛాతీతో, ఆకాశంలో ఎగిరగ‌లిగే హ‌నుమాన్ దేవుడ్ని ద‌ర్శించుకోవ‌డం భాగ్య‌మే. దానితో పాటు రోజూ హ‌నుమాన్ చాలీసా చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోండి. వీలైతే హ‌నుమాన్ యంత్రాన్ని ద‌గ్గ‌రుంచుకోండి.

తిరు తిరు గ‌ణ‌నాథ‌...

తిరు తిరు గ‌ణ‌నాథ‌...

ప్ర‌తి చ‌తుర్థి నాడు గ‌ణ‌నాథున్ని పూజించ‌డం వ‌ల్ల శుభ‌మే క‌లుగుతుంది. విఘ్న దేవుడిగా కొలిచే గ‌ణ‌ప‌తి బ‌ప్ప‌ను పూజించ‌డం వ‌ల్ల విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంది. పైగా వినాయ‌క చ‌వితి నాడు పుస్త‌కాలు పెట్ట‌డం ఆన‌వాయితీ.

Most Read : ఈ ఐదు రాశుల వారికి పోటీతత్వం ఎక్కువ, ప్రతి విషయంలోనూ పోటీపడుతుంటారు, విజయమే లక్ష్యం

గో మాత సేవ‌
 

గో మాత సేవ‌

హిందూ సంప్ర‌దాయంలో గోమాత‌కు ఆహారం అందించ‌డం అత్యంత పుణ్య‌కారంగా భావిస్తారు. ఏదైనా ఇంట‌ర్‌వ్యూ కి వెళ్లే ముందు గోవుకు చ‌పాతి, బెల్లం క‌లిపి పెట్టండి. గోదుమ పిండి పెట్టినా చాలా మంచిది. ఏదైనా సాధించే అవ‌కాశాలు ఎక్కువ‌వుతాయి.

శ‌ని దేవుడ్ని కొల‌వండి

శ‌ని దేవుడ్ని కొల‌వండి

ప్ర‌తి శ‌నివారం శ‌నీశ్వ‌రుడిని కొల‌వండి. శ‌ని దేవుడ్ని ప్రార్థించేట‌ప్పుడు ఓమ్ శ‌మ శ‌నీశ్వ‌రాయ న‌మః అని 108 సార్లు జ‌పించండి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌న్మ దోషాలేమైనా ఉంటే పోతాయి.

ఇంట‌ర్వూకు ముందు..

ఇంట‌ర్వూకు ముందు..

ఇంట‌ర్వూకు వెళ్లే ముందు తీపి తిన‌డం క‌లిసొస్తుంద‌ని చెప్తారు. పెరుగు,చ‌క్కెర తినడం శ్రేయ‌స్క‌రం.

మంత్ర జ‌పం

మంత్ర జ‌పం

ఓం న‌మో భ‌గ‌వ‌తి ప‌ద్మావ‌తి రిద్ధి సిద్ధి దాయ‌ని అని 108 సార్లు జ‌పించుకుంటూ ఇంట‌ర్వూకు వెళ్లండి. ఇలా చేస్తే ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుంది.

Most Read : ఈ ఐదు రాశులపై గ్రహణాల ప్రభావం, అంతా అశాంతే, అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి

రాగి చెట్టును పూజించండి

రాగి చెట్టును పూజించండి

ఆదివారం త‌ప్ప అన్ని దినాల్లోనూ రాగి చెట్టును పూజించండి. దేవుడి తో పాటు మ‌న పూర్వీకులు రాగి చెట్టు ద‌గ్గర కాస్త సమ‌యం గ‌డుపుతార‌ని అంటారు. ప్ర‌తి శ‌నివార‌మూ రాగి చెట్టు ముందు దీపం పెట్ట‌డం కూడా మంచిద‌ని పెద్ద‌లు చెబుతారు.

English summary

Effective Astrological Remedies To Get Government Jobs

Effective Astrological Remedies To Get Government Jobs. A good job is a need of the present times. And everybody aspires for a good job. While the definition of a good job can be different for different people, many of the youth today aspire for a job in the government sector. But to get such a job one has to qualify in tests. What makes these tests difficult is the fact that they have various stages.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more