For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Eid al-Adha 2021 (Bakrid):బక్రీద్ ఎప్పుడు? ఈ పండుగకు, త్యాగానికి ఉన్న సంబంధమేంటో తెలుసా...

బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకందాం.

|

బక్రీద్ పండుగను ఈద్ ఉల్ జుహా లేదా ఈద్ ఉల్ అద్హా అనే పేర్లతో కూడా పిలుస్తారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ 2021 సంవత్సరంలో జులై 20 మరియు 21వ తేదీన వచ్చింది.

Eid al-Adha 2021 (Bakrid): Date, Significance And Why It Is Celebrated

ముస్లిం క్యాలెండర్ (చంద్రుని గమనం) ప్రకారం.. వారి చివరి నెల అయిన ధు అల్-హిజాజ్ పదో రోజున ఈ పండుగ వస్తుంది. పరమ పవిత్రమైన ఈరోజున ముస్లింలలో చాలా మంది మరణించిన వారి సమాధుల వద్దకు వెళ్తారు.

Eid al-Adha 2021 (Bakrid): Date, Significance And Why It Is Celebrated

అక్కడ వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల స్వర్గంలో ఉన్న వారి పెద్దలు వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు. ఈ సందర్భంగా బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. ఈ పండుగ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Eid al-Adha 2021 (Bakrid): బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?Eid al-Adha 2021 (Bakrid): బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బక్రీద్ ను ఎందుకు జరుపుకుంటారంటే..

బక్రీద్ ను ఎందుకు జరుపుకుంటారంటే..

ఇస్లాం మతంలో బక్రీద్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున ప్రజలు సత్యం కోసమే ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రవక్త హజరత్ ఇబ్రహీం గుర్తుంచుకుంటారు. ఆ ఇబ్రహీం ఎవరు? తను ఎందుకని త్యాగం గురించి గుర్తుంచుకుంటారనే విషయాలను తెలుసుకుందాం.

ఖుర్బానీ అంటే..

ఖుర్బానీ అంటే..

మసీదులలో, ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఖుర్బానీ పేరిట జంతువులను బలి ఇస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయని ముస్లిం పెద్దలు చెబుతారు. ఖుర్బానీ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే అని ముస్లింలు నమ్ముతారు. ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ప్రముఖులు.

దైవ ప్రవక్త..

దైవ ప్రవక్త..

మక్కా పట్టణాన్ని ఆయన నిర్మించడమే కాదు.. అందరికీ నివాస యోగ్యంగా మార్చారు. అల్లా హ్ ను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం ‘కాబా'ను నిర్మించి దైవ ప్రవక్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇబ్రహీం దంపతులకు కొన్నేళ్లుగా పిల్లలే పుట్టలేదు. కానీ ఓసారి లేక లేక పుట్టిన పుత్రుడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు.

ఒంటెను బలి..

ఒంటెను బలి..

తనకు కుమారుడు పుట్టిన ఆనందించేలోపే ఇబ్రహీమ్ కు ఓ రోజు ఓ కల వస్తుంది. అందులో తన పుత్రుడు ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు భావిస్తాడు. అల్లా హ్ ఖుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఆ సమయంలో ఒంటెను బలి ఇస్తారు. అయితే మళ్లీ అదే కల వస్తుంది.

జీవాన్ని బలి ఇవ్వాలని..

జీవాన్ని బలి ఇవ్వాలని..

అల్లా హ్ తన పుత్రుడినే బలిదానం కోరుకుంటున్నాడని.. ఈ విషయాన్ని తన సుపుత్రుడికి చెప్పగా.. అల్లా హ్ కోసం తాను ప్రాణ త్యాగానికి రెడీ అని చెబుతాడు. ఆ వెంటనే ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ కు ఇబ్రహీం సిద్ధపడగా.. వారి త్యాగాన్ని మెచ్చుకున్న అల్లా హ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కబురు పంపుతాడు. అప్పటి నుండే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ముస్లిం పెద్దలు చెబుతారు.

ఎన్ని భాగాలంటే..

ఎన్ని భాగాలంటే..

బక్రీద్ రోజున జంతువులను బలి ఇచ్చిన తర్వాత వాటి మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తమ కుటుంబం కోసం వినియోగిస్తారు. ఇలా బక్రీద్ రోజున ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఖుర్బానీ ఇస్తారు.

English summary

Eid al-Adha 2021 (Bakrid): Date, Significance And Why It Is Celebrated

Here we are talking about the eid al-adha 2021(bakrid): date, significance and why it is celebrated. Read on
Story first published:Friday, July 16, 2021, 18:35 [IST]
Desktop Bottom Promotion