For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది మిలాద్ ఉన్ నబి ఎప్పుడు? ఈ వేడుకల ప్రత్యేకతలేంటి?

ఈ ఏడాది మిలాద్ ఉన్ నబి ఎప్పుడు? ఈ వేడుకల ప్రత్యేకతలేంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇస్లాం సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలను జరుపుకోరు. అయితే మన భారతదేశంలో మాత్రం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ప్రార్థనలు నిర్వహిస్తారు.

Eid-e-Milad-Un-Nabi 2021: Date, history and importance

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని చెప్పబడింది.

Eid-e-Milad-Un-Nabi 2021: Date, history and importance

విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో పొందుపరిచారు. మరో విశేషమేమిటంటే.. మహమ్మద్ ప్రవక్త(ఉమ్మి) ఏమీ చదువుకోలేదట.

Eid-e-Milad-Un-Nabi 2021: Date, history and importance

తను కేవలం అల్లాహ్ తహ లా మహిమ పవిత్ర ఖురాన్ ను దైవవాణి రూపంలో ప్రవక్త అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే ఆ ప్రవక్త ప్రవచనాలు అందరి జీవనశైలికి హితోపదేశాలు అయ్యాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ ఏడాది మిలాద్ ఉన్ నబి పండుగ ఎప్పుడొచ్చింది. ఈ పండుగ యొక్క ప్రత్యేకలేంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మక్కాలో జననం..!

మక్కాలో జననం..!

ముస్లింల సంప్రదాయం ప్రకారం ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను జరుపుకుంటారని 570లో రబీ ఉల్ అవ్వాల్ 12వ రోజు ప్రవక్త మక్కాలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు. మిలాద్ ఉన్ నబి పండుగకే మరో పేరు కూడా ఉంది. దీన్నే మావ్లిద్ అన్ - నబీ అని కూడా అంటారు. అరబిక్ భాషలో ‘మావ్లిద్' అంటే జన్మనివ్వడం అని లేదా బిడ్డ పుట్టడం అని అర్థం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడో నెల అయిన రబీ ఆల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ ఏడాది ఎప్పుడంటే..

ఈ ఏడాది ఎప్పుడంటే..

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మిలాద్ ఉన్ నబి పండుగ అక్టోబర్ నెలలో వచ్చింది. అంటే ఈ నెలలో 18 మరియు 19వ తేదీ రెండురోజుల పాటు ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈ పండుగ 18వ తేదీ సోమవారం నాడు ప్రారంభమై.. 19వ తేదీ అంటే మంగళవారం నాడు ముగియనుంది.

తొలిసారిగా ఎక్కడంటే..

తొలిసారిగా ఎక్కడంటే..

మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత, ఆయన ఇంటి వారసులలో ఒకరు మక్కాను ప్రార్థన ప్రదేశంగా మార్చారు. 11వ శతాబ్దంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబి వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని తొలిసారిగా ఈజిప్టు దేశంలో అధికారికంగా జరుపుకున్నారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో ఈజిప్టుతో పాటు సిరియా, మొరాకో, టర్కీ మరియు స్పెయిన్ వంటి దేశాల్లో కూడా మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభించారు.

పవిత్ర ఖురాన్ నుండి..

పవిత్ర ఖురాన్ నుండి..

తొలిసారిగా ప్రముఖ వంశం చేత 11వ శతాబ్దంల ప్రారంభించబడిన

ఈ వేడుకలు, అనంతరం ప్రజలు ప్రార్థనలు చేయడం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత పాలక వంశానికి చెందిన ప్రజలు ప్రసంగాలు ఇచ్చారు. పవిత్ర ఖురాన్ నుండి శ్లోకాలు పఠించడం ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం మొత్తం శాంతి, సహనంతో ఉండాలని ముస్లిములందరూ ప్రార్థిస్తారు.

దానధర్మాలు..

దానధర్మాలు..

మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముస్లిములందరూ తెల్లవారుజామునే నిద్ర లేచి మసీదులలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తమ సామర్థ్యం మేరకు పేదలకు దానధర్మాలు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోని కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పండుగను ముస్లిములతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. దీన్ని మతసామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు.

English summary

Eid-e-Milad-Un-Nabi 2021: Date, history and importance in Telugu

Here we are talking about the eid-e-milad-un-nabi 2021: date, history and importance. Read on
Story first published:Monday, October 18, 2021, 14:34 [IST]
Desktop Bottom Promotion