For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Eid ul-Fitr 2021: ఈద్ ఉల్ ఫితర్ అనే పేరు ఎలా వచ్చింది... ఈద్ ముబారక్ విశేషాలేంటో చూడండి...

Eid ul-Fitr పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు విశేషాలేంటో తెలుసుకుందాం.

|

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ లేదా రమదాన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇది ఈద్ ఉల్ ఫితర్ వేడుకలతో ముగుస్తుంది. దాదాపు నెల రోజుల పాటు ముస్లింలు అత్యంత కఠిన ఉపవాస దీక్షలను మరో రెండ్రోజుల్లో ముగించబోతున్నారు.

Eid ul-Fitr 2021 Date, History, meaning, Rituals and Significance

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ వేడుకలను నిర్వహిస్తారు. మన దేశంలో జరుపుకోడానికి ముందే సౌదీలో ఈ వేడుకలను జరుపుకుంటారు. నెలవంక కనబడగానే ఈ పండుగ ప్రారంభమైనట్లు ముస్లింలు భావిస్తారు. ఈ ఏడాది మే 13 లేదా 14వ తేదీ ఈ పండుగ రాబోతోంది.

Eid ul-Fitr 2021 Date, History, meaning, Rituals and Significance

అయితే ప్రతి సంవత్సరం రంజాన్, బక్రీద్ పండుగల ప్రార్థనలు ఈద్గాల దగ్గర జరిగేవి. కానీ ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ఇళ్లలోనే రంజాన్ వేడుకలు, ప్రార్థనలు జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రంజాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Happy Eid Mubarak 2021 Wishes :ఈద్ ఉల్ ఫితుర్ విషెస్, కోట్స్ మీ సన్నిహితులకు పంపండిలా...Happy Eid Mubarak 2021 Wishes :ఈద్ ఉల్ ఫితుర్ విషెస్, కోట్స్ మీ సన్నిహితులకు పంపండిలా...

షవ్వాల్ మాసంలో..

షవ్వాల్ మాసంలో..

ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, షవ్వాల్ నెలలో మొదటి రోజు అంటే ఈద్ ఉల్ ఫితర్ రోజున ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండకూడదనే ఆచారం ఉంది. జాబిల్లి కనబడే తీరును బట్టి.. ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది కూడా రంజాన్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో అందరూ సోషల్ మీడియా ద్వారానే ఈద్ ముబారక్ చెప్పునే పరిస్థితి ఏర్పడింది.

సోదర భావం..

సోదర భావం..

ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, రంజాన్ తొమ్మిదో నెలలో వస్తుంది. ఈ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఈ సమయంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షల్లో ఉంటారు. ఖురాన్ పఠిస్తారు. రోజుకు విధిగా ఐదుసార్లు నమాజ్ చేస్తారు. అలాగే పేదలకు దానధర్మాలు చేస్తారు. సోదరభావాన్ని చాటి చెబుతారు.

రంజాన్ అంటే..

రంజాన్ అంటే..

రంజాన్ మాసం వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీమ్. అయితే కరోనా లాక్ డౌన్ దీనికి దెబ్బకొట్టింది. అయితే కొన్నిచోట్ల మాత్రం వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మాసం ప్రారంభమైనప్పటి నుండి మార్కెట్లన్నీ సందడిగా మారాయి. అయితే సమయం తక్కువగా ఉండటంతో.. వ్యాపారులు అంతగా ఆశించినంతగా జరగడం లేదు.

Ramzan 2021 : రంజాన్ వేళ జకాత్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంతకీ జకాత్ అంటే ఏమిటి?Ramzan 2021 : రంజాన్ వేళ జకాత్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంతకీ జకాత్ అంటే ఏమిటి?

113 సంవత్సరాల క్రితం..

113 సంవత్సరాల క్రితం..

అయితే ఇలాంటి పరిస్థితి సరిగ్గా 113 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ లో మూసీ నది వరదలు వెల్లువెత్తినప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పట్లో ఈద్గాలు, మసీదులు తెరచుకున్నా.. ముస్లింలు మాత్రం ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకుని హంగూ, ఆర్భాటం లేకుండా రంజాన్ ను జరుపుకున్నారు.

ఫితర్ దానం..

ఫితర్ దానం..

ఈ పండుగ రోజున నమాజ్ కు ముందు పేదలకిచ్చే దానమే ఫితర్. అందుకే ఈ పండుగకు ఈద్-ఉల్-ఫితర్ అనే పేరు వచ్చింది. ఉపవాసాల సమయంలో మనుషులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు, తప్పులు జరుగుతుంటాయి. వాటి పరిహారం కోసే దానం చేసేదే ఫిత్రా. ఇలా చేయడం వల్ల అట్టడుగు వర్గాల వారు కూడా ఇతరులతో పాటు పండుగ వేడుకల్లో పాల్గొని, కొత్త బట్టలు ధరించి, మంచి వంటకాలను వండుకుని తినే వీలుంటుంది. ఈ సమయంలో గోధుమలు కానీ, కొంత ధనాన్ని కానీ దానం చేస్తారు.

జకాత్..

జకాత్..

ఇస్లాం సిద్ధాంతం ప్రకారం జకాత్ అంటే దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంపొదిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో అవసరమున్న వారికి కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం ఆ సంవత్సరం పండిన పంట, వ్యాపార సరుకులు, చివరికి తమ వద్ద ఉన్న జంతువులు, పక్షులను కూడా వెలకట్టి అందులో నుండి 2.5 శాతం దానం చేయాల్సి ఉంటుంది. రంజాన్ నెలలో ఇలా జకాత్ ను చెల్లిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు.

Happy Ramadan 2021 Wishes: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...Happy Ramadan 2021 Wishes: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...

ఖురాన్ గ్రంథం..

ఖురాన్ గ్రంథం..

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథం దివి నుండి భువికి రంజాన్ మాసంలోనే వచ్చింది. అందుకే ఈనెలలో ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింపజేయడం వల్ల ఆత్మ ప్రక్షాళన అవుతుంది. దీని వల్ల కామ, క్రోధ, లోభ,మోహ, మద, మత్సరాలు అదుపులో ఉంటాయి. ఇక నెల రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండటం వల్ల వీరికి చాలా విషయాలు తెలుస్తాయి. మనో నిగ్రహం కలుగుతుంది. ఆకలి విలువ ఏంటో తెలుస్తుంది.

ఈద్ ముబారక్..

ఈద్ ముబారక్..

రంజాన్ పండుగ మత సామరస్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. కుల, మత భేదాలులేకుండా హిందువులు, క్రిస్టియన్లు, ఈ పండుగ వేడుకల్లో పాల్గొనడం విశేషం. వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల లీడర్లు, అధికారులు ఈ పండుగ రోజున ఈద్గాలకు వెళ్లి ఈద్-ముబారక్ శుభాకాంక్షలు చెబుతారు.

English summary

Eid ul-Fitr 2021 Date, History, meaning, Rituals and Significance

Here we are talking about the eid UL-fitr 2021 date, history, meaning, rituals and significance. Read on
Story first published:Tuesday, May 11, 2021, 14:06 [IST]
Desktop Bottom Promotion