For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ekadashi 2022 Dates:ఈ ఏడాదిలో ఏకాదశి తేదీలు ఎప్పుడొచ్చాయి.. శుభ ముహుర్తాలివే...

2022 సంవత్సరంలో ఏకాదశి తేదీలు, సమయం, ఆచారాలు మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకోండి.

|

హిందూ పంచాంగం ప్రకారం, శ్రీ మహా విష్ణువును పూజించాలనుకునే వారికి 2022 ఏకాదశి తేదీలు మరియు సమయాలు చాలా ముఖ్యమైనవి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏకాదశి అనేది శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షం అనే రెండు చాంద్రమాన దశలలో పదకొండో చంద్ర రోజు.

Ekadashi 2022 dates, timings, rituals and significance in Telugu

అందుకే, హిందూ క్యాలెండర్ నెలలో రెండు ఏకాదశి నెలలో ఉంటాయి. హిందూ భక్తులు చాలా మంది ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తారు. ఏకాదశి రోజున, భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు.

Ekadashi 2022 dates, timings, rituals and significance in Telugu

హిందూ మతం ప్రకారం, ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో మోక్షాన్ని పొందేందుకు సరైన మానసిక శాంతిని పొందుతామని చాలా మంది నమ్మకం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే 2022 సంవత్సరంలో ఏకాదశి తేదీలు ఎప్పుడొచ్చాయి? శుభ ముహుర్తాల పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

January 2022 Festival Calendar:జనవరిలో సంక్రాంతితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...January 2022 Festival Calendar:జనవరిలో సంక్రాంతితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

వైకుంఠ ఏకాదశి..

వైకుంఠ ఏకాదశి..

ఈ ఏకాదశినే పౌష పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆంగ్ల నూతన సంవత్సరం 2022లో జనవరి 12వ తేదీన గురువారం నాడు సాయంత్రం 04:49 ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు జనవరి 13వ తేదీ సాయంత్రం 7:32 గంటలకు ముగుస్తుంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం, జనవరి 13వ తేదీన వైకుంఠ ఏకాదశిగా పరిగణించనున్నారు.

షట్టిల ఏకాదశి..

షట్టిల ఏకాదశి..

2022 సంవత్సరంలో జనవరి 28వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. ఈ ఏకాదశి జనవరి 28వ తేదీన ఉదయం 2:16 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 11:35 గంటలకు ముగుస్తుంది.

జయ ఏకాదశి..

జయ ఏకాదశి..

2022 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన శనివారం నాడు జయ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి 12వ తేదీ మధ్యాహ్నం 1:52 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:27 గంటలకు ముగుస్తుంది.

విజయ ఏకాదశి..

విజయ ఏకాదశి..

2022 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన శనివారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి 26వ తేదీ ఉదయం 10:39 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం ఉదయం 8:12 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశినే గౌణ విజయ ఏకాదశి అని లేదా వైష్ణవ విజయ ఏకాదశి అని కూడా అంటారు.

అమలకీ ఏకాదశి..

అమలకీ ఏకాదశి..

2022 సంవత్సరంలో మార్చి మాసంలో 14వ తేదీన సోమవారం నాడు అమలకీ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి 13వ తేదీ ఉదయం 10:21 గంటలకు ప్రారంభమై, మార్చి 14వ తేదీ 12:05 గంటలకు ముగుస్తుంది.

పాప విమోచన ఏకాదశి..

పాప విమోచన ఏకాదశి..

2022 సంవత్సరంలో మార్చి మాసంలో 28వ తేదీన సోమవారం నాడు పాప విమోచన ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి మార్చి 27వ తేదీన సాయంత్రం 6:04 గంటలకు ప్రారంభమై, మార్చి 28వ తేదీన సాయంత్రం 4:15 గంటలకు ముగుస్తుంది.

కామద ఏకాదశి..

కామద ఏకాదశి..

2022 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన మంగళవారం నాడు కామద ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి 12వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12:05 గంటలకు ముగుస్తుంది. ఈ ఏకాదశినే వైష్ణవ కామద ఏకాదశి అని కూడా అంటారు.

వరుథిని ఏకాదశి..

వరుథిని ఏకాదశి..

2022 సంవత్సరంలో ఏప్రిల్ 26వ తేదీ వరుధిని ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి ఏప్రిల్ 26వ తేదీన అర్థరాత్రి 1:37 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 27వ తేదీ అర్థరాత్రి 12:47 గంటలకు ముగుస్తుంది.

మోహినీ, అపర ఏకాదశి..

మోహినీ, అపర ఏకాదశి..

2022 సంవత్సరంలో మోహినీ, అపర ఏకాదశిలో మే నెలలో 12, 26వ తేదీల్లో వచ్చాయి. మోహినీ ఏకాదశి మే 11వతేదీ రాత్రి 7:31 గంటలకు ప్రారంభమై, మే 12వ తేదీ సాయంత్రం 6:51 గంటలకు ముగుస్తుంది. అపర ఏకాదశి మే 25వ తేదీ ఉదయం 10:32 గంటలకు ప్రారంభమై, మే 26వ తేదీన ఉదయం 10:54 గంటలకు ముగుస్తుంది.

నిర్జల, యోగిని ఏకాదశి..

నిర్జల, యోగిని ఏకాదశి..

2022 సంవత్సరంలో జూన్ 10, 11, 24వ తేదీల్లో నిర్జల, యోగిని ఏకాదశి వచ్చాయి. నిర్జల ఏకాదశి జూన్ 10వ తేదీన ఉదయం 7:25 గంటలకు ప్రారంభమై, జూన్ 11వ తేదీ తెల్లవారుజామున 5:45 గంటలకు ముగుస్తుంది. యోగిని ఏకాదశి జూన్ 23న రాత్రి 9:41 గంటలకు ప్రారంభమై, జూన్ 24వ తేదీన రాత్రి 11:12 గంటలకు ముగుస్తుంది.

దేవశయని, కామికా ఏకాదశి..

దేవశయని, కామికా ఏకాదశి..

2022 సంవత్సరంలో దేవశయని, కామికా ఏకాదశి జులై 10, జులై 24వ తేదీల్లో వచ్చాయి. జులై 9వ తేదీన సాయంత్రం 4:39 గంటలకు ప్రారంభమై, జులై 10న మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. కామికా ఏకాదశి జులై 23న 11:27 గంటలకు ప్రారంభమై, జులై 24న మధ్యాహ్నం 1:45 గంటలకు ముగుస్తుంది.

శ్రావణ, అజ ఏకాదశి..

శ్రావణ, అజ ఏకాదశి..

2022 సంవత్సరంలో శ్రావణ, అజ ఏకాదశి ఆగస్టు 8, 23వ తేదీల్లో వచ్చాయి. శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 7వ తేదీన రాత్రి 11:50 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 8వ తేదీన రాత్రి గంటలకు ముగుస్తుంది. అజ ఏకాదశి ఆగస్టు 22వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:35 గంటలకు ప్రారంభమై, 23వ తేదీ మంగళవారం ఉదయం 6:06 గంటలకు ముగుస్తుంది.

పార్శ్వ, ఇందిరా ఏకాదశి..

పార్శ్వ, ఇందిరా ఏకాదశి..

2022 సంవత్సరంలో పార్శ్వ, ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 6,7,21వ తేదీల్లో వచ్చాయి. పార్శ్వ ఏకాదశి, వైష్ణవ పార్శ్వ ఏకాదశి సెప్టెంబర్ 6, 7వ తేదీలు మంగళవారం, బుధవారం నాడు వచ్చాయి. సెప్టెంబర్ 6వ తేదీన తెల్లవారుజామున 5:54 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారు జామున 3:04 గంటలకు ముగుస్తుంది. ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి 9:26 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11:34 గంటలకు ముగుస్తుంది.

పాపాంకుశ, రామ ఏకాదశి..

పాపాంకుశ, రామ ఏకాదశి..

2022 సంవత్సరంలో పాపాంకుశ, రామ ఏకాదశి అక్టోబర్ 6, 21వ తేదీల్లో వచ్చాయి. పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 6వ తేదీన రాత్రి 9:40 గంటలకు ముగుస్తుంది. రామ ఏకాదశి అక్టోబర్ 20వ తేదీ గురువారం సాయంత్రం 4:04 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:22 గంటలకు ముగుస్తుంది.

దేవుత్తని, ఉత్పన ఏకాదశి..

దేవుత్తని, ఉత్పన ఏకాదశి..

2022 సంవత్సరంలో దేవుత్తని, ఉత్పన ఏకాదశి నవంబర్ 4, 22వ తేదీల్లో వచ్చాయి. దేవుత్తని ఏకాదశి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6:08 గంటలకు ముగుస్తుంది. ఉత్పన ఏకాదశి నవంబర్ 19వ తేదీన ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై, నవంబర్ 20వ తేదీ ఉదయం 10:41 గంటలకు ముగుస్తుంది.

మోక్షద, సఫల ఏకాదశి..

మోక్షద, సఫల ఏకాదశి..

2022 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 3,4,19వ తేదీల్లో వచ్చాయి. మోక్షద ఏకాదశిని వైష్ణవ మోక్షద ఏకాదశి అని, ఇదే ఏకాదశిని గురువాయూర్ ఏకాదశి అంటారు. మోక్షద ఏకాదశి డిసెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 5:39 గంటలకు ప్రారంభమై, డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున 5:34 గంటలకు ముగుస్తుంది. సఫల ఏకాదశి డిసెంబర్ 19వ తేదీ తెల్లవారుజామున ప్రారంభమై,డిసెంబర్ 20వ తేదీన తెల్లవారుజామున 2:32 గంటలకు ముగుస్తుంది.

English summary

Ekadashi 2022 dates, timings, rituals and significance in Telugu

Here we are discussing about the ekadashi 2022 dates, timings, rituals and significance in Telugu. Have a look
Story first published:Tuesday, January 4, 2022, 16:30 [IST]
Desktop Bottom Promotion