Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడైపోతున్నాయా? అసలు కారణం రాహు దోషమే
వాస్తు అంటే కొంతమంది కొత్తగా ఇళ్లు కట్టేటప్పుడు మాత్రమే చూస్తారని భావిస్తుంటారు. అయితే వాస్తు అంటే ఇళ్లు కట్టేటప్పుడు చూసేది మాత్రమే కాదు ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి,ఏదైనా వస్తువును ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అనేక విషయాలను తెలిస్తుంది. అందుకే చాలా మంది వాస్తు శాస్త్రం(vastu shastram) ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ సంబరాలు మొదలుకానున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే మొదలైపోయాయి. క్రిస్మస్ సమయంలో షాపింగ్ చేసి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు చాలామంది. అయితే కొత్తగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైనా కొనేటప్పుడు వాస్తుకి(vastu) సంబంధించి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

అలా జరుగుతుంటే మీ జాతకంలో రాహుదోషం
నిజానికి కొందరి ఇళ్లల్లో ఏదైనా కొత్తగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొని తీసుకువస్తే అవి చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఒక వస్తువును తీసుకువస్తే మరొక వస్తువు పాడైపోవడం తరచుగా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఇలా జరిగితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు శాస్త్ర కోణంలో ఒకసారి చూడాలి.
వాస్తు ప్రకారం ఎవరి ఇంట్లోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పదేపదే విరిగిపోతుంటే అది వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. ఇలా పదే పదే జరుగుతుంటే మీ జాతకంలో రాహుదోషం ఉండవచ్చని అర్థం. రాహువు చెడు స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. రాహువు చెడు స్థితి ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుంది. ఏదో ఒక కారణంగా వ్యక్తి ఇంటి నుండి డబ్బు బయటకు వెళ్లిపోతుంది. సంపదను కూడబెట్టుకోవడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు ప్రతికూల ప్రభావమే ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ తరచుగా విచ్ఛిన్నం కావడానికి కారణం.
రాహు దోషాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు చేయండి
-నిత్యం శివపురాణాన్ని పఠించండి.
-శివలింగంపై నీరు, నల్ల నువ్వులు సమర్పించండి.
-స్నానం చేసిన తర్వాత ఓం రాం రహ్వే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
-శనివారం నాడు ఆలయానికి విద్యుత్ బల్బు లేదా ఏదైనా ఉపయోగకరమైన ఎలక్ట్రానిక్ వస్తువును దానం చేయండి.
-నీలం రంగు దుస్తులు ధరించండి.
Note: మత విశ్వాసాలు,ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications