For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముడి గురించి మీకు తెలియని విషయాలివే..

శ్రీరాముడి గురించి మీకు తెలియని విషయాలివే:

|

శ్రీరాముడి గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటని వాడు. నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది. భక్తులు అమితమైన భక్తిశ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తారు.

చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.

శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైనవాడని అర్థం. శ్రీరామ చంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ వంటిది. ప్రపంచం శ్రీరాముడి ఆదర్శంగా తీసుకోవాలి.

Facts that you may not know about Lord Rama

శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే, వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అందుకనే, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీరాముడి గురించి కొన్ని విషయాలను మీకు తెలియచేయబోతున్నాము. ఇవన్నీ, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. వీటిని చదివి ఆనందించండి మరి.

'రామ నామం'

'రామ నామం'

రామ నామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్ఛరిస్తే మంచిది. సాక్షాత్తు మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను వేయి సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియచేశాడు. అటువంటి మహాశక్తి శ్రీరామా నామానికి కలదు. ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకీగా మారి రామాయణమనే మహా గ్రంధాన్ని రచించాడు.

రాముని జననం:

రాముని జననం:

శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు. అయితే, సుమారు 10,00,00 ఏళ్ళ క్రితం శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు. ఇంకొక వాస్తవం ఏంటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో అవతరించాడని అంటారు. పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు. రామాయణం అలాగే ఇతర ఇతిహాసాల లోని విషయాలను పరిగణలోకి తీసుకుంటే శ్రీరాముడు క్రీ.శ. 51114లో మధ్యాహ్నం 12:30 సమయంలో జన్మించాడు. శ్రీరాముడి జనన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు.

రఘువంశం:

రఘువంశం:

శ్రీరాముడు సూర్యుని వంశానికి చెందినవాడు.ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందిన వాడు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజుల కీర్తి శ్రీరాముడికి అందింది.

రామరాజ్యం:

రామరాజ్యం:

యుటోపియా పెయిర్వ్డ్ ని ఇండియా చూసి ఉండుంటే, అప్పుడు ఇండియా శ్రీరాముడి పాలనలో ఉందని తెలుస్తుంది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 ఏళ్ళ వరకు పాలించాడు. శ్రీరాముడి పాలనను స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్మషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరు సంపదలతో తులతూగే వారు. స్వాతంత్య్రం తరువాత అటువంటి రోజులను మహాత్మా గాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. 'రామరాజ్యం'గా అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది.

రామనవమి:

రామనవమి:

రామనవమిని శ్రీరామచంద్రుడి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో ఈ రోజున సీతారామకల్యాణాన్ని జరుపుతారు.

శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు

శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు

శ్రీమహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే. సాక్షాత్తూ లక్ష్మీ మాతే సీతాదేవిగా అవతరించింది. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది. శ్రీమహావిష్ణువు శంఖ చక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు. ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు.

రామనవమి శక్తి:

రామనవమి శక్తి:

రామనవమి నాడు శ్రీరాముడిని ధ్యానించడం వలన వెయ్యిరెట్ల ఫలితం కలుగుతుందని అంటారు. శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్దలతో జపించడం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో ఉందని భక్తులు విశ్వాసిస్తారు.

రామావతార లక్ష్యం:

రామావతార లక్ష్యం:

రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏంటనే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతార ఉద్దేశ్యాన్ని తెలియచేసే ఒక కథ ఉంది. సత్య యుగం లేదా త్రేతా యుగానికి ముందు యుగం అనేది మహనుభావులలో నిండి ఉంది. ఆ యుగానికి చెందినవారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేనివారు మోక్షాన్ని పొందలేదు. వారందరు త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు.

పురుషోత్తముడు:

పురుషోత్తముడు:

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేని వాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాదాలచే మన నేల ధన్యమైంది.

సామాజిక బంధాలు:

సామాజిక బంధాలు:

శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియచేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత అలాగే సహనం విలువల గురించి తెలియచేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలి వివరిస్తుంది. కులం, మతం వంటి సామజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియచేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది .

ఆత్మశతృవుని జయించేవాడు

ఆత్మశతృవుని జయించేవాడు

కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు.

ఏక పత్నీవ్రతుడు:

ఏక పత్నీవ్రతుడు:

ఈ రోజు ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. దాదాపు 1000 ఏళ్ళ పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహమాడలేదు. ఆ విధంగా ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు.

రామనవమికి చెందిన శాస్త్రీయ కోణం:

రామనవమికి చెందిన శాస్త్రీయ కోణం:

ఎండాకాలం ప్రారంభ సమయంలో రామనవమి జరుగుతుంది. నీళ్ల కొరత, అధికమైన వేడి వంటి సమస్యలు ఈ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సమయంలో రామనామాన్ని జపిస్తూ వేడుకలో పాల్గొనడం వలన ప్రజలు మానసికంగా ప్రశాంతతకు గురవుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. రాబోయే రోజుల్లో కరవును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ఉపవాసం వలన రోగనిరోధశక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులురావు.

English summary

Facts that you may not know about Lord Rama

Facts that you may not know about Lord Rama,There are certain facts about Lord Rama that you should know. Read to know what are the unknown facts about Lord Rama,
Desktop Bottom Promotion