For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతకు సంబంధించిన ఈ 5 విషయాలు రామాయణంలో ఎప్పటికీ చర్చనీయాంశాలే

సీతా దేవి జన్మ గురించిన వివాదాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు మనం రామాయణ సంస్కరణల్లో ఒకదానిలో వున్న సీతా దేవి గురించిన కొన్ని వాస్తవాలను తీసుకువచ్చాము, కాని ఇది వాల్మీకి వ్రాసినది కాదు.

|

రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం, ఆమె మిధిలా నగర మహారాజు జనకుని దత్త పుత్రిక. కానీ రామాయణం ఒక్క రచనతో ఆగలేదు. గోస్వామి తులసిదాస్ ఈ ఇతిహాసాన్ని తిరిగి వ్రాసారు, భారతదేశంలోని హిందువులు అనుసరిస్తున్న రామాయణం ఇదే. తులసిదాస్ సంస్కరణల వలె, అదే ఇతిహాసానికి సంబంధించిన 300 కంటే ఎక్కువ ఇతర రచనలు(వర్షన్) కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ రాముడు, సీత మరియు రావణుడి కథనాల గురించే రాసినా ప్రతి రచన మరొక రచనకు భిన్నంగా కనిపిస్తుంది.

facts about rama and sita

రామాయణం:

సీతా దేవి జన్మ గురించిన వివాదాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు మనం రామాయణ సంస్కరణల్లో ఒకదానిలో వున్న సీతా దేవి గురించిన కొన్ని వాస్తవాలను తీసుకువచ్చాము, కాని ఇది వాల్మీకి వ్రాసినది కాదు. ఒకసారి చూడండి!

1.రావణాసురుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదు!

1.రావణాసురుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదు!

లంకా దేశపు రాజు రావణుడు నిజమైన సీతాదేవిని అపహరించలేదని రామాయణంలోని కొన్ని సంస్కరణలలో చెప్పబడినది. రావణాసురుడు లంకకు తీసుకుని వెళ్ళింది మాయా సీత అని వీటి సారాంశం. రావణునికి ఇది పార్వతీ దేవి పథకమని అస్సలు తెలీదు. యుధ్ధం ముగిసేవరకు నిజమైన సీతను తన సంరక్షణలోనే ఉంచింది. మాయా సీత, ఆమె తరువాతి జన్మలో ద్రౌపదిగా జన్మించింది అని చెప్తారు. అనగా త్రేతాయుగంలో మాయాసీతే, ద్వాపరయుగంలో ద్రౌపది అని అర్ధం.

2.సీత రావణుని కుమార్తె!

2.సీత రావణుని కుమార్తె!

రామాయణoలోని కొన్ని సంస్కరణలలో, సీతా దేవి రావణాసురునికి మరియు మాండోదరికి పుట్టిన కుమార్తెగా చెప్పబడినది. ఆమె జననానికి ముందు, జ్యోతిష్కులు తమ మొదటి బిడ్డ వారి నాశనానికి కారణం అవుతుందని ఊహించారు. ఇది విన్న రావణాసురుడు తన పరివారాన్ని, చంటి బిడ్డైన సీతాదేవిని సుదూర ప్రాంతములో పాతిపెట్టమని ఆదేశించాడు. అలా పాతిపెట్టిన సీతాదేవి జనక మహారాజుకు దొరికిందని వీటి సారాంశం.

3.సీతాదేవి జన్మస్థలంపై గందరగోళం!

3.సీతాదేవి జన్మస్థలంపై గందరగోళం!

సీతాదేవి జన్మస్థలం గురించిన గందరగోళం కూడా ఉంది. రామాయణంలోని కొన్ని సంస్కరణలలో ఆమె దక్షిణ నేపాల్లోని మిథిలలోని జనక్ పూర్లో జన్మించగా, కొన్ని సంస్కరణలలో మాత్రం బీహార్లోని సీతామర్హి అని చెపుతారు.

4 సీతా దేవి వేదవతి యొక్క పునర్జన్మ!

4 సీతా దేవి వేదవతి యొక్క పునర్జన్మ!

విష్ణువుకు భార్యగా ఉండాలన్న తాపత్రయంతో ఉన్న వేదవతి విష్ణువు గురించి తపస్సు చేయు సమయంలో ఆమెని లైంగిక వేదింపులకు గురిచేసిన రావణుని నుండి తప్పించుకొనే క్రమంలో అగ్నికి ఆహుతి అయిన వేదవతి, తన మరు జన్మలో రావణ సంహారార్ధం సీతాదేవిగా అవతరించిందని కొన్ని సంస్కరణల సారాంశం.

5. పునర్జన్మ

5. పునర్జన్మ

ఇదే విధమైన సిద్దాంతం ఆనంద రామాయణంలో కూడా కనుగొనబడింది, అక్కడ వేదవతికి బదులుగా పద్మ గురించి చెప్పబడింది, పద్మ పద్మక్షుని కుమార్తె . ఒకసారి రావణాసురుడు ఆమెను మచ్చిక చేసుకుని, ఆమెను లైంగిక వేదింపులకు గురిచేయాలని ప్రయత్నించగా తనను తాను సజీవ దహనం చేసుకుంది. ఆ స్థానంలో 5 వజ్రాలు కనిపిoచగా వాటిని ఒక పెట్టెలో ఉంచి తనతో లంకకు తీసుకుని వెళ్ళాడని చెప్పబడింది.

6. సీత పద్మ యొక్క పునర్జన్మ:

6. సీత పద్మ యొక్క పునర్జన్మ:

రావణాసురుని భార్య మండోదరి ఆ పెట్టెను తెరిచినప్పుడు, ఆమె వజ్రాల స్థానంలో ఒక పసి బిడ్డ కనపడేసరికి ఆశ్చర్యపోతుంది. ఎంతో విజ్ఞానవంతురాలైన మండోదరి, రావణాసురుని మృత్యువుగా ఆ బిడ్డను కనుగొంది. తన భర్తను కాపాడుకొనే క్రమంలో భాగంగా అంతఃపురంలో ఉండగా తన భర్తను ఏమీ చేయలేదని శిశువుని శపించింది.

వెంటనే తన సేవకులను పిలిచి, ఆ శిశువు ఉన్న పేటికను దూరంగా పారవేసేందుకు ఆదేశించింది. ఆ క్రమంలో భాగంగానే, సేవకులు అనేక ప్రాంతాలను కలియతిరిగి దూరంగా మిదిలానగరంలో పాతిపెట్టగా చివరకు జనకునికి నాగేటి చాలులో ఆ పేటిక దొరికింది.

నాగేటి చాలులో దొరికిన కారణాన సీతగా నామకరణం చేసిన జనకుడు, శివ ధనుర్భంగం గావించిన శ్రీరామునికిచ్చి కల్యాణం చేశాడు.

7. కథనాలు కోకొల్లలు

7. కథనాలు కోకొల్లలు

ఇలాంటి అనేక కథనాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, మరొక కథనం ప్రకారం, సీతను అపహరించడానికి రావణాసురుడు వచ్చే ముందు, రావణుని రాకను గమనించిన అగ్ని దేవుడు సీతను తనతో తీసుకుని వెళ్లి, ఆమె స్థానంలో వేదవతి మరుజన్మ అయిన మాయాసీతను ఉంచగా, రావణాసురుడు మాయాసీతను నిజమైన సీతగా భ్రమపడి తీసుకుని వెళ్ళాడని, ఆ తర్వాత అసుర సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించగా అగ్నిదేవుని కడకు వేదవతి వెళ్లి, సీతను తిరిగి రాముని చెంతకు పంపినట్లుగా కూడా కథనాలు ఉన్నాయి. అనేక సంస్కరణల ప్రకారం, ఈ మాయా సీత వృత్తాంతం అంతా రామునికి కూడా తెలుసునని, లోక కల్యాణం, అసుర సంహారార్ధం నీతి నియమాలకు లోబడిన రాముడు ధర్మ సంస్థాపనకై యుద్ధం చేసి రావణుని సంహరించాడని చెప్పబడింది.

ఇప్పటికీ ఇటువంటి అనేక అంశాల గురించిన చర్చలు వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆద్యాత్మిక వివరాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Facts That You Didn't Know About Sita

Devi Sita, the adopted daughter of King Janak and consort of the great Lord Ram, is the female protagonist of the Hindu epic Ramayana written by Maharishi Valmiki. Even though she is said to be an incarnation of goddess Laxmi, the goddess of all the worldly comforts, Devi Sita spent a period of 14 years of exile in a forest, following her husband, setting up an example of loyalty and patience to the world.
Story first published: Tuesday, June 12, 2018, 16:00 [IST]
Desktop Bottom Promotion