For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వవిఖ్యాతిగాంచిన మైసూర్‌ దసర వేడుకలకున్న ప్రాముఖ్యత...

|

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా జరుపుకుంటారు. ఈ వేడుకలనే నవరాత్రి ఉత్సవాలు అని కూడా అంటారు. విజయదశమి దసరాలో అత్యంత మంగళప్రదమైన దినంగా పరిగణిస్తారు.

చెడుపై సత్యం విజయానికి విజయదశమి సూచిస్తుందని చరిత్ర అంటోంది. ఇదే రోజు తల్లి చాముండేశ్వరి దేవి మహిషాసురుడిని హతమార్చింది. మైసూరు దసరా ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్రే వుంది. ఈ వేడుకులు దేశ విదేశాలకు చెందిన అశేష ప్రజానీకాన్ని ఆకర్షిస్తాయి.

మైసూరు దసరా వేడుకలు 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యం పతనమైపోయిన తరువాత మైసూరుకు చెందిన వడయార్‌ రాజవంశస్తులు దసరా వేడుకలను కొనసాగించారు. రాజా వడయార్‌ (1578-1617) 1610 ఏడాదిలో శ్రీరంగపట్నంలో దసరా వేడుకలు నిర్వహించారు.

దసరా వేడుకలు పూర్తి అయ్యే వరకు మైసూరు రాజమందిరం (ప్యాలెస్‌) దీపాలు జాజ్వల్యమానంగా వెలుగుతూవుంటాయి. మైసూరు లోని చాముండి కొండపై చాముండి ఆలయంలో రాజదంపతులు తల్లి చాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేయడంతో దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. దసరా మహోత్సవాలకున్న ప్రాముఖ్యత గురించి మరికొన్ని వివరాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా...

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఆ తరువాత మైసూరు ప్యాలెస్ లో ఒక ప్రత్యేక దర్బార్‌ జరుగుతుంది. 1805లో క్రిష్ణరాజ వడయార్‌ హయాంలో దసరా సంబరాల్లో ప్రత్యేక దర్బార్‌ నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఈ దర్బారుకు రాజకుటుంబం, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు, సామాన్యప్రజానీకం హాజరవుతారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

వడయార్‌ వంశీకుడు, నేటి యువరాజు యదువీర కృష్ణ దత్త ఒడయార్ (దత్తపుత్రుడు) ఈ సంవత్సరం

ప్రయివేటు దర్బారు నిర్వహించారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరాల్లో తొమ్మిదవ రోజైన మహానవమి కూడా ఎంతో మంగళప్రదమైంది. ఈ రోజున రాజఖడ్గాన్ని పూజించి ఏనుగులపైన, ఒంటెలపైన, గుర్రాలపైన ఊరేగింపులో ప్రదర్శిస్తారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఈ ఊరేగింపు విజయదశమినాడు మైసూరు నగర వీధుల్లో జరిగే దసరా ఊరేగింపు వేడుకల్లో ప్రధాన ఘట్టం. మైసూరు రాజమందిరం వైభవం శోభ అంతా మన కళ్ల ముందు మూర్తీభవిస్తుంది.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఆకర్షణీయంగా అలంకరించిన ఏనుగుపై 750 కేజీల బరువు ఉన్న బంగారు మంటపాన్ని (అంబారి) ఉంచి ఆందులో చాముండేశ్వరీ అమ్మవారిని ఊరేగింపు చెయ్యడం ప్రధానమైన అంశం.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఊరేగింపులో తీసుకుపోయే ముందు అమ్మవారి విగ్రహాన్ని రాజదంపతులు ఇతర ఆహ్వానితులు పూజిస్తారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

రంగురంగుల బొమ్మలు, డాన్సు గ్రూపులు, బ్యాండ్‌ మేళాలు, అలంకరించిన ఏనుగులు, గుర్రాలు ఒంటెలు నడుమ మైసూరు రాజమందిరం దగ్గర మొదలై ఊరేగింపు జమ్మి మంటపం వద్ద ముగుస్తుంది.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాభారతంలో ఒక కథ ప్రకారం పాండవులు ఒక ఏడాది అజ్ఞాత వాసంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచివుంచారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

యుద్ధానికి వెళ్లే ముందు విజయం సాధించడం కోసం రాజులు జిమ్మి చెట్టును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

విజయదశమి నాడు జమ్మి మంటపం వద్ద ఆరుబయట జరిగే కాగడాల కవాతుతో ఉత్సవాలు ముగుస్తాయి.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

మైసూరు ప్యాలెస్‌ కు ఎదురుగా ఉండే గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రదర్శన మైసూరు దసరా వేడుకల్లో మరో ప్రముఖ ఆకర్షణ.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరాలో మొదలయ్యే ఈ ఎగ్జిబిషన్‌ డిసెంబర్‌ నెల వరకూ జరుగుతుంది. బట్టలు, ప్లాస్టిక్‌ వస్తువులు, వంటపాత్రలు, అలంకరణ సామగ్రి, తినుబండారాలు విక్రయించే దుకాణాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

ప్రజలకు వినోదం కల్పించడం కోసం ఒక ఆటస్థలం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శనలో ప్రభుత్వానికి చెందిన వివిద శాఖల అధికారులు తమ తమ పథకాలు సాధించిన విజయాలను చాటే స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

అదే విదంగా మైసూరు నగరంలో యువ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి యువకులు సందర్శించేలా ఆకర్షిస్తోంది.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

పదిరోజుల పాటు మైసూరు నగరంలోని కళావేదికల్లో సంగీత నృత్య కార్యక్రమాలు జరుగుతాయి. దేశం నలుమూలలనుంచీ కళాకారులు వచ్చి తమ కళా ప్రతిభను ప్రజలకు చవిచూపిస్తారు.

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

దసరా ఉత్సవాలకు నియలం : మైసూర్

మైసూరు దసరా ఉత్సవాల్లో జరిగే కుస్తీ పోటీలకు (మల్లయుద్ధం) భారతదేశంలోని నలుమూలల నుంచీ మల్లయోధులు విచ్చేస్తారు.

English summary

Famous Dasara (Navratri) Festival Celebrations of Mysore

Famous Dasara (Navratri) Festival Celebrations of Mysore,According to a legend of the Mahabharata, the Banni tree was used by the Pandavas to hide their weapons during their one-year period of Agnatavasa (living life incognito). Before undertaking any warfare, the kings traditionally worshipped this tree to help them emerge victorious in the war. The Dasara festivities would culminate on the night of Vijayadashami with an event held in the grounds at Bannimantap called as Panjina Kavayatthu (torch-light parade).
Desktop Bottom Promotion