Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎంతకీ పెళ్లి కావడం లేదా? గోమాతకు వీటిని తినిపిస్తే త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారు
పెళ్లి అనే సంబంధంలోకి ప్రతి ఒక్కరూ కొద్దిగా ముందో వెనకో అడుగుపెడతారు. మేం అసలు పెళ్లే చేసుకోము అనే వారి గురించి వదిలేస్తే.. ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్దదైన ఈ పండగ చుట్టూ చాలా మందికి చాలా ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ కొంత మందికి ఈ పెళ్లి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఒకవైపు వయస్సు మీద పడుతూ ఉంటుంది. అయినా ఒక్క సంబంధం కూడా సెట్ అవదు. 30ల్లోకి వచ్చినా పెళ్లి సంబంధం ఖాయం కాక తెగ ఇబ్బంది పడిపోతుంటారు. బట్ట, పొట్ట ఉన్న వాళ్ల పరిస్థితి ఇక చెప్పక్కర్లేదు.

ఎప్పుడు జరగాల్సిన కార్యం అప్పుడు జరిగితేనే బాగుంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఇతర సమస్యలు వస్తుంటాయి. కొందరికైతే చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, కానీ ఒక్కటీ ఖాయం అవదు. ఇష్టాయిష్టాల కారణంగా సంబంధం వద్దనుకోవడం ఒకటైతే.. జ్యోతిష సమస్యల కారణంగా సంబంధాలు ఖాయం కాకపోవడం కూడా ఒకటి. పెళ్లి ఖాయం కాక ఇబ్బంది పడేవారు గోమాతకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినిపిస్తే త్వరలోనే పెళ్లి ఖాయం అవుతుందని అంటున్నాయి శాస్త్రాలు. పవిత్రతకు, శుభానికి చిహ్నమైన గోమాతకు.. ఆహారం పెట్టడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని, అందులో పెళ్లి సంబంధం ఖాయం కావడం కూడా ఒకటని అంటున్నారు.
గోమాత విశిష్టత
భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. ఆవుల పాలతో పాటు మూత్రం, పేడ కూడా ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఉదయం వేళ ఆవును కళ్లారా చూసి దినచర్యను ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావిస్తుంటారు. గోవు సకల దేవతా స్వరూపం, సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారని అంటారు. అలాంటి గోమాతకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినిపించడం వల్ల పెళ్లి ఖాయం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గోమాతకు వీటిని తినిపిస్తే పెళ్లి సెట్ అవుతుంది
గోమాతకు కొన్ని పదార్థాలు తినిపించడం అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పెళ్లి కాక ఇబ్బంది పడేవారు, సంబంధం ఖాయమై ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే వారు, ఇతర కారణాల వల్ల ఏ సంబంధం కూడా సెట్ కానివారు గోమాతకు టమాటాలు తినిపించాలట. గోవుకు టమాటాలు తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఎర్రటి, చక్కగా పండిన టమాటాలు తినిపిస్తే.. చాలా త్వరలోనే సంబంధం ఖాయం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు పెరుగుతాయి. బయట తిరిగే ఆవులకైనా, లేదా గోశాలలో ఉన్న గోవులకైనా టమాటాలు తినిపించవచ్చు. టమాటాలతో పాటు వాటిని వాడి తయారు చేసే ఇతర పదార్థాలు గోవులతో తినిపించినా అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications