For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

August 2021:శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో చూసెయ్యండి...

2021 ఆగస్టు మాసంలో వచ్చే పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం మరి కొద్దిరోజుల్లో పూర్తి కాబోతోంది. శ్రావణ మాసంలోకి అడుగుపెట్టబోతున్నాం. హిందువులకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. తెలుగు క్యాలెండర్ ప్రకారం, 2021 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది.

Festivals and Vrats in the month of August 2021

ఈ మాసంలో సోమవారం వ్రతం నుండి వరలక్ష్మీ వ్రతం, తులసీ దాస్ జయంతి, వినాయక చతుర్థి, నాగ పంచమి, భాను సప్తమితో పాటు జన్మాష్టమి వరకు అనేక పండుగలు వస్తాయి. ఈ సందర్భంగా ఆగస్టు మాసంలో ఇంకా ఏయే పండుగలు, వ్రతాలు వచ్చాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Festivals and Vrats in the month of August 2021

Shravana maasam 2021: శ్రావణ మాసంలో శివుడిని ఇలా పూజిస్తే.. కచ్చితంగా ఫలితమొస్తుందట...!Shravana maasam 2021: శ్రావణ మాసంలో శివుడిని ఇలా పూజిస్తే.. కచ్చితంగా ఫలితమొస్తుందట...!

శ్రావణ సోమవారాలు..

శ్రావణ సోమవారాలు..

ఈ మాసంలో సోమవారాలన్నింటినీ హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో వచ్చే సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతారు. మహా శివరాత్రి తర్వాత శివుడికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక చివరి సోమవారం నాడు శివపార్వతీ దేవుళ్లను పూజిస్తారు. అదే విధంగా శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం నిర్వహిస్తారు.

నాగ పంచమి..

నాగ పంచమి..

శ్రావణ మాసంలో నాగ పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు పుట్టలకు వెళ్లి నాగుపాములకు పాలు పోస్తారు. నాగదేవత అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. ఈ పండుగను 2021 ఆగస్టు 13వ తేదీన జరుపుకుంటారు. ఇదే రోనజు విష్ణువు యొక్క పదో అవతారమైన కల్కి జయంతిని జరుపుకుంటారు.

భాను సప్తమి..

భాను సప్తమి..

2021 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన భానుసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యు భగవానుడు తన రథం మరియు ఏడు గుర్రాలపై తొలిసారిగా భూమిపైకి దిగినట్లు ఈరోజు సూచిస్తుంది. ఈరోజునే భూమిపై జీవితం ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. అందువల్ల ప్రజలు ఈరోజును సూర్యుడికి అంకితం చేశారు. ఇదే రోజున గొప్ప సాధువు, కవి, రచయిత తులసిదాస్ జన్మదినాన్ని సూచిస్తుంది. హిందూ ఇతిహాసం రామాయణం రాసింది ఈయనే హిందూ మతాన్ని హైలెట్ చేయడానికి ఈయన ఎంతో క్రుషి చేశారు. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో దుర్గాష్టమి నెలవారీ పండుగను కూడా ఇదే రోజున జరుపుకుంటారు.

Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...Shravana maasam 2021: శ్రావణ మాసంలో ఎన్ని ప్రత్యేకతలో మీరే చూడండి...

వరలక్ష్మీ వ్రతం..

వరలక్ష్మీ వ్రతం..

2021 సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీ ఈ పండుగ వచ్చింది. శ్రావణ మాసంలో దక్షిణ భారతదేశంలో పాటించే అత్యంత ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ పండుగను లక్ష్మీ దేవికి అంకితం చేశారు. ఈరోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇదే రోజున ప్రదోష్ వ్రతం కూడా చేస్తారు. ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తారు.

ఓనమ్ పండుగ..

ఓనమ్ పండుగ..

2021 సంవత్సరంలో ఆగస్టు 21వ తేదీన ఓనమ్ పండుగను కేరళలో ఘనంగా జరుపుకుంటారు. ఇది వరి పంటను మరియు రాజు మహాబలి తన ప్రజలను సందర్శించిన రోజును సూచిస్తుంది. ఈ పండుగ దేశవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందింది. ఈ పండుగ అత్యంత మతసామరస్యంతో జరుపుకుంటారు.

రక్షాబంధన్..

రక్షాబంధన్..

2021 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన రాఖీ పౌర్ణమి(రక్షా బంధన్) పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ పండుగ రోజున సోదరుల చేతికి సోదరీమణులు రాఖీ కట్టి వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులను రక్షిస్తామని ప్రమాణం చేస్తారు. ఈ పండుగ సోదర, సోదరీమణుల మనోహరమైన బంధాన్ని సూచిస్తుంది.

బలరామ్ జయంతి.

బలరామ్ జయంతి.

2021 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన బలరామ్ జయంతిని జరుపుకుంటారు. వ్యవసాయం మరియు పంటల దేవునిగా బలరాముడిని సూచిస్తుంది. ఈయన శ్రీక్రిష్ణుడికి అన్నయ్య కూడా. ఈ పండుగ ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందింది.

క్రిష్ణాష్టమి..

క్రిష్ణాష్టమి..

2021 సంవత్సరలో ఆగస్టు 30వ తేదీన విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీక్రిష్ణ జన్మదినాన్ని సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున క్రిష్ణుడి అనుగ్రహం కోసం చాలా మంది భక్తులు కఠినమైన ఉపవాస దీక్ష మరియు భక్తి కీర్తనలు పాటిస్తారు. ఈరోజున చిన్నారులకు క్రిష్ణుని అలంకారం చేసి పూజిస్తారు. మరోవైపు ఇదే రోజు కాళి దేవతను కూడా పూజిస్తారు. ఈమెను శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు.

English summary

Festivals and Vrats in the month of August 2021

Here are the festivals and vrats in the month of august 2021. Have a look
Desktop Bottom Promotion