For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

January 2021 Festival Calendar:ఈ నెలలో వచ్చే పండుగలు, వ్రతాలు, ముఖ్యమైన తేదీలివే...!

2021 జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

|

2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా.. సంతోషకరంగా 2021 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోని తొలి నెల(జనవరి)లో ఉపవాసాలు, పండుగలు కూడా ప్రారంభం కానున్నాయి.

Festivals and Vrats in the month of January 2021

2020 సంవత్సరంలో చాలా పండుగలు కళ తప్పాయి. చాలా మంది ప్రజల్లో కూడా ఉత్సాహం తక్కువగానే కనిపించింది. దీనంతటికి కారణం కరోనా మహమ్మారినే. కానీ ఈ 2021 కొత్త సంవత్సరం అయినా బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంపైనా చాలా మంది ఎక్కువ అంచనాలు ఉన్నాయి. జనవరి నెల అనగానే ప్రతి ఒక్కరికీ సంక్రాంతి, పొంగల్, కోడి పందేలు, జల్లికట్టు ఉత్సవాలే గుర్తుకొస్తాయి. ఈ సందర్భంగా ఈ నెలలో వచ్చే ప్రధానమైన ఉపవాసాలు, పండుగలు, ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

New Year Vastu Tips : ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట...!New Year Vastu Tips : ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట...!

జనవరి 2, 2021 : సంకష్ట చతుర్థి..

జనవరి 2, 2021 : సంకష్ట చతుర్థి..

జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం జరుపుకున్న మరుసటి రోజే అంటే జనవరి 2వ తేదీన శనివారం నాడు సంకష్ట చతుర్థి ఉపవాసాన్ని పాటిస్తారు చాలా మంది హిందువులు. ప్రతినెలా క్రిష్ణ పక్ష చతుర్థి రోజున సంకష్ట చతుర్థి ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో వినాయకుడిని పూజిస్తారు.

జనవరి 9, 2021 : సఫాలా ఏకాదశి..

జనవరి 9, 2021 : సఫాలా ఏకాదశి..

2021 సంవత్సరంలో తొలి సఫాలా ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ప్రతి మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫాలా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు.

జనవరి 10, 2021 : ప్రదోష్ వ్రతం..

జనవరి 10, 2021 : ప్రదోష్ వ్రతం..

జనవరి 10, 2021న ఆదివారం రోజున క్రిష్ణ ప్రదోష్ వ్రతం పాటించనున్నారు. ఈ పర్వదినాన చాలా మంది ఆ పరమేశ్వరుడిని కొలుస్తారు. ఆ దేవుని ఆశీర్వాదం పొందేందుకు ప్రదోష్ వ్రతాన్ని నిర్వహిస్తారు.

జనవరి 11, 2021 : మాస శివరాత్రి..

జనవరి 11, 2021 : మాస శివరాత్రి..

హిందూ పంచాంగం ప్రకారం, క్రిష్ణ పక్షంలోని చతుర్దశిలో ప్రతి మాసంలోనూ శివరాత్రిని జరుపుకుంటారు. ముఖ్యంగా జనవరి నెలలో, మాస శివరాత్రి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది జనవరి నెలలో 11వ తేదీ ఈ మాస శివరాత్రి వచ్చింది.

జనవరి 13, 2021 : భోగి పండుగ..

జనవరి 13, 2021 : భోగి పండుగ..

ప్రతి సంవత్సరం జనవరి నెలలో భోగి పండుగ వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి భోగిమంటలు వేస్తారు. అలాగే మహిళలు తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసి అందంగా ముస్తాబవుతారు. ఈ పండుగను లోహ్రీ పేరిట ఉత్తర భారతంలోనూ ఘనంగా జరుపుకుంటారు.

జనవరి 14, 2021 : మకర సంక్రాంతి..

జనవరి 14, 2021 : మకర సంక్రాంతి..

హిందూ పంచాంగం ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచరించనప్పుడు మకర సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజునే మకర సంక్రాంతి అని అంటారు.

పొంగల్..

పొంగల్..

జనవరి 14వ తేదీ ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతిని పొంగల్ పేరిట ఉత్సవాలు జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తారు. తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలు నిర్వహిస్తారు.

జనవరి 15, 2021 : కనుమ పండుగ..

జనవరి 15, 2021 : కనుమ పండుగ..

ఈ పండుగ వ్యవసాయంతో ముడి పడి ఉంటుంది. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగను మూడురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకుంటారు.

జనవరి 16, 2021 : వినాయక చతుర్థి..

జనవరి 16, 2021 : వినాయక చతుర్థి..

హిందూ క్యాలెండర్ ప్రకారం, వినాయక చతుర్థి పండుగను ప్రతి మాసంలో శుక్ల పక్షం చతుర్థి రోజున జరుపుకుంటారు. వినాయక చతుర్థి ఉపవాసం జనవరి 16వ తేదీన శనివారం జరగనుంది. ఈ పవిత్రమైన రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

20 జనవరి, 2021 : గురు గోవింద్ సింగ్ జయంతి..

20 జనవరి, 2021 : గురు గోవింద్ సింగ్ జయంతి..

2021 సంవత్సరంలో గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 20న జరుపుకుంటారు. ఈయన శౌర్యం మరియు ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. గురు గోవింద్ సింగ్ జీ బీహార్లోని పాట్నాలో శుక్ల పక్షంలో ఏడో రోజున జన్మించాడు.

24 జనవరి 2021 : పుత్రదా ఏకాదశి..

24 జనవరి 2021 : పుత్రదా ఏకాదశి..

చాలా మంది తమకు సంతానం కోసం, పిల్లల శ్రేయస్సు కోసం పుత్రదా ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తుంటారు. ఈ ఏకాదశి, ఈ నెల 24 వ తేదీ అంటే ఆదివారం నాడు వచ్చింది. 25వ తేదీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటారు. ఈరోజున యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.

26 జనవరి 2021 : రిపబ్లిక్ డే..

26 జనవరి 2021 : రిపబ్లిక్ డే..

మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలు చేయబడింది. అందుకే ప్రతి సంవత్సరం 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల, 18 రోజులు పట్టింది.

28 జనవరి 2021 : పౌర్ణమి..

28 జనవరి 2021 : పౌర్ణమి..

పౌష్ పౌర్ణమి జనవరి 28న రాబోతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా శుక్ల పక్షం చివరి తేదీన పౌషా పౌర్ణమి తిథి అని పిలుస్తారు. ఆరోజున ఉపవాసం ఉండటంతో పాటు, పారుతున్న నదిలో స్నానం చేయడం మరియు దాత్రుత్వం చేయడం చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.

31 జనవరి 2021 : సంకష్ట చతుర్థి..

31 జనవరి 2021 : సంకష్ట చతుర్థి..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల క్రిష్ణ పక్షం చతుర్థి రోజున సంకష్ట చతుర్థి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుడకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

English summary

Festivals and Vrats in the month of January 2021

To know about those festivals that will be celebrated in January 2021, check out this article.
Desktop Bottom Promotion