For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

May 2022 Vrat And Festivals: మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, శుభముహుర్తాలివే...

మే మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయో ఇప్పుడే తెలుసుకోండి.

|

మన క్యాలెండర్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మే నెలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, రెండో నెల అయిన వైశాఖ మాసం ఈ నెలలోనే వస్తుంది.

Festivals and Vrats in the month of may 2022

ఈ నెలలో అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బుద్ధ పౌర్ణమి వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకోనున్నారు. వీటితో పాటు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కూడా ఇదే నెలలో వచ్చింది.
Festivals and Vrats in the month of may 2022

ఈ నెలలో హిందువులు, ముస్లింలు చాలా రోజుల పాటు ఉపవాసాలు ఉండి భగవంతుడిని ప్రార్థిస్తారు.మే 3వ తేదీనే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, రంజాన్ పండుగ రావడం విశేషం. హిందువులు ఈ నెలలో వినాయక చతుర్థి, శని ప్రదోష్ వ్రతం, బుద్ధ పూర్ణిమ మరియు వైశాఖ పూర్ణిమ రోజునే ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా 2022 మే మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో రానున్నాయి.. ఏ వ్రతాలు ఏ రోజున చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

May Horoscope 2022: మే మాసంలో ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!May Horoscope 2022: మే మాసంలో ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

మే 3న ముఖ్య పండుగలు..

మే 3న ముఖ్య పండుగలు..

2022 సంవత్సరంలో మే 3వ తేదీన అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, రంజాన్ పండుగ రావడం విశేషం. ఈ పవిత్రమైన రోజున హిందువులు, ముస్లిలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా మంది ఉపవాస దీక్షలు ఉన్నారు. ఇదే రోజున ఉత్తరఖాండ్ లోని యమున, గంగోత్రి తలుపులు కూడా తెరచుకుంటాయి.

వినాయక చతుర్థి..

వినాయక చతుర్థి..

మే 4వ తేదీన వినాయక చతుర్థి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున గణేశునికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అలాగే ఈరోజున ఉపవాస దీక్ష చేపడతారు.

మే 10న సీతా నవమి..

మే 10న సీతా నవమి..

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నవమిని ‘జానకి నవమి' లేదా సీతా నవమి అని కూడా అంటారు. శ్రీరామ నవమి మాదిరిగానే సీతా నవమి కూడా చాలా ముఖ్యమైందని భక్తులు భావిస్తారు. ఈరోజున సీతాదేవిని పూజిస్తే.. శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఈరోజునే సీతాదేవి జన్మించిందని చాలా మంది నమ్ముతారు.

Akshaya Tritiya 2022: 50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు శోభన యోగం.. ఏ రాశులకు లాభమంటే...Akshaya Tritiya 2022: 50 ఏళ్ల తర్వాత ఈ రాశులకు శోభన యోగం.. ఏ రాశులకు లాభమంటే...

మే 12న, మోహిని ఏకాదశి..

మే 12న, మోహిని ఏకాదశి..

వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈరోజు చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. శ్రీ మహా విష్ణువును పూజించి.. తమ కోరికలను నెరవేరాలని కోరుకుంటారు. తమకు కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు.

మే 16న, బుద్ధ పూర్ణిమ

మే 16న, బుద్ధ పూర్ణిమ

హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలో అంటే మే 16వ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈరోజే బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ఇది విష్ణువు యొక్క తొమ్మిదో అవతారమని చెబుతుంటారు.

మే 30న సోమవతి అమావాస్య..

మే 30న సోమవతి అమావాస్య..

పురాణాల ప్రకారం, ఈ నెలలోనే త్రేతా యుగం ప్రారంభమైంది. ఈ నెలలో ప్రతిరోజూ చాలా ధర్మంగా పరిగణించబడుతుంది. మే 30వ తేదీన వచ్చే సోమవతి అమావాస్యకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున ప్రవహించే నీటిలో స్నానం చేయడం, పేదలకు విరాళం ఇవ్వడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది.

మరికొన్ని పండుగలు..

మరికొన్ని పండుగలు..

ఇదే నెలలో మరికొన్ని పండుగలు కూడా ఉన్నాయి.

మే 8వ తేదీన ఆదివారం, గంగా సప్తమి

మే 13వ తేదీన శుక్రవారం, ప్రదోష వ్రతం

మే 14వ తేదీన శనివారం, నరసింహ చతుర్దశి

మే 19వ తేదీన గురువారం, గణేష్ చతుర్థి

మే 28వ తేదీన శనివారం, శివ చతుర్దశి

మే 31వ తేదీన మంగళవారం, చంద్ర దర్శనం

శుభ ముహుర్తాలు..

శుభ ముహుర్తాలు..

మే మాసంలో మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మరియు 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు, 24 నుండి 26వ తేదీ వరకు మరియు మే 31వ తేదీ వరకు వివాహానికి శుభ ముహుర్తాలు ఉన్నాయి. మే 11, 12, 13వ తేదీల్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నది, ఊహాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునేముందు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.

FAQ's
  • 2022 మే నెలలో ఏయే ముఖ్య పండుగలొచ్చాయి?

    2022 హిందూ క్యాలెండర్ ప్రకారం, రెండో నెల అయిన వైశాఖ మాసం ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, బుద్ధ పౌర్ణమి వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకోనున్నారు. వీటితో పాటు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కూడా ఇదే నెలలో వచ్చింది. అందులోనూ మే 3వ తేదీనే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బసవ జయంతి, రంజాన్ పండుగ రావడం విశేషం. మే 16న బుద్ధ పూర్ణిమ రాగా.. ఇదే నెలలో మే 30వ తేదీన సోమవతి అమవాస్య కూడా వచ్చింది.

English summary

Festivals and Vrats in the month of may 2022

Here we are talking about the festivals and vrats in the month of may 2022. Have a look
Desktop Bottom Promotion