For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

November Festival Calendar 2021 : ఈ నెలలో దీపావళితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

నవంబరులో దీపావళితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలేంటో తెలుసుకుందాం.

|

మనం మరో రెండు నెలల్లో 2021 సంవత్సరానికి ముగింపు పలకబోతున్నాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అప్పుడే మనం పదకొండో నెల అయిన నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. ఈ సందర్భంగా హిందూ పంచాంగం ప్రకారం నవంబర్ మాసంలో అనేక పెద్ద పండుగలు రానున్నాయి.

Festivals and Vrats in the month of November 2021

ఈ మాసంలో ధన త్రయోదశి, దీపావళి, శ్రీ మహాలక్ష్మీ పూజ, కార్తీక పౌర్ణమి, గోవర్ధన పూజ, ఉత్తర భారతంలో భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పెద్ద పండుగలు రానున్నాయి. నవంబర్ నెలలో తొలి రోజున రామ ఏకాదశితో ప్రారంభం కానుంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా నవంబర్ నెలలో మొత్తం ఏయే పండుగలు వచ్చాయి.. ఏయే రోజున శుభముహుర్తం, ముఖ్యమైన తేదీలు, ఉపవాస సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!

నవంబర్ 1న రామ ఏకాదశి..

నవంబర్ 1న రామ ఏకాదశి..

హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో ఏకాదశిని రామ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నవంబర్ 2న ధన త్రయోదశి..

నవంబర్ 2న ధన త్రయోదశి..

నవంబర్ రెండో తేదీన ధన త్రయోదశి వచ్చింది. దీన్నే దంతేరాస్ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ధన్వంతరి మరియు కుభేరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున ఈ దేవుళ్లకు పూజలు చేసిన వారికి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈరోజున ప్రదోష వ్రతం కూడా పాటిస్తారు. భోలేనాథునికి కూడా పూజలు చేస్తారు.

నవంబర్ 3న, నరక చతుర్దశి..

నవంబర్ 3న, నరక చతుర్దశి..

కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇది దీపావళికి ముందు రోజున వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున సత్యభామ నరకాసురుడిని సంహరించింది. ఈ సందర్భంగా సంతోషంతో ప్రజలంతా మరుసటి రోజు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఈరోజున చిన్న దీపావళి అని కూడా ఉంటారు.

Diwali 2021:దీపావళి వేళ రాశిచక్రాన్ని బట్టి ఇచ్చే గిఫ్టులతో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు...!Diwali 2021:దీపావళి వేళ రాశిచక్రాన్ని బట్టి ఇచ్చే గిఫ్టులతో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు...!

నవంబర్ 4న దీపావళి..

నవంబర్ 4న దీపావళి..

కార్తీక మాసంలో దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగ సమయలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర దీపాలను ఉంచుతారు. ఈ పండుగను అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగను నవంబర్ 4వ తేదీన గురువారం నాడు జరుపుకోనున్నారు. ఈరోజున లక్ష్మీదేవి, వినాయక పూజను కూడా చేస్తారు.

నవంబర్ 5న గోవర్దన పూజ..

నవంబర్ 5న గోవర్దన పూజ..

దీపావళి మరుసటి రోజున గోవర్దన పూజను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ క్రిష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలితో ఎత్తి ప్రజలందర్నీ జడివాన నుండి కాపాడాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈరోజున పవిత్రమైనదిగా భావించి గోవర్ధన పూజలు జరుపుకుంటారు.

నవంబర్ 6న భాయ్ దూజ్..

నవంబర్ 6న భాయ్ దూజ్..

భాయ్ దూజ్ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక. ఈ పండుగ కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుపుకుంటారు. ఈరోజున తమ సోదరీమణులు తమ సోదరుని దీర్ఘాయువు, విజయం కోసం మరియు ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగను ఉత్తర భారతంలో ఎక్కువగా జరుపుకుంటారు.

Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...

నవంబర్ 8న వినాయక చతుర్థి..

నవంబర్ 8న వినాయక చతుర్థి..

ప్రతి నెల శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు వినాయకుడిని పూజిస్తారు. వినాయక చతుర్థి నాడు గణేశుడిని పూజించడం వల్ల అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి.

నవంబర్ 14న విష్ణు ఏకాదశి..

నవంబర్ 14న విష్ణు ఏకాదశి..

కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశిని దేవుని ఏకాదశి అంటారు. ఇది అన్ని ఏకాదశుల కన్నా చాలా ముఖ్యమైనది. దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

నవంబర్ 16న, ప్రదోష వ్రతం..

నవంబర్ 16న, ప్రదోష వ్రతం..

నవంబర్ 16వ తేదీన పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ప్రతి నెలా త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు.

నవంబర్ 19న, కార్తీక పౌర్ణమి..

నవంబర్ 19న, కార్తీక పౌర్ణమి..

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉదయాన్నే నిద్ర లేచి పవిత్రమైన గంగా నదిలో లేదా ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. సాయంత్రం అంటే సూర్యస్తమయం తర్వాత చీకట్లో దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు.

నవంబర్ 30న, ఉత్పన్న ఏకాదశి..

నవంబర్ 30న, ఉత్పన్న ఏకాదశి..

నవంబర్ 30వ తేదీన ఉత్పన్న ఏకాదశి వస్తుంది. నవంబర్ మాసంలో చివరి రోజు, హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి తిథి నాడు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

FAQ's
  • 2021 నవంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేవి?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, 2021 నవంబర్ మాసంలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, కార్తీక పౌర్ణమి, భాయ్ దూజ్ తో పాటు ఏకాదశుల పండుగలు రానున్నాయి.

English summary

Festivals and Vrats in the month of November 2021

Here we are talking about the festivals and vrats in November month. Have a look
Story first published:Saturday, October 30, 2021, 9:26 [IST]
Desktop Bottom Promotion