For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

September Festival Calendar 2021:ఈ నెలలో గణేష్ చతుర్థితో పాటు ఇంకా ఏయే పండుగలొచ్చాయో చూడండి...

2021 సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్ మాసం సంవత్సరంలో తొమ్మిదో నెల. అదే సమయంలో హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ఆరో నెల మరియు భాద్రపద మాసం. హిందూ పురాణాల ప్రకారం, ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Festivals and Vrats in the month of September 2021

ఈ నెలలో అనేక పండుగలు మరియు వ్రతాలు వచ్చాయి. ఈ నెలలో వినాయక చతుర్థితో పాటు మహిళలు తీజ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. వీటితో పాటు ఈ మాసంలో అనేక రకాలైన ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 2021లో ఏయే తేదీన ఏయే పండుగలు వచ్చాయి.. ఏ సమయంలో వ్రతాలు జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీక్రిష్ణ లీలల గురించి తెలుసుకుందామా...శ్రీక్రిష్ణ లీలల గురించి తెలుసుకుందామా...

సెప్టెంబర్ 3న ఏకాదశి..

సెప్టెంబర్ 3న ఏకాదశి..

హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్రపద మాసంలోని క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరం అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూర్తి ఆచారాలతో పూజిస్తారు.

శని ప్రదోష వ్రతం..

శని ప్రదోష వ్రతం..

సెప్టెంబర్ నాలుగో తేదీన శని ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడిని పూజిస్తారు. ఈరోజున ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా, వ్యక్తి జాతకంలో చంద్ర గ్రహం స్థానం బలపడుతుంది.

మాస శివరాత్రి, టీచర్స్ డే..

మాస శివరాత్రి, టీచర్స్ డే..

హిందూ పురాణాల ప్రకారం, శివుని ఆశీస్సులు పొందడానికి మాస శివరాత్రి అనేది చాలా ముఖ్యంగా ఈ మాసంలో సెప్టెంబర్ ఐదో తేదీన నెలవారీ శివరాత్రి జరుపుకుంటారు. అదే సమయంలో ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటారు.

సెప్టెంబర్ 6న అమావాస్య..

సెప్టెంబర్ 6న అమావాస్య..

భాద్రపద మాసంలో క్రిష్ణ పక్షం అమావాస్య సెప్టెంబర్ ఆరో తేదీన వస్తుంది. ఈరోజు చాలా మంది హిందువులు ఉపవాసం ఆచరిస్తారు. తమ కుటుంబ శ్రేయస్సు కోసం పూర్వీకుల నుండి ఆశీర్వాదాలను కోరుకుంటారు.

సెప్టెంబర్ 9న వరాహ జయంతి..

సెప్టెంబర్ 9న వరాహ జయంతి..

భాద్రపద మాసంలో శుక్ల పక్షం మూడో రోజున హర్తాళిక తీజ్ పండుగను ఉత్తర భారతంలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు ఉపవాసం ఉండి.. తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. ఇదే రోజున వరాహ జయంతి కూడా జరుపుకుంటారు. విష్ణువు యొక్క మూడో అవతారం వరాహ అవతారం. ఈ పవిత్రమైన రోజున అతన్ని పూజించడం వల్ల కోరకలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం.

సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి..

సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి..

సెప్టెంబర్ మాసంలో భాద్రపదం శుక్ల పక్షంలో చతుర్థి నాడు గణేష్ చతుర్థి ప్రారంభమవుతుంది. ఈ పండుగ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, 9 రోజులు, పది రోజుల వరకు జరుపుకుంటారు. చివరగా సెప్టెంబర్ 19వ తేదీన అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది.

సెప్టెంబర్ 14న రాధాష్టమి..

సెప్టెంబర్ 14న రాధాష్టమి..

క్రిష్ణ జన్మాష్టమి తర్వాత సరిగ్గా రెండు వారాల తర్వాత రాధాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున క్రిష్ణునికి ప్రియమైన రాధా రాణి జన్మదినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగ సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకుంటారు.

సెప్టెంబర్ 17న పర్వారి ఏకాదశి..

సెప్టెంబర్ 17న పర్వారి ఏకాదశి..

ఈ మాసంలో రెండో ఏకాదశినని పర్వారి ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ హరిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

సెప్టెంబర్ 19న గణేష్ నిమజ్జనం..

సెప్టెంబర్ 19న గణేష్ నిమజ్జనం..

ఈ పవిత్రమైన రోజున గణేష్ నిమజ్జనం దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అనంత చతుర్దశి రోజున గణపతి బప్ప మోరియా అంటూ వినాయకుడి ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 21న పితృపక్షాల ప్రారంభం..

సెప్టెంబర్ 21న పితృపక్షాల ప్రారంభం..

ఈ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన పితృ పక్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో పూర్వీకులను గుర్తు చేసుకుంటూ.. వారి పేరిట ప్రార్థనలు చేస్తారు. పూర్వీకుల సంతోషం కారణంగా, వారి ఆశీర్వాదాలు కుటుంబంపై ఉంటాయని నమ్ముతారు.

FAQ's
  • టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా టీచర్స్ డేని ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు విద్యార్థులందరూ తమ గురువులకు సన్మానం చేసి, వారి సేవలను కొనియాడతారు.

  • సెప్టెంబర్ నెలలో గణేష్ చతుర్థి ఎప్పుడు ప్రారంభమవుతుంది

    సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చతుర్థి ప్రారంభమవుతుంది. ఈ పండుగ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, 9 రోజులు, పది రోజుల వరకు జరుపుకుంటారు. చివరగా సెప్టెంబర్ 19వ తేదీన అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది.

English summary

Festivals and Vrats in the month of September 2021

Here are the festivals and vrats in the month of september 2021. Have a look
Desktop Bottom Promotion