For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

December 2020 : ఈ నెలలో క్రిస్మస్ తో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాల తేదీలివే...

డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే డిసెంబర్ నెలలో కూడా అనేక వ్రతాలు మరియు పండుగలు ఉన్నాయి. ఈ నెలలో ఉత్పన ఏకాదశి, మోక్షాద ఏకాదశి వంటి ఉపవాసాలు ఉంటాయి.

Festivals, Vrats in the month of December 2020

ఈ మాసంలోనే కాలభైరవ జయంతిని కూడా జరుపుకుంటారు. అలాగే చివరి వారంలో క్రిస్మస్ వేడుకలను కూడా జరుపుకుంటారు. వీటితో పాటు ఈ నెలలో ఇంకా ఏయే రోజుల్లో ఏయే పండుగలు, వ్రతాలు జరుపుకుంటారు.. శుభప్రదమైన కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయనే విషయాలను అన్ని ప్రాంతాల వారిని ద్రుష్టిలో ఉంచుకుని ముహుర్తాలు తెలియజేస్తున్నాం. అవేంటో మీరు కూడా చూసేయండి...

గమనిక : ఈ నెలలో శుభ కార్యక్రమాలకు, శుభ ముహుర్తాలు అనేవి అన్ని ప్రాంతాల వారి కోసం నిర్ణయించి తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు కావాల్సిన 'ముహుర్త సమయం' కోసం మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని మీ పేరును బట్టి ముహుర్తాల కోసం అందుబాటులో ఉన్న మరియు అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణులను సంప్రదించి.. తదితర విషయాల గురించి తెలుసుకుని. సరైన ముహుర్తాన్ని అడిగి తెలుసుకోగలరు.

7 డిసెంబర్ 2020 : కాలభైరవ జయంతి..

7 డిసెంబర్ 2020 : కాలభైరవ జయంతి..

డిసెంబర్ ఏడో తేదీన అంటే సోమవారం నాడు తెలుగు క్యాలెండర్ ప్రకారం, మార్గశిర మాసం క్రిష్ణ పక్షమైన ఎనిమిదో రోజున కాలభైరవుని జయంతిని జరుపుకుంటారు. కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈరోజు వివాహాది కార్యక్రమాలకు, అక్షరభ్యాసానికి, విద్యా, వ్యాపార, వాహన ప్రారంభాలకు మంచిగా ఉంటుంది.

11 డిసెంబర్ 2020 : ఉత్పన ఏకాదశి..

11 డిసెంబర్ 2020 : ఉత్పన ఏకాదశి..

మార్గశిర మాసంలో క్రిష్ణ పక్షం యొక్క ఏకాదశిలో ఉత్పన ఏకాదశి రోజున ఉపవాసం పాటించబడుతుంది. ఏకాదశి రోజు విష్ణువుకు అంకితం చేయబడింది. ఈరోజు ఆ దేవున్ని ఆరాధించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది భక్తుల నమ్మకం. ఈరోజున వివాహాది కార్యక్రమాలకు, ఉపనయనాలకు, అన్నప్రాసన వంటి శుభకార్యాలకు అనువైనదిగా ఉంటుంది.

12 డిసెంబర్ 2020 : ప్రదోష్ వ్రతం..

12 డిసెంబర్ 2020 : ప్రదోష్ వ్రతం..

తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల శుక్ల, క్రిష్ణ పక్షాలలో ప్రదోష్ వ్రతాన్ని ఆచరిస్తారు. క్రిష్ణ ప్రదోష్ ఉపవాసం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. ఈరోజున పరమేశ్వరుని ఆశీర్వాదం పొందడానికి ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

13 డిసెంబర్ 2020 : మాస శివరాత్రి..

13 డిసెంబర్ 2020 : మాస శివరాత్రి..

ఈ నెలలో డిసెంబర్ 13వ తేదీన మాస శివరాత్రిని జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలా క్రిష్ణ పక్షం చతుర్దశిలో నెలవారీ శివరాత్రి పండుగను జరుపుకుంటారు. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసాన్ని పాటిస్తారు.

14 డిసెంబర్ 2020 : అమావాస్య, సూర్యగ్రహణం..

14 డిసెంబర్ 2020 : అమావాస్య, సూర్యగ్రహణం..

మార్గశిర మాసంలో డిసెంబర్ 14వ తేదీన అమావాస్య వచ్చింది. ఈరోజును అఘాన్ మరియు పిత్రు అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజున పూర్వపు తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటారు. డిసెంబర్ 14 తేదీ, సోమవారం కావడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది.

15 డిసెంబర్ 2020 : ధను సంక్రాంతి..

15 డిసెంబర్ 2020 : ధను సంక్రాంతి..

డిసెంబర్ 15, మంగళవారం నాడు సూర్య భగవానుడు వ్రుశ్చికరాశిని వదిలి ధనస్సు రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇలా అడుగు పెట్టిన సూర్యుడు 20 జనవరి 2021వరకు ఇక్కడే ఉంటాడు. ఇలా ధనస్సు రాశిలోకి ఆగమనం చేసినందున దీనిని ధను సంక్రాంతి అంటారు.

25 డిసెంబర్ 2020 : మోక్షాద ఏకాదశి..

25 డిసెంబర్ 2020 : మోక్షాద ఏకాదశి..

మోక్షాద ఏకాదశి ఈ నెలలో 25వ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం, ఈరోజు అనేక మందికి మోక్షం లభించింది. అందుకే ఈరోజును మోక్షాద ఏకాదశి అంటారు. ఈరోజున ద్వాపర యుగంలో క్రిష్ణుడు కురుక్షేత్రంలో గీతోపదేశం చేశాడని నమ్ముతారు. అందుకే ఈరోజున గీత జయంతిని కూడా జరుపుకుంటారు.

25 డిసెంబర్ 2020 : క్రిస్మస్ పండుగ..

25 డిసెంబర్ 2020 : క్రిస్మస్ పండుగ..

ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు కోసం క్రిస్టియన్ సోదరులు, ఆంగ్లేయులు వేయి కళ్లతో ఎదురుచూస్తు ఉంటారు. ఎందుకంటే ఈరోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవుల యొక్క ప్రధానమైన పండుగ మేరీ క్రిస్మస్. ఈరోజున క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారు.

30 డిసెంబర్ 2020 : మార్గశిర పూర్ణిమ..

30 డిసెంబర్ 2020 : మార్గశిర పూర్ణిమ..

తెలుగు క్యాలెండర్ ప్రకారం, కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేదే మార్గశిర పూర్ణిమ. ఇది డిసెంబర్ నెలలో 30వ తేదీ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సమయంలో భక్తులందరూ భగవంతుడిని ఆరాధిస్తారు. అలాగే పేదలకు దానం చేస్తారు. వీటితో పాటు ఈరోజు అన్నప్రాసన, నిశ్చితార్థం, వివాహం, హోమం వంటి కార్యక్రమాలకు అనువైనది.

English summary

Festivals, Vrats in the month of December 2020

To know about those festivals that will be celebrated in December month, check out this article.
Desktop Bottom Promotion