For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. జీవితంలో పొందే అత్యంత గొప్ప ఫలితాలు..!

పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. తిధి కన్నా నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పే

By Swathi
|

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీకమాసం ప్రారంభమౌతుంది. కార్తీకమాసంలో ప్రతిరోజూ చాలా విశిష్టమైనది. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా చెబుతారు. కార్తీక పౌర్ణమి అటు శివుడికి, ఇటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. కార్తీక పౌర్ణమి 13వ తేదీ రాత్రి 11:17 నిమిషాలకు మొదలై.. 14వ తేదీ సాయంత్రం 7:22 నిమిషాలకు పూర్తవుతుంది.

For Auspicious Results in Life, Do These Simple Things on Kartik Purnima

పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. తిధి కన్నా నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం..

సర్వపాపాలు

సర్వపాపాలు

కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలి.

ఉసిరిదీపం

ఉసిరిదీపం

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.

365వత్తుల దీపం

365వత్తుల దీపం

కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.

శివుడి దర్శనం

శివుడి దర్శనం

పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే.. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మస్త్య అవతారంలో దర్శనిమిస్తాడు.

పాయసం నైవేద్యం

పాయసం నైవేద్యం

కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కొంతమీరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు.

నరాలకు మంచిది

నరాలకు మంచిది

కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడు కిరణాలు మీమీద పడటం వల్ల నరాలు, కళ్లు రిలాక్స్ అవుతాయి. ఈ సారి కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా కంటే..ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు 30శాతం ఎక్కువ వెలుగు, 14శాతం పెద్దగా కనిపించబోతున్నాడు.

హనుమంతుడి అనుగ్రహం

హనుమంతుడి అనుగ్రహం

కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది.

కార్తీకేయుడికి

కార్తీకేయుడికి

కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.

మహామృత్యుంజయ మంత్రం

మహామృత్యుంజయ మంత్రం

కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. ఓం త్రియంభకం యజామయే సుగంధిమ్ పుష్టివర్ధం ఊర్వరుకమివి బంధానాం మృత్యోర్ ముక్షియ మమ్రితాత్ అనే ఈ మంత్రాన్ని 108సార్లు జపించాలి.

సాయంకాల దీపం

సాయంకాల దీపం

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా.. మంచి ఫలితం కలుగుతుంది.

ఆశ్వమేధ యాగం ఫలితం

ఆశ్వమేధ యాగం ఫలితం

ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం చేయడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.

English summary

For Auspicious Results in Life, Do These Simple Things on Kartik Purnima

For Auspicious Results in Life, Do These Simple Things on Kartik Purnima. Kartik Purnima is also known as Dev Diwali (Diwali of the Gods) and Tripuri Purnima (as it marks the victory of Lord Shiva over the demon Tripurasura).
Desktop Bottom Promotion