For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganapathi Homam at Home:ఇంట్లోనే గణపతి హోమం నిర్వహించొచ్చా?

ఇంట్లో గణపతి హోమం చేయడం ఎలా? పూజా సామాగ్రి, పూజా విధానం, మంత్రాలు, ప్రయోజనాలు, ప్రసాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆధ్యాత్మిక విషయాలకొస్తే.. ప్రతి ఒక్క పూజలో విఘ్నాలు తొలగించే వినాయకుడికి తొలి స్థానం ఉంటుంది.

Ganapathi Homam at Home Days, Puja Items List, Procedure, Benefits, Mantras and Prasadam in Telugu

అందుకే వినాయక చవితి పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసుకుంటూ ఉంటారు.

Ganapathi Homam at Home Days, Puja Items List, Procedure, Benefits, Mantras and Prasadam in Telugu

ఇలా ఇంట్లోనే గణపతి పూజ, హోమం, మంత్రాలు పఠించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, కుటుంబ సభ్యులతో సంతోషం పెరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. గణపతి హోమం చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఇంట్లో గణపతి హోమం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? పూజా విధానం ఏంటి? ఏయే మంత్రాలను పఠించాలి.. ఎలాంటి నైవేద్యం సమర్పించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Chaturthi 2021: విఘ్నాలను తొలగించే వినాయక చవితి శుభముహుర్తం ఈ ఏడాది ఎప్పుడొచ్చింది...Ganesh Chaturthi 2021: విఘ్నాలను తొలగించే వినాయక చవితి శుభముహుర్తం ఈ ఏడాది ఎప్పుడొచ్చింది...

గణేష్ చతుర్థి..

గణేష్ చతుర్థి..

ఈ సంవత్సరం, 2021లో గణేష్ చతుర్థి సెప్టెంబర్ పదో తేదీన అంటే ఈ శుక్రవారం నాడు జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, గణేష్ చతుర్థిని భగవంతుడి పుట్టినరోజు (పునర్జన్మ) గా జరుపుకుంటారు. వినాయకుడు మనలో చాలా మందికి అత్యంత ఇష్టమైన దేవుడు. ఈ దేవుని విగ్రహం ఇంటికి తీసుకొచ్చే ముందు.. వినాయకుని విగ్రహం యొక్క తొండం కుడివైపున తిరిగి ఉన్నదే తీసుకుని రావాలి. ఇది తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మినిస్తుందని చాలా మంది నమ్ముతారు. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో ఏమైనా సమస్యలుంటే.. వాటిని అధిగమించడానికి, ఇంట్లో వినాయకుడిని విగ్రహంతో పాటు గణేష్ ఫొటో ఏర్పాటు చేయాలి.

గణపతి హోమం..

గణపతి హోమం..

దేవాలయంలో పుట్టిన నక్షత్రం రోజున గణపతి హోమాన్ని నిర్వహించడం ద్వారా రోగాలను నయం చేయవచ్చు. ఒకే కొబ్బరితో చిన్న స్థాయిలో గణపతి హోమం చేయవచ్చు. ఇది మన చెడులన్నింటికీ పరిష్కారం కనుగొనడంలో సహాయపడుతుంది. అష్టద్రవ్య గణపతి హోమం చేయడం అత్యవసరం. గణపతి హోమానికి కావలసినవి బుట్ట కొబ్బరి లేదా ఎండిన కొబ్బరి, పండు, చెరకు, తేనె, బెల్లం, రొట్టె, పువ్వులు, నువ్వు గింజలు మరియు గణపతి. కొబ్బరికాయల సంఖ్యను పెంచడం ద్వారా మహా గణపతి హోమం కూడా చేయవచ్చు.

మహా గణపతి హోమం వల్ల..

మహా గణపతి హోమం వల్ల..

వినాయక చవితి వంటి పవిత్రమైన రోజున మీ ఇంట్లో మహాగణపతి హోమం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే, మీకు అదృష్టం కూడా కలిసొస్తుంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించే రోజున గణపతి హోమం చేయడం మంచిది. ఇది జీవితంలో మరియు ఇంట్లో శ్రేయస్సు మరియు విజయాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది.

వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

ఎప్పుడు ప్రారంభించాలి..

ఎప్పుడు ప్రారంభించాలి..

గణపతి హోమాన్ని మీ ఇంట్లో ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే ప్రారంభించాలి. అదే సమయంలో మీరు కొత్త ఇంట్లో ప్రవేశిస్తుంటే.. పాలను పొంగించి వేడుకను ప్రారంభించొచ్చు. ఇలా చేయడం వల్ల ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీకు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మీ ఇంట్లో గణపతి హోమం చేయడం వల్ల తక్షణ ప్రభావం లభిస్తుంది.

పూజా సామాగ్రి..

పూజా సామాగ్రి..

మహా గణపతి హోమం సమయంలో.. 108, 336 మరియు 1008 కొబ్బరికాయలను మీ సామర్థ్యం మేరకు ఉపయోగించొచ్చు. గణపతి హోమం ముగింపులో, 24 నువ్వుల గింజలు మరియు 24 మోదకాలను దహనం చేయాలి. దీని వల్ల కచ్చితమైన ఫలితాలను వస్తాయని చాలా మంది నమ్మకం.

ఈ మంత్రాలను జపించాలి..

ఈ మంత్రాలను జపించాలి..

"ఓం గాం గణపతి నమ:", "ఓం శ్రీ గణేశాయ నమ:", "ఓం ఏకాదంతయ నమ: ","ఓం సుముఖాయ నమ:", "ఓం క్షిప్రా ప్రసాదయ నమ:","ఓం భాలాచంద్రయ నమ:" అనే ఈ మంత్రాలను గణపతి హోమం సమయంలో పఠించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ముందు ఈ మంత్రాలను వాడొచ్చు.

ఎలాంటి నైవేద్యమంటే..

ఎలాంటి నైవేద్యమంటే..

ఇంట్లో గణపతి హోమం చేసే సమయంలో బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు గరిక, అరటిపండు, ఉండ్రాళ్లు, కొబ్బరికాయ, వెలగకాయ వంటి వాటితో వినాయక దేవున్ని ఆరాధించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

FAQ's
  • వినాయకుడికి ఏ నూనెతో దీపారాధన చేయాలి..

    గణేష్ చతుర్థి రోజున వినాయకునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.వీటితో పాటు గరిక, అరటిపండు, ఉండ్రాళ్లు, కొబ్బరికాయ, వెలగకాయ వంటి వాటితో వినాయక దేవున్ని ఆరాధించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

English summary

Ganapathi Homam at Home Days, Puja Items List, Procedure, Benefits, Mantras and Prasadam in Telugu

Here we are talking about the ganapathi homam at home days, puja items list, procedure, benefits, mantras and prasadam in Telugu. Read on
Story first published:Friday, September 3, 2021, 15:41 [IST]
Desktop Bottom Promotion