For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష్ చతుర్థి 2019 : మీ బంధు, మిత్రుల మనసును హత్తుకునే మెసేజ్ లను పంపండి..

|

మనకు ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినమే వినాయక చవితి. ఈ ప్రత్యేక పండుగ నాడు మీ బంధు, మిత్రుల మనస్సును హత్తుకునే సందేశాలు (మెసేజ్ లు), సూక్తులను అందరికంటే ముందుగా పంపండి.. ఈ మధ్య చాలా యాప్ లలో పలు రకాల స్టేటస్ లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. కానీ వాటిలో కేవలం ఒకటే ఉంటుంది. కానీ ఈ స్టోరీలో చాలా సందేశాలు, కొటేషన్స్ లభిస్తాయి. అవేంటో మీరే ఒకసారి చూడండి..

Ganesh Chaturthi

మన దేశంలో వచ్చే పండుగల్లో వినాయకచవితికి ప్రముఖ స్థానం ఉంది. శివపార్వతుల ప్రథమ పుత్రుడైన వినాయకుడిని పూజించనిదే మనం ఏ పనిని మొదలుపెట్టము. విఘ్నేశ్వరుని కరుణ, కటాక్షం ఉంటే మనకు ఏ రంగంలో అయినా అపజయం అనేదే ఉండదని నమ్ముతాం. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వచ్చే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు మహారాష్ట, కర్నాటకలో ఘనంగా జరుపుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గణనాథుని నవరాత్రులు, లేదా పదకొండు రోజుల వరకు గణేషుని మండపాలను అందంగా అలంకరిస్తారు. అవి వీక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా కలిగించేలా అలంకారాలను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఒక్కో రోజు ఒక్కోరకమైన అలంకరణతో అందరినీ ఆకట్టుకునేందు ప్రయత్నిస్తారు. కొన్నిచోట్ల పలు రకాల పోటీలను సైతం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల సాంప్రదాయ పోటీలను, మరికొన్ని చోట్ల డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తారు. ఆ తర్వాత చిన్నపిల్లాడి నుంచి యువత అంతా డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, డీజేల మధ్య గానా భజానాతో ఉత్సాహంగా, కోలాహాలంగా నిమజ్జనాన్ని సైతం నిర్వహిస్తారు.

ఇక అసలు విషయాకొచ్చేద్దాం.. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా తాము చేపట్టిన ఏ పని అయినా అందులో విజయం సాధించాలని మనసారా వేడుకుంటాం. అందుకోసమే అందరికంటే ముందుగా అందరినీ ఆకట్టుకునే సందేశాల(మేసెజ్)ను పంపుకుంటాం. ఈ నేపథ్యంలో మాకు తెలిసిన కొన్ని సందేశాలను మీ ముందుకు తీసుకొచ్చాం.. వీటిలో మీకు నచ్చిన సందేశాలను, సూక్తులను షేర్ చేసుకోండి.

శక్లాం భరదరం విష్ణుం

శక్లాం భరదరం విష్ణుం

‘‘శక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ద్యాయేత్, సర్వ విగ్నోప శాంతయే,

అగజానన పద్మార్గం, గజానన మహర్నిషం, అనేేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే.. అని తలచుకుంటూ శ్రీ విఘ్నేశ్వరుని

ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

వచ్చేస్తున్నా.. నేనొచ్చేస్తున్నా..

వచ్చేస్తున్నా.. నేనొచ్చేస్తున్నా..

‘వచ్చేస్తున్నా.. నేనొచ్చేస్తున్నా.. మూషిక వాహనంపై వేగంగా వచ్చేస్తున్నా.. భక్తులారా పూజలకు సిద్ధం కండి.. మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి.. అందరి కంటే ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ గణేష్ చతుర్థి‘

దేవలోకంలోని కైలాసం నుండి బయలుదేరాను..

దేవలోకంలోని కైలాసం నుండి బయలుదేరాను..

‘‘దేవలోకంలోని కైలాసం నుండి బయలుదేరాను.. సెప్టెంబర్ 2వ తేదీకి మీ ముందుకు వచ్చేస్తాను.. ఉండ్రాళ్లు, కుడుములు, పిండి వంటలను రెడీ చెయ్యండి.. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

హలో స్వామి వినాయక..

హలో స్వామి వినాయక..

‘‘హలో స్వామి వినాయక.. ఏక దంత నాయక, నీ కోసం నీ భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరగా రా గణేశా‘‘

తల మీదే.. రక్షణ మీదే..

తల మీదే.. రక్షణ మీదే..

‘'తల మీదే.. రక్షణ మీదే.. ఒక తలపోతే రెండో తల పొందలేరు నాలాగా.. అందుకే వాహనాలు నడిపే వారంతా హెల్మెట్ ధరించండి.. రక్షణ పొందండి..‘‘ అని వినాయకుని రూపంలో సందేశం పంపండి..

మీరు చేసే ప్రతి కార్యంలోనూ

మీరు చేసే ప్రతి కార్యంలోనూ

‘‘మీరు చేసే ప్రతి కార్యంలోనూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయం చేకూరాలని వినాయక చవితి పండుగను మీ బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

ఓం గణానంత్వా గణపతి గం హవామహే

ఓం గణానంత్వా గణపతి గం హవామహే

‘‘ ఓం గణానంత్వా గణపతి గం హవామహే

ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే

నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ

ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భదం

ఓం గం గణపతయే నమ:

మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్యా..

భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్యా..

‘‘భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్యా.. దయతో మాపై కరుణ చూపవయ్యా.. అని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

మీ ఇంట వినాయక చవితి

మీ ఇంట వినాయక చవితి

‘‘మీ ఇంట వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాలని ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులు, అష్టసంపదలు మీకు కలగాలని కోరుకుంటూ

మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

నంది మీ నాన్నగారికి, సింహం మీ అమ్మగారికి..

నంది మీ నాన్నగారికి, సింహం మీ అమ్మగారికి..

‘‘ నంది మీ నాన్నగారికి, సింహం మీ అమ్మగారికి.. ఎలుక తమరికి.. నెమలి తమ్ముడికి రథాలుగా మార్చుకున్న మహనీయులకు శతకోటి వందనాలు.. జై గణేశా.. జైజై గణేశా.. మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

మట్టి విగ్రహాలు పెట్టిన భక్తులకే..

మట్టి విగ్రహాలు పెట్టిన భక్తులకే..

‘‘ఇందు మూలంగా యావన్మంది ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఈసారి మట్టి విగ్రహాలు పెట్టిన భక్తులకే స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రకటించారహో.. మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు‘‘

అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు..

English summary

Ganesh Chaturthi 2019: Messages, Wishes And Quotes To Send To Your Near And Dear Ones

Lord Ganesha's Navratras, or Ganesha Mandapas are beautifully decorated for eleven days. They decorate the decorations so that they are a special attraction for the viewer. Try to impress everyone with a single makeup each day. Sometimes a variety of competitions are held. Traditional competitions are held elsewhere, and dance competitions are held elsewhere. Prizes will also be awarded to the winners.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more