For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021: విఘ్నాలను తొలగించే వినాయక చవితి శుభముహుర్తం ఈ ఏడాది ఎప్పుడొచ్చింది...

2021 సంవత్సరంలో గణేష్ చతుర్థి తేదీ, శుభముహుర్తం, ఆచారాలు మరియు వినాయక చవితి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం చవితి రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన శుక్రవారం ఈ పవిత్రమైన పండుగ వచ్చింది.

Ganesh Chaturthi 2021 Date, Shubh Muhurat, Rituals, History and Significance of Vinayak Chaturthi in Telugu

ఈ పండుగ వచ్చిన సమయంలో వినాయక మిత్ర మండలి సభ్యులు క్షణం కూడా తీరిక లేకుండా వారి వారి పనుల్లో నిమగ్నమయ్యి ఉంటారు. అలాగే హిందూ కుటుంబాలలో చాలా మంది ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా ఎంతో ఆనందంగా కూడా గడుపుతారు.

Ganesh Chaturthi 2021 Date, Shubh Muhurat, Rituals, History and Significance of Vinayak Chaturthi in Telugu

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించిన దగ్గరి నుండి నిమజ్జనం వరకూ రంగు రంగుల పూలు, రకరకాల పండ్లు, సేవలతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలలో పెద్దల కంటే పిల్లల హడావుడే చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడొచ్చింది? శుభ ముహర్తం ఏ సమయంలో ఉంది? వినాయ చవితి ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గణేష్ చతుర్థి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...గణేష్ చతుర్థి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

గణేష్ చతుర్థి శుభ ముహుర్తం..

గణేష్ చతుర్థి శుభ ముహుర్తం..

ఈ ఏడాది 2021లో సెప్టెంబర్ పదో తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శుభ తిథి ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై రాత్రి 9:57 గంటల వరకు ఉంటుంది. గణేష్ చతుర్థి పూజా శుభ ముహుర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:33 గంటల వరకు ఉంటుంది.

చంద్రుడిని చూడకూడదు..

చంద్రుడిని చూడకూడదు..

వినాయక చవితి రోజున చందమామను చూడకూడదనే ఆచారం ఉంది. పురాణాల ప్రకారం ఈరోజు చంద్రుడిని దర్శించుకోవడం నిషేధించారు. ఒకవేళ పొరపాటున మీరు చందమామను చూస్తే మీకు శాపం తగిలే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే.. తర్వాతి రోజు తెల్లని వస్త్రాలు, తెల్లని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచిదని నమ్ముతారు.

భక్తి శ్రద్ధలతో..

భక్తి శ్రద్ధలతో..

విఘ్నేశ్వరుడిని గణేష్ చతుర్థి తిథి రోజున భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి కుటుంబంలో కష్టాలనేవి అస్సలు రావని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే వినాయకుడు ఈ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చారు. విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న శివపార్వతులు.. తమ బిడ్డలిద్దరినీ వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి ఓ పరీక్ష పెడతారు.

విజేత ఎవరంటే..

విజేత ఎవరంటే..

ముల్లోకాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందుగా కైలాసానికి వస్తారో వారే విజేతగా నిలుస్తారని, వారికి విఘ్నాధిపత్యం ఇస్తామని చెబుతారు. దీంతో వెంటనే కార్తీకేయుడు తన వాహనమైన నెమలిని ఎక్కి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అయితే వినాయకుడు తన ఆకారాన్ని తలచుకుని బాధపడకుండా.. తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. అంతే కార్తీకేయుడు ఎక్కడికెళ్లినా తన కంటే ముందే వినాయకుడు ఉండటాన్ని గమనిస్తాడు. అలా శివపార్వతులు పెట్టిన పరీక్షలో నెగ్గి విఘ్నాధిపత్యాన్ని పొందుతాడు వినాయకుడు.

భాద్రపద మాసంలో..

భాద్రపద మాసంలో..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు పుట్టాడని.. విఘ్నాధిపత్యం పొందిన రోజని ఇంకా కొందరు భావిస్తారు. సకలదేవతలకు ప్రభువుగా గణపతి ఉంటాడన్నమాట. మనం ఏ పని అయినా ప్రారంభించే వినాయకుడిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్త పురాణంలో ‘గణ' శబ్దానికి విజ్ణానమని, ‘ణ' అంటే తేజస్సు అని పేర్కొన్నారు.

వేదవ్యాసుడి లేఖకుడిగా..

వేదవ్యాసుడి లేఖకుడిగా..

ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా వినాయకుడిని నియమించాడు. వినాయకుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దాన్ని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారంట.

English summary

Ganesh Chaturthi 2021 Date, Shubh Muhurat, Rituals, History and Significance of Vinayak Chaturthi in Telugu

Here we are talking about the ganesh chaturthi 2021 date, shubh muhurat, rituals and significance of Vinayak Chaturthi in Telugu. Read on
Desktop Bottom Promotion