For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021:వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే...

వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ సంప్రదాయంప్రకారం ప్రతి ఏటా భాద్ర పద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగ జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ పదో తేదీన గణేష్ ఉత్సవాలను జరుపుకోనున్నారు.

Ganesh Chaturthi 2021: Why is moon sighting prohibited on Ganesh Chaturthi?

మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. పూజలు చేస్తూ ఉంటాం. అయితే మొదటి పూజ సకల దేవతగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికే చేస్తాం. ఎందుకంటే వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగిస్తాడని చాలా మంది నమ్మకం. విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు వినాయకుడిని పూజించినట్లు 'రుగ్వేదం' చెబుతోంది. ఈ సందర్భంగా గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటాన్ని నిషేధించారు. దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందట... ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంట్లో గణేష్ పూజ సమయంలో చేయాల్సిన.. చేయకూడని పనులివే...ఇంట్లో గణేష్ పూజ సమయంలో చేయాల్సిన.. చేయకూడని పనులివే...

శివుడి కోసం ఎదురుచూస్తూ..

శివుడి కోసం ఎదురుచూస్తూ..

పురాణాల ప్రకారం..పరమేశ్వరుని కోసం ఎదురుచూస్తు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. స్నానానికి వెళ్తూ కైలాసంలో నలుగు పిండితో ఓ బొమ్మను తయారు చేసింది. చూడముచ్చటగా కనిపించే ఆ ప్రతిమకు తన తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీ దేవి ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసింది.

ఆ బాలుడిని కాపలాగా..

ఆ బాలుడిని కాపలాగా..

అలా ప్రాణ ప్రతిష్ట చేసిన ఆ బాలుడిని తను స్నానానికి వెళ్తూ.. కాపలాగా పెట్టి వెళ్తుంది. అంతలో లోకేశ్వరుడు అక్కడికొస్తాడు. తనను లోపలికి వెళ్లకుండా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఆ సమయంలో నీలకంఠుడు ఆ బాలుడికి ఎంతో నచ్చచెబుతాడు. అయినా ఆ బాలుడు శివుని మాట అస్సలు లెక్కచేయడు. దీంతో కోపోద్రోక్తుడైన పరమేశ్వరుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ సమయంలో పార్వతీ దేవి అక్కడికొస్తుంది. జరిగిన ఘోరం చూసి కన్నీరుమున్నీరవుతుంది.

గజముఖుని శిరస్సు..

గజముఖుని శిరస్సు..

పార్వతీ దేవి బాధను చూసిన శివుడు.. తనను ఓదార్చేందుకు ఆ బాలుడికి తన భక్తుడైన గజముఖుని శిరస్సును తెప్పించి అతికిస్తాడు. తనకు గజాననుడు అని నామకరణం చేస్తాడు. అలా తన శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్ర పద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో ఉండ్రాళ్లు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తినడంతో పొట్ట బాగా ముందుకు ఉబికి వస్తుంది.

గణపతి హోమాన్ని ఇంట్లో జరుపుకోవచ్చా?గణపతి హోమాన్ని ఇంట్లో జరుపుకోవచ్చా?

చంద్రుడికి శాపం..

చంద్రుడికి శాపం..

అనంతరం కైలాసం చేరుకున్న గణనాథుడు తన పొట్టతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే సమయంలో వినాయకుని ఉదరం పగిలి అందులోని కుడుములు, ఉండ్రాళ్లు అన్నీ బయటకొచ్చి అచేతనుడిగా మారిపోతారు. ఈ సంగతి చూసిన పార్వతీ దేవి.. చంద్రుడు చూడటం వల్లే తన కుమారుడు అచేతనంగా మారిపోయాడని.. కాబట్టి తనను వినాయక చవితి రోజున చూసిన వారు.. నిందలు మోయాల్సి ఉంటుందని శాపం విధిస్తుంది.

చంద్రుడిని చూస్తే..

చంద్రుడిని చూస్తే..

అప్పటి నుండి భాద్రపద శుద్ధ చవితి రోజున క్రిష్ణుడు ఆవు పాలను పితుకుతుండగా పాత్రల చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో తనకు కూడా కొన్ని నీలాపనిందలు వచ్చాయి. అది ఏకంగా సత్రాజిత్తుతో గొడవల దాకా వెళ్లింది.

శాస్త్రీయ కారణం..!

శాస్త్రీయ కారణం..!

హిందూ క్యాలెండర్ ప్రకారం, వినాయక చవితిని ఆరో మాసంలో జరుపుకుంటాం. అంటే ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో ఈ పండుగ వస్తుంది. అయితే శుద్ధ చవితి ముందు రోజు, తర్వాతి రోజు చంద్రుడిని చూడకూడదు. ఎందుకంటే నాలుగో రోజైన చవితిని వ్రుద్ధి చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు. అదే సమయంలో భూమి, సూర్యుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. ఈ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో మన ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని పురతాన భారతీయులు వివరించారు. దీన్ని ఓ మూఢ నమ్మకంగా చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఈ కారణం ఉందట.

English summary

Ganesh Chaturthi 2021: Why is moon sighting prohibited on Ganesh Chaturthi?

Here we are talking about the Ganesh Chaturthi 2021: why is moon sighting prohibited on ganesh chaturthi. Read on
Story first published:Wednesday, September 8, 2021, 18:32 [IST]
Desktop Bottom Promotion