For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021:ఇంట్లో గణేష్ పూజ సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులివే...!

|

హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక చవితిని ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఘనంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది 2021లో సెప్టెంబర్ పదో తేదీన అంటే శుక్రవారం నాడు గణేష్ చతుర్థి పండుగ వచ్చింది. కరోనా మూడో దశ ముప్పు ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా చాలా మంది ఇళ్లలోనే వినాయక చవితి పూజను జరుపుకోవాలని అధికారులు సూచించారు.

విఘ్నాలను తొలగించే వినాయకుని విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంట్లో ప్రతిష్టించాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం పెరుగుతాయని చాలా మంది విశ్వసిస్తారు.

అయితే గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. వీటిని అస్సలు మరచిపోకూడదు. లేదంటే మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇంట్లో గణేష్ పూజ చేసే సమయంలో ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganapathi Homam at Home:ఇంట్లోనే గణపతి హోమం నిర్వహించొచ్చా?

పూజకు ముందు..

పూజకు ముందు..

మీ ఇంట్లో వినాయకుని ప్రతిమ ఉంచే ముందు.. మీరు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. పర్యావరణానికి అనుకూలమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని తీసుకురావాలి. వినాయకుని తొండం ఎడమవైపునకు తిరిగి ఉండాలి. అయితే కుడివైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది.

పూజ సమయంలో..

పూజ సమయంలో..

వినాయకుని ప్రతిమను ఇంట్లోకి తెచ్చే సమయంలో ఏదైనా వస్త్రంతో లేదా గణేశుడి తలను కప్పి ఉంచాలి. పూజ ప్రారంభించేంత వరకు అది తీయకూడదు. పూజ ప్రారంభించేటప్పుడు కొంత గంగాజలంతో వినాయకుడి విగ్రహాన్ని శుభ్రం చేయాలి. ఎరుపు రంగు గంధపు తికాలన్ని గణపతి నుదుటిపై ఉంచాలి. అనంతరం విఘేశ్వరుని పవిత్ర మంత్రాలు పఠించాలి. మీరు విగ్రహాన్ని మీ ఇంట్లో ఒకటిన్నర రోజు, మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, పది రోజులు లేదా నిమజ్జనం వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు.

ఇవి ఉంచాలి..

ఇవి ఉంచాలి..

వినాయకుడి పూజ సమయంలో లంబోదరుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, గరిక, కొబ్బరికాయ, వెలగకాయ, లడ్డు, వంటి నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఐదు రకాల పండ్లు, పంచామృతంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. అలాగే వినాయకుడికి కొబ్బరినూనెతోనే దీపారాధన చేయాలి. బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలతో నివేదన చేయాలి.

Ganesh Chaturthi 2021: విఘ్నాలను తొలగించే వినాయక చవితి శుభముహుర్తం ఈ ఏడాది ఎప్పుడొచ్చింది...

దానధర్మాలు..

దానధర్మాలు..

వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి. వినాయక చవితిని గోమాతను కూడా పూజిస్తే మీ సమస్యలు తొలగిపోతాయని.. మీరు ఎలాంటి పోటీలో అయినా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.

ఇక్కడ ఉంచకూడదు..

ఇక్కడ ఉంచకూడదు..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాన్ని అస్సలు ఉంచకూడదు. మీ ఇంటి మెయిన్ గేటుకు ఎదరుగా, ఇంట్లోకి ప్రవేశించే మార్గం సమీపంలో వినాయకుని విగ్రహం ఉంచకూడదు. అలాగే వినాయకుని విగ్రహం బాత్ రూమ్ గోడ సమీపంలో అస్సలు పెట్టకూడదు. అదే విధంగా హాలులో కూడా వినాయక విగ్రహాన్ని ఉంచి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని నివారించాలి.

ఇవి చేయకండి..

ఇవి చేయకండి..

మీ ఇంట్లో నాట్యం చేస్తున్నట్లు ఉన్న వినాయక విగ్రహాన్ని పొరపాటున కూడా ఉంచుకోవద్దు. అలాగే ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ గిఫ్టుగా కూడా ఇవ్వకూడదట. నాట్యం చేస్తున్న వినాయక విగ్రహం ఉంటే, ఆ ఇంట్లో నిత్యం గొడవలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఎవరైనా పెళ్లి సందర్భంగా వినాయక విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వకూడదట. మీ ఇంట్లో విగ్రహాన్ని నేరుగా మీరు నిమజ్జనం చేయకండి. పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన చోటకు వెళ్లి ఇవ్వండి. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో అలంకరణలు తీసేయండి.

ఇళ్లలో వినాయకుని ప్రతిమను ఉంచకూడని ప్రదేశాలు?

మీ ఇంటి మెయిన్ గేటుకు ఎదరుగా..

ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఎదురుగా..

మీ ఇంట్లోని పడకగదిలో..

వాష్ రూమ్ సమీపంలో..

ఇలాంటి చోట్ల వినాయకుని ప్రతిమను ఉంచడం వల్ల మీ ఇంట్లో అశుభ ఫలితాలు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వినాయకునికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి?

వినాయకుడి పూజ సమయంలో లంబోదరుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, గరిక, కొబ్బరికాయ, వెలగకాయ, లడ్డు, వంటి నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. అలాగే ఐదు రకాల పండ్లు, పంచామృతంతో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. అలాగే వినాయకుడికి కొబ్బరినూనెతోనే దీపారాధన చేయాలి. బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలతో నివేదన చేయాలి.

English summary

Ganesh Chaturthi 2021: Do's and Don'ts while performing puja at home in telugu

Here we are talking about the Ganesh Chaturthi 2021:Do's and don'ts while performing puja at home in Telugu. Have a look