For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi Special:విఘ్నేశ్వరుని ఈ అవతారాలను పూజిస్తే.. విఘ్నాలన్నీ తొలగిపోతాయట...!

|

హిందూ పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడు అంటే కేవలం విఘ్నాలు తొలగించడమే కాదు.. తన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని పండితులు చెబుతుంటారు.

వినాయకుని ఆరాధనతో ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కొచ్చని చాలా మంది నమ్మకం. అందుకే అందరూ ఏ పూజ చేసినా ముందు గణపతి పూజతో ప్రారంభిస్తారు. వినాయకుని ఆరాధించడంలోనూ ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందుకే నిదర్శనమే వినాయకుని అవతరాలు.

వినాయకుడు కూడా విష్ణుమూర్తి మాదిరిగా కొన్ని అవతారాల్లో అవతరించాడు. ఆయా సందర్భాల్లో భక్తులను రక్షించేందుకు విఘ్నేశ్వరుడు దాదాపు ఎనిమిది అవతారాలు ఎత్తినట్లు ముద్గల పురాణం చెబుతోంది. ఈ అవతారాలల మాత్సర్యాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు అనే రాక్షసులని జయించేందుకు వక్రతుండుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధుమ్రావర్ణుడు అనే అవతారాలను ఎత్తాడు. ఈ సందర్భంగా ఆ అవతారాల విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ganesh Chaturthi 2021:మీ రాశిని బట్టి వినాయకుని ఇలా పూజిస్తే.. ఆటంకాలన్నీ తొలగిపోతాయట...!Ganesh Chaturthi 2021:మీ రాశిని బట్టి వినాయకుని ఇలా పూజిస్తే.. ఆటంకాలన్నీ తొలగిపోతాయట...!

ఏకదంతుడు..

ఏకదంతుడు..

పురాణాల ప్రకారం.. చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుడిని స్రుష్టించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు తనకు ‘హ్రీం' అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే కచ్చితంగా ఫలితం దక్కుతుందని చెబుతారు. దీంతో లోకాన్ని జయించాలనే ఆశతో మదాసురుడు హ్రీంకారాన్ని కొన్ని యుగాల పాటు జపించాడు. దీంతో అతను కోరుకున్న శక్తులన్నీ లభించాయి. దీంతో దేవతలంతా భయపడిపోయారు. అప్పుడు వారు సనత్ కుమారుని వద్దకు ఏదైనా ఉపాయం చెప్పమని కోరగా.. అప్పుడు సనత్ కుమారుని సూచన మేరకు.. వినాయకుడని ప్రార్థించగా అప్పుడు గణపతి ‘ఏకదంతు'నిగా అవతరించి మదాసురుడిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే గర్వానికి చిహ్నం. ఏకదంతుడు ఈ లోకం యావత్తు ఒక్కటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదు.

వక్రతుండుడు..

వక్రతుండుడు..

పూర్వ కాలంలో ఇంద్రుడు చేసిన ఓ తప్పు వల్ల ‘మాత్సర్యాసురుడు' అనే రాక్షసుడు పుడతాడు. అతని దెబ్బకు ముల్లోకాలన్నీ ఇబ్బందులు పడ్డాయి. అతన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఉపాయం తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరారు. అప్పుడు దత్తాత్రేయుడు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని కోరారు. అప్పుడు ‘గం' అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతి గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని'గా వినాయకుడు అవతరించాడు. మాత్సర్యాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించాడు. వక్రతుండాన్ని ఓంకారానికి ప్రతీకగా భావిస్తారు.

గజాననుడు..

గజాననుడు..

కుబేరుడి ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. ఇతను పరమేశ్వరుని అనుగ్రహంతో ముల్లోకాలను శాసించే వరాన్ని పొందాడు. కానీ ఇతని లోభానికి హద్దు అదుపు లేకుండా పయింది. చివరికి ఆ భోళా శంకరుని కైలాసాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆశపడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణు కోరగా.. తను వినాయకుడిని పూజిస్తే.. లోభాసరుడి నుండి మీకు విముక్తి లభిస్తుందని చెబుతాడు. దీంతో సకలదేవతలందరూ గణేశుడిని ప్రార్థించగా.. వారి ప్రార్థనను మన్నించి ‘గజాననుడి'గా అవతరించి లోభాసురుడిని ఓడిస్తాడు. గజాననుడు అంటే ఏనుగు శిరస్సు కలిగినవాడు. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది.

Ganesh Chaturthi 2021:వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే...Ganesh Chaturthi 2021:వినాయక చవితి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదంటే...

మహోదరుడు..

మహోదరుడు..

పరమేశ్వరుడు ఓ సారి తపస్సులో నిమగ్నమైపోయాడు. ఎంతసేపటికీ తాను తపస్సు నుండి బయటకు రాకపోవడంతో.. పార్వతీదేవి కంగారు పడిపోయింది. అప్పుడు శివుని తపస్సుకు భంగం కలిగించాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఓ గిరిజన యువతిగా మారి ఆయనకు తపోభంగం చేసేందుకు ప్రయత్నించిది. తను చేసిన పొరపాటుకు మోహాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. తను సూర్యుడిని ఆరాధించి ముల్లోకాలపై ఆధిపత్యం సాధించాడు. దీంతో తన ఆగడాలను అడ్డుకునేందుకు వినాయకుడు మహోదరుడిగా అవతరించి.. తనను అంతమొందిస్తాడు..

విఘ్న రాజు..

విఘ్న రాజు..

ఈ అవతారంలో మమతాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించగా.. దేవతలంతా వినాయకుని ప్రార్థిస్తారు. అప్పుడు విఘ్నరాజు అవతారంలో నాగపాముని వాహనం చేసుకుని మమతాసురుడిని మట్టుబెట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి.

వికటుడు..

వికటుడు..

ఈ అవతారంలో కామాసురుడనే రాక్షసుడిని వధించాడు. ఇతను ఘోర తపస్సు చేసి.. పరమేశ్వరుని అనుగ్రహం పొందుతాడు. అప్పటి నుండి ముల్లోకాలపై ఆధిపత్యం చెలాయిస్తాడు. దీంతో ఇతని బారి నుండి కాపాడుకునేందుకు దేవతలంతా వెళ్లి వినాయకుడిని వేడుకొనగా.. తను వికటుని ప్రత్యక్షమై కామాసురుడిని అంతమొందిస్తాడు.

లంబోదరుడు..

లంబోదరుడు..

ఈ అవతారంలో క్రోదాసురుడు అనే రాక్షసుడిని మట్టుబెట్టాడు. క్రోదం ఎల్లప్పుడూ తాను ఇష్టపడిన(ప్రీతి) దాని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో విజయం సాధిస్తే సంతోషం.. ఓడితే ఉద్వేగాలు కలుగుతూ ఉంటాయి.

దూమ్రావర్ణుడు..

దూమ్రావర్ణుడు..

ఈ అవతారంలో వినాయకుడు అహంకరాసురుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రాక్షసుడి పాలనతో విసుగు చెందిన దేవతలందరూ మోక్షం కోసం వినాయకుడిని ధ్యానించారు, ఆపై వారిని ఊదా రూపంలో కాపాడటానికి భగవంతుడు అవతరించాడు. ఎలుక కూడా ఈ అవతారానికి వాహనం.

పురాణాల ప్రకారం వినాయకుని అవతారాలు ఎన్ని?

హిందూ పురాణాల ప్రకారం వినాయకుని అవతారాలు 8. వేర్వేరు సందర్భాల్లో రాక్షసులను సంహరించేందుకు ఈ అవతారాల్లో వినాయకుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.

English summary

Ganesh Chaturthi special: Eight avatars of Lord Ganesh

Here we are talking about the ganesh chaturthi special:Eight avatars of lord ganesh. Have a look
Story first published: Friday, September 10, 2021, 9:00 [IST]