For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganesh Chaturthi 2021 : వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...?

|

హిందూ క్యాలెండర్ ప్రతి సంవత్సరం తెలుగు నెలల ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్షం చవితిరోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన శుక్రవారం ఈ పవిత్రమైన పండుగ వచ్చింది.

ఈ పండుగ వచ్చిన సమయంలో వినాయక మిత్ర మండలి సభ్యులు క్షణం కూడా తీరిక లేకుండా వారి వారి పనుల్లో నిమగ్నమయ్యి ఉంటారు. అలాగే హిందూ కుటుంబాలలో చాలా మంది ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా ఎంతో ఆనందంగా కూడా గడుపుతారు.

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించిన దగ్గరి నుండి నిమజ్జనం వరకూ రంగు రంగుల పూలు, రకరకాల పండ్లు, సేవలతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలలో పెద్దల కంటే పిల్లల హడావుడే చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈరోజు రాత్రి 7:57 గంటల వరకు గణేష్ చతుర్థి తిథి ఉంటుంది. 7 గంటల నుండి హస్త నక్షత్రం దర్శనమిస్తుంది. ఈరోజున హిందువులలో చాలా మంది విఘ్నాలను తొలగించే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుని.. అద్భుతమైన అలంకరణలు చేసుకుని.. నవరాత్రుల పాటు అనేక కార్యక్రమాలు చేసిన అనంతరంఅనంత చతుర్దశి నాడు శోభయాత్రలను నిర్వహిస్తారు.

అయితే వినాయకుడి పూజను ఎందుకు జరుపుకుంటారు? అసలు వినాయకుడికే తొలి పూజను ఎందుకు చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గణేష్ చతుర్థి 2020 : వినాయక చవితి పండుగ విషెస్, మెసెజెస్ మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి...

వినాయకుడికే తొలి పూజ..

వినాయకుడికే తొలి పూజ..

పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే తొలి పూజ చేయాలి. ఎందుకంటే భక్తుల కష్టాలను తొలగించే లంబోధరుడు. అలాగే ఆ దేవుని పుట్టినరోజునే వినాయక చవితి పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకుంటారు.

గణేశ ప్రతిమను..

గణేశ ప్రతిమను..

హిందూ శాస్త్రం ప్రకారం ఆగస్టు 22వ తేదీన మధ్యాహ్నం 12.22 నుండి సాయంత్రం 4:48 గంటల వరకు అద్భుతమైన సమయం ఉంది. ఈ సమయంలో గణేశుని ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.

చందమామను చూడకూడదు..

చందమామను చూడకూడదు..

వినాయక చవితి రోజు చందమామను చూడకూడదు అనే ఆచారం ఒకటి ఉంది. ఒకవేళ అనుకోకుండా చూసినట్లయితే వారికి శాపం తగులుతుంది. అలాంటి సమయంలో తర్వాతి రోజు తెల్లని వస్త్రాలు, తెల్లని ఆహారపదార్థాలు దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

గణేష్ చతుర్థి 2020 : వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందామా?

నవరాత్రుల పూజలు..

నవరాత్రుల పూజలు..

మట్టి వినాయకులను పూజగదిలో లేదా మండపాలలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేయాలి. వినాయక చవితి రోజు నుండి విఘ్నేశ్వరుడికి నవరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజుల పాటు భక్తిగీతలు పాడుతూ.. భజనలు చేస్తూ ఆధ్యాత్మిక భావనలో ఉంటారు. అయితే కొంతమంది తమ తాహతును బట్టి మూడు రోజుల నుండి 14 రోజుల వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

కష్టాలు రావని..

కష్టాలు రావని..

వినాయకుడిని ఈ పవిత్రమైన తిథి రోజున, భక్తిశ్రద్ధలతో పూజిస్తే, వారికి ఎలాంటి కష్టాలు రావని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చారు. భాద్రపద శుద్ధ చవితి రోజున గణాధిపత్యం పొందిన రోజు అని కొందరు భావిస్తారు. మహేశ్వరాది గణాలకు గణపతి అధిపతి. అంటే అందరి దేవుళ్లకు ఆయనే అధిపతి. బ్రహ్మ స్రుష్టి కార్యాన్ని మొదలుపెట్టే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది.

‘గణ’ శబ్దానికి..

‘గణ’ శబ్దానికి..

బ్రహ్మవైవర్తన పురాణంలో ‘గణ' శబ్దానికి అర్థముందని ‘గ' అంటే విజ్ణానమని ‘ణ' అంటే తేజస్సు అని పండితులు చెబుతున్నారు. మరోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా వినాయకుడిని నియమించాడు. వినాయకుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారంట.

అనంత చతుర్దశి రోజున..

అనంత చతుర్దశి రోజున..

వినాయక ఉత్సవాల అనంతరం అనంత చతుర్దశి రోజున గణేశుడిని సాగనంపుతూ ఉత్సవాన్ని జరుపుకుంటారు. మళ్లీ వచ్చే ఏడాది రావయ్య గణపయ్య.. ఇప్పుడు మీ తల్లి వద్దకు వెళ్లవయ్యా.. గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తారు.

English summary

Ganesh Chaturthi 2020: Why Do We Celebrate and Significance in telugu

Here we talking about ganesh chaturhi 2020 : why do we celebrate and significance in telugu. Read on