For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganga Dussehra 2021:గంగాదేవి దివి నుండి భువికి ఎప్పుడొచ్చింది.. గంగమ్మను ఎలా ఆరాధించాలి...

గంగా దసరా 2021 శుభముహుర్తం పూజావిధి మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ మతంలో గంగకు కేవలం ఒక నదిలా కాకుండా తల్లి హోదా ఇవ్వబడింది. గంగా నదిని స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా సరే గంగా నదిలో ప్రత్యేక సందర్భాలలో స్నానం చేస్తే, వారికి సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

Ganga Dussehra 2021 Date, Shubh Muhurat, Puja Vidhi And Significance in Telugu

అందుకే ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షం పదో రోజున గంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ రోజున తల్లి గంగాదేవి దివి నుండి భువికి దిగి వచ్చిందని హిందువులు నమ్ముతారు.

Ganga Dussehra 2021 Date, Shubh Muhurat, Puja Vidhi And Significance in Telugu

ఈ నేపథ్యంలో 2021లో గంగ దసరా పండుగ ఎప్పుడొచ్చింది? కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంట్లోనే గంగా మాతను ఎలా ఆరాధించాలి.. గంగా దేవి ప్రాముఖ్యత ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ganga Dussehra 2021 : ఈ మంత్రాలతో గంగామాతను పూజిస్తే.. విశేష ఫలితాలొస్తాయి...!Ganga Dussehra 2021 : ఈ మంత్రాలతో గంగామాతను పూజిస్తే.. విశేష ఫలితాలొస్తాయి...!

గంగా దసరా శుభ సమయం..

గంగా దసరా శుభ సమయం..

2021 సంవత్సరంలో జూన్ 19వ తేదీన దశమి రోజున సాయంత్రం 6:50 గంటలకు గంగా దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు జూన్ 20వ తేదీన దశమి తిథి సాయంత్రం 4:25 గంటలకు ముగియనుంది.

ఆరాధన పద్ధతి..

ఆరాధన పద్ధతి..

గంగా దసరా రోజున భక్తులంతా ఉదయాన్నే నిద్ర లేవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో గంగా నదికి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి గంగా నీటిని ముందుగానే ఓ బాటిల్ లేదా ఏదైనా ఇతర పాత్రలో తీసుకొచ్చి కొన్ని చుక్కలను నీటిలో కలపాలి. అప్పుడు స్నానం చేయాలి. ఆ తర్వాత గంగాజలాన్ని సూర్యభగవానుడికి అర్పించండి. ‘ఓం శ్రీ గంగే నమ' అనే మంత్రాన్ని జపిస్తూ గంగా దేవిని స్మరించుకోండి. అనంతరం పేదలకు దానం చేయండి.

గంగా దసరా ప్రాముఖ్యత..

గంగా దసరా ప్రాముఖ్యత..

గంగా దసరా రోజున ఆ తల్లిని ఆరాధించే ప్రతి వ్యక్తికి సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇదే రోజున భగీరథుని తపస్సు మెచ్చి గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. అందుకే గంగా నదిలో స్నానం చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులకు గంగా దసరా లేదా గంగమ్మ జయంతి రోజున ఆ తల్లి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. గంగమ్మ భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది విశ్వాసం.

శివుని ప్రసన్నం..

శివుని ప్రసన్నం..

పురాణాల ప్రకారం.. భగీరథుడు గంగమ్మ తల్లి కోసం.. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు తన జడలో ఉన్న గంగాదేవిని భూమి మీదకు పంపేందుకు అంగీకరిస్తాడు. అప్పుడు నేలపై ఉన్న బంజరు భూములన్నీ సారవంతమైనవిగా మారిపోతాయి. అంతేకాదు చాలా చోట్ల పచ్చదనంగా మారిపోతుంది. అప్పటి నుండి గంగాదసరా ప్రారంభమైంది. దీంతో ఈ పండుగను హిందువులు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందుకే గంగా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

ఈ మంత్రాలు కూడా..

ఈ మంత్రాలు కూడా..

గంగా దసరా రోజున ఇంట్లోనే అమ్మవారిని పూజించే సమయంలో గంగా దేవి అనుగ్రహం కోసం మరికొన్ని మంత్రాలను జపించండి.

‘ఓం నమ శివాయి నారాయణాయి దసరాయై గంగై నమః'

‘ఓం నమ శివాయి నారాయణాయి దసరై గంగై స్వాహా'

‘ఓం నమో భగవి ఐమ్ హ్రీమ్ శ్రీ హిలి హిల్లి మిల్లీ మిల్లీ గంగే మా పావ్య పావ్య స్వాహ' అనే మంత్రాలను జపిస్తూ పువ్వులను అమ్మవారికి అర్పించండి.

వీటిని దానం చేయండి..

వీటిని దానం చేయండి..

అమ్మవారిని ఆరాధించే సమయంలో నెయ్యి, కొద్దిగా బెల్లాన్ని నీటిలో వేయండి. పది రకాల పండ్లు, పది రకాల దీపాలు, పది రకాల నువ్వులను దానం చేయండి. దానం చేసే సమయంలో ‘ఓం గంగా నమః' అని స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. మీకు సకల సంపదలు కూడా పెరుగుతాయి.

English summary

Ganga Dussehra 2021 Date, Shubh Muhurat, Puja Vidhi And Significance in Telugu

Ganga Dussehra is celebrated in the month of June, called as Jyeshtha as per the Hindu calendar. Check out the details of this years’festival.
Story first published:Tuesday, June 15, 2021, 16:22 [IST]
Desktop Bottom Promotion