Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
గౌతమ బుద్ధుడి బోధనలను ఒకసారి స్మరించుకుందామా..?
గౌతమ బుద్ధుడు చేసిన బోధనలను ఇప్పటికీ ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయ్. గౌతమ బుద్ధుడు మన దేశంలో పుట్టిడం మనము చేసుకున్న అదృష్టం. బుద్దుడి స్థాపించిన బౌద్ధ మతాన్ని ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయ్. శాంతి కోసం బుద్దుడు పరితపించాడు. ఎంతో మంది రాజులను కూడా బుద్దుడు ఆకర్షించాడు. బుద్ధుడు చెప్పిన సూక్తులను మరోసారి స్మరించుకుందాం.
గౌతమ బుద్ధుడి సూక్తులు
గతం గురించి ఆలోచించవద్దు, భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవద్దు, ప్రస్తుత కాలంపైనే శ్రద్ధ పెట్టి పనిచేయాలి.
ప్రతి రోజు మనము మళ్లీ పుడతాము. ఈ రోజు ఏమి చేస్తున్నామనేది చాలా ముఖ్యం.

నీ ఆగ్రహమే నిన్ను దహించివేస్తుంది.
నీకు సమయం వుందని నువ్వనుకుంటావు, అదే సమస్య.
ఇతరుల కోసం నువ్వు దీపం వెలిగిస్తే నీవు వెళ్లే దారి కూడా వెలుగుబాట అవుతుంది.
నీ శత్రువు కంటే అదుపులేని నీ ఆలోచనలే నిన్ను ఎక్కువ దాడి చేస్తుంది.
ప్రతి దాంట్లో మంచి చూసేలా నీ మెదడును ట్రైన్ చేయాలి.
నీవెంత మౌనంగా వుంటే అంత బాగా వినగలవు
మన ఆలోచనలతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాం.
సరైన విధంగా జీవించే వారిని చూసి మరణం కూడా భయపడుతుంది.
అటాచ్‌మెంట్ పెరిగితే బాధ దుఖం పెరుగుతుంది.
ఎవరి ఆరోగ్యాన్ని వారే స్వయంగా రచించుకుంటారు.
ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోవాలి.
అర్థం చేసుకోవడం లోంచే పవిత్ర ప్రేమ బయటకు వస్తుంది.
మనల్ని మనమే రక్షించుకోవాలి. ఇంకెవ్వరు కూడా మనల్ని కాపాడలేరు.
వెయ్యి యుద్ధాలు గెలవడం కన్నా మనల్ని మనం గెలవడం మిన్న.
శాంతి మనలోనే వుంది. బయట వెతకవద్దు.
మూడు విషయాలు ఎప్పటికీ దాచలేనివి. ఒకటి చంద్రుడు, రెండు సూర్యుడు, మూడు నిజం.
అనంతమైన ప్రేమని ఈ ప్రపంచానికి పంచండి.
పద్ధతి గల మెదడు సంతోషాన్ని తీసుకొని వస్తుంది.
నీకు ఎంత కొంచెం వున్నా దాన్ని ఇవ్వండి.
ఈ ప్రపంచంలో కోపాన్ని కోపంతో జయించలేము.
ఇతరులను హింసించేవారు ఎప్పటికీ మంచివారు కాలేరు.
ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే రేపు ఏమి అవుతుందో చెప్పలేము.
తల్లిదండ్రులకు సహాయంగా వుండాలి. భార్యా పిల్లలను బాగా చూసుకోవాలి. అదే శాంతియుతమైన ఉద్యోగం.
అనుమానం చాలా చెడ్డ లక్షణం. అనుమానం ప్రజల్ని వేరు చేస్తుంది.
మనమిప్పుడు ఎలాగైతే వున్నాయో దానికి కారణమంతా మన ఆలోచనలే.
జీవితంలో మనమేంటో తెలుసుకోవడమే జీవితానికి అర్ధం. దాన్ని మనస్పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
సంతోషానికి దారేదీ లేదు. సంతోషమే దారి.
నిన్ను నువ్వు నిజంగా ప్రేమించుకుంటే నువ్వెవ్వరినీ బాధపెట్టవు.
నువ్వు దిశను మార్చకపోతే అదే నీ అంతిమ లక్ష్యం అవుతుంది.
ధ్యానం చేసుకోండి. పవిత్రంగా వుండండి. మౌనంగా వుండండి. నైపుణ్యంతో పని చేయండి.
ఆరోగ్యానికి మించిన బహుమతి లేదు. తృప్తికి మించిన ధనం లేదు. విశ్వాసమే మంచి బంధానికి ప్రతీక.
క్రమ శిక్షణతో వుండి మెదడును కంట్రోల్‌లో పెట్టుకుంటేనే కుటుంబం సంతోషంగా వుంటుంది.
మనం మనలా వుండకపోవడమే జీవితంలో పెద్ద ఓటమిగా భావించాలి.
నా లక్ష్యం అందరికంటే మంచిగా వుండడం కాదు. నేను గతంలో కంటే మంచిగా వుండటం.
మెదడు నీళ్ల లాంటిది. నీళ్లల్లో ఏదైనా పడితే చిందర వందర అవుతుంది. నీళ్లు ఆగి వున్నప్పుడే స్వచ్ఛంగా పూర్తిగా కనబడుతుంది.



Click it and Unblock the Notifications