For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gita Jayanti 2021:గీతా జయంతి ఎప్పుడు? మార్గశిర శుద్ధ ఏకాదశి ప్రత్యేకతలేంటి?

గీతా జయంతి 2021 తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ విశ్వంలోని మానవ జాతి అంతటికి దివ్యమార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత. హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజే గీతా జయంతి.

Gita Jayanti 2021 date, time, history and significance in telugu

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో గీతా జయంతి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం, గీతా జయంతి చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

గీతా జయంతి ఎప్పుడంటే?

గీతా జయంతి ఎప్పుడంటే?

2021 సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీన గీతా జయంతిని జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ 13వ తేదీ రాత్రి 9:32 నుండి డిసెంబర్ 14వ తేదీ రాత్రి 11:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 14న మోక్షద ఏకాదశి, గీతా జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున క్రిష్ణుని పూజించడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

గీతా జయంతి ప్రాముఖ్యత..

గీతా జయంతి ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి గీతను ఉపదేశించాడని తెలుస్తోంది. ఒక వ్యక్తి యొక్క జీవిత సారాంశం మొత్తం 18 అధ్యాయాలలో గీతలో పేర్కొనబడింది. దీంతో పాటు మత, కర్మ, ఆచరణాత్మక జ్ణానం కూడా ఇందులో ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున గీతను పఠించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

గీతా అర్థమేమిటంటే..

గీతా అర్థమేమిటంటే..

గీత అను రెండక్షరాలలో ‘గీ'అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. ‘త'అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. త్యాగ శబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థం ఉంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశించుచున్నది.

భగవద్గీత గ్రంథంలో..

భగవద్గీత గ్రంథంలో..

భగవద్గీత గ్రంథంలో మీరు 18 అధ్యాయాలతో కూడిన 700 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో తొలి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, ఆ తర్వాతి 6 అధ్యాయాలలో జ్ణాన యోగం, చివరి అధ్యాయాలలో భక్తి యోగం గురించి చెప్పబడింది. కలియుగం ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు, కురుక్షేత్ర మైదానంలో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి బోధించిన ఉపన్యాసం శ్రీమద్ భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది.

మోక్షాద ఏకాదశి..

మోక్షాద ఏకాదశి..

గీతా జయంతి రోజునే మోక్షాద ఏకాదశి కూడా వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన పూర్వీకులకు స్వర్గంలో తలుపులు తెరుస్తాయని భావిస్తారు. అంతేకాదు మోక్షం పోందాలని కోరుకునే వారు ఎవరైనా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు.

ఉపనిషత్తుల సారం..

ఉపనిషత్తుల సారం..

‘‘సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్''

సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా, అర్జునుడిగా దూడగా మలిచిన క్రిష్ణుడు తాను గోపాలకుడిగా వ్యవహరించాడు. అర్జునుడనే దూడను ఆవు దగ్గర పాలు తాగడానికి విడిచి, ఒక పక్క పార్థుడికి అందిస్తూనే, మరోవైపు లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడు. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం.

గీతను టైం మేనేజ్ మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్, పర్సనల్ మేనేజ్ మెంట్, టీం వర్క్, గ్రూప్ టాస్క్ వంటి వాటిని చేయడానికి దీన్ని ఫాలో అయితే చాలు అంటారు ఆధునిక మేనేజ్ మెంట్ గురువులు.

FAQ's
  • 2021లో గీతా జయంతి ఎప్పుడొచ్చింది?

    ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలో శుక్ల ఏకాదశి (11వ రోజున) గీతా జయంతిని జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీ గీతా జయంతి వచ్చింది.

  • గీతా జయంతి రోజున భగవద్గీతను ఎవరు బోధించారు?

    పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి గీతను ఉపదేశించాడని తెలుస్తోంది. ఒక వ్యక్తి యొక్క జీవిత సారాంశం మొత్తం 18 అధ్యాయాలలో గీతలో పేర్కొనబడింది. దీంతో పాటు మత, కర్మ, ఆచరణాత్మక జ్ణానం కూడా ఇందులో ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున గీతను పఠించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

English summary

Gita Jayanti 2021 date, time, history and significance in telugu

Here we are talking about the gita jayanti 2021:know the history, date and significance in Telugu. Have a look
Story first published:Saturday, December 11, 2021, 16:38 [IST]
Desktop Bottom Promotion