For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భగవద్గీతను తొలిసారి అర్జునుడితో పాటు ఇంకా ఎవరెవరు విన్నారో తెలుసా...

|

ఈ విశ్వంలోని మానవ జాతి అంతటికి దివ్యమార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత. హిందువులు భగవద్గీతను పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పురాణాల ప్రకారం, శ్రీక్రిష్ణుడు మహాభారతంలో కురక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీక్రిష్ణుడు బోధిస్తాడు.

మనలో చాలా మంది చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఈ భగవద్గీత గురించి వినే ఉంటారు. కొందరైతే ఇందులోని శ్లోకాలను కూడా పూర్తిగా చదివేశారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్డ్ ఐన్ స్టీన్ సైతం భగవద్గీతను చదివాక దేవుడే ఈ విశ్వాన్ని క్రియేట్ చేశాడని.. తన ప్రభావం విశ్వమంతా ఉందని చెప్పాడట.

ప్రపంచంలో ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే ఇందులో కచ్చితంగా సమాధానం దొరుకుతుందని చెబుతారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన భగవద్గీత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Gita Jayanti 2021:గీతా జయంతి ఎప్పుడు? మార్గశిర శుద్ధ ఏకాదశి ప్రత్యేకతలేంటి?

అర్జునుడితో పాటు..

అర్జునుడితో పాటు..

సాధారణంగా భగవద్గీత ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శ్రీక్రిష్ణుడు అర్జునుడికి మొదటిసారిగా గీతోపదేశం చేశాడని చెబుతారు. అయితే అదే సమయంలో ఇంకా కొందరు కూడా భగవద్గీతను విన్నారు. అర్జునుడితో పాటు ఆంజనేయుడు, సందేయుడు, బార్బరీకుడు కూడా విన్నారట. శ్రీక్రిష్ణుడు గీతోపదేశం చేసే సమయంలో అర్జునుడి రథం మీద ఉన్న ఆంజనేయుడు, ఘటోత్ఘుడి కుమారుడు బార్బరీకుడు దగ్గర్లోని కొండ దగ్గర నుండి విన్నారట. అదే సమయంలో వేద వ్యాసుని వరం పొందిన సందేయుడు కూడా గీతాసారాన్ని వింటారట.

అర్జునుడి కంటే ముందే..

అర్జునుడి కంటే ముందే..

కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీ క్రిష్ణుడు భగవద్గీతను అర్జునుడి కంటే ముందు కౌరవులలోని దుర్యోధనుడికి చెప్పేందుకు ప్రయత్నిస్తాడట. ఇలా చెప్పడం వల్ల వారు మంచిగా మారతారని భావిస్తాడట. అయితే అదే సమయంలో దుర్యోధనుడితో శ్రీ క్రిష్ణుడు వాగ్వాదానికి దిగి.. తనకు ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది కచ్చితంగా తెలుసని చెప్పి వెళ్లిపోతాడట. ఒకవేళ దుర్యోధనుడు శ్రీ క్రిష్ణుడి గీతోపదేశం విన్నట్లయితే.. తను మంచిగా మారేవాడట. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అనేదే జరిగి ఉండేది కాదని చెబుతుంటారు పెద్దలు.

18 సంఖ్య ప్రత్యేకత..

18 సంఖ్య ప్రత్యేకత..

భగవద్గీత అనే మహాగ్రంథంలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. వీటిలో తొలి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, ఆ తర్వాతి 6 అధ్యాయాలలో జ్ణాన యోగం, చివరి అధ్యాయాలలో భక్తి యోగం గురించి చెప్పబడింది. కలియుగం ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు, కురుక్షేత్ర మైదానంలో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి బోధించిన ఉపన్యాసం శ్రీమద్ భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. దీంతో పాటు మత, కర్మ, ఆచరణాత్మక జ్ణానం కూడా ఇందులో ఉన్నాయి. అందుకే 18 సంఖ్యకు ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది.

Vivah Panchami 2021:వివాహ పంచమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత.. పూజా విధానం గురించి తెలుసుకోండి..

గీతా అర్థమేమిటంటే..

గీతా అర్థమేమిటంటే..

గీత అను రెండక్షరాలలో ‘గీ'అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. ‘త'అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. త్యాగ శబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థం ఉంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశించుచున్నది.

ఎలా బతకాలని..

ఎలా బతకాలని..

భగవద్గీత అనేది ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో మంచిగా బతికేందుకు ఏమి చేయాలి.. ధర్మంగా ఉండేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలనే విషయాలను స్పష్టంగా చెబుతుంది. మనం ప్రస్తుతం గడుపుతున్న జీవనశైలికి, భగవద్గీతకూ సంబంధం ఉంది. ఎందుకంటే భగవద్డీతకు ప్రపంచంలోని ప్రతి ఒక విషయానికి సంబంధం అనేది కచ్చితంగా ఉంటుంది. అందుకే గీతా జయంతి వంటి పవిత్రమైన రోజున గీతను పఠించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

విదేశాల్లోనూ భగవద్గీత..

విదేశాల్లోనూ భగవద్గీత..

భగవద్గీతను కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాలు గొప్ప గ్రంథంగా భావిస్తాయి. అంతేకాదు గీతా జయంతి రోజున ప్రత్యేక వేడుకలు జరుపుకుంటారు. అనంతరం గీతాకు సంబంధించిన కాపీలను ఉచితంగా పంపిణీ చేస్తారు. 1785వ సంవత్సరంలో చార్లెస్ విల్ కిన్స్ అనే ఆంగ్ల శాస్త్రవేత్త తొలిసారిగా భగవద్గీతను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. అనంతరం ఇది అనేక భాషల్లో అనువాదం చేయబడింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు కూడా భగవద్గీత ఎంతో స్ఫూర్తినిచ్చింది. గాంధీ, తిలక్ ఇతర నాయకులు జైలులో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివేవారట.

మొత్తంగా చూస్తే భగవద్గీత సారాంశం ఒక్కటే. ఎల్లప్పుడూ ధర్మంగా జీవించాలి. ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మనం ఏం చేసినా.. ఎప్పుడు.. ఎక్కడకెళ్లినా భగవంతుడు మనతోనే.. ఉంటాడనే విషయాన్ని గ్రహించాలి.

భగవద్గీతను అర్జునుడికి ఎవరు ఉపదేశించారు?

పురానాల ప్రకారం.. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీ క్రిష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశారు. హిందూ పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలోని శుద్ధ ఏకాదశి రోజున గీతా ఉపదేశం చేయడంతో.. ఈ పవిత్రమైన రోజున గీతా జయంతిగా మరియు మోక్షద ఏకాదశిగా జరుపుకుంటారు.

2021లో గీతా జయంతి ఎప్పుడొచ్చింది?

ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలో శుక్ల ఏకాదశి (11వ రోజున) గీతా జయంతిని జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో డిసెంబర్ 14వ తేదీ గీతా జయంతి వచ్చింది.

English summary

Gita Jayanti 2021: Interesting facts about Bhagavad Gita in Telugu

Here we are talking about the Gita jayanti 2021:Interesting facts about Bhagavad Gita in Telugu. Read on,
Story first published: Monday, December 13, 2021, 16:12 [IST]
Desktop Bottom Promotion