For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Good Friday 2022: గుడ్ ఫ్రైడే రోజున కొన్ని చోట్ల నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు...

గుడ్ ఫ్రైడే తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

క్రైస్తవులకు క్రిస్ మస్ తర్వాత అత్యంత ముఖ్యమైన పండుగ గుడ్ ఫ్రైడే. క్రైస్తవులందరూ దేవుడిగా భావించే యేసుకు సిలువ వేయబడిన రోజు గుడ్ ఫ్రైడే. చరిత్రను పరిశీలిస్తే.. కల్వర్తి వద్ద ఆయన మరణానికి సంబంధించిన తాలుకా మెమోరీస్ ను గుర్తు చేసుకునే రోజు.

Good Friday 2021 date, history and significance

ప్రతి సంవత్సరం వసంత కాలంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే పండుగను జరుపుకుంటారు. దీనినే హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ చేయడం అనేది శుక్రవారం నాడే జరిగింది.

Good Friday 2021 date, history and significance

ఈ లోకానికి శాంతి దూతగా వచ్చిన ఏసుక్రీస్తును రెండు వేల సంవత్సరాల క్రితం.. ఈ శుక్రవారం రోజునే కల్వర్తి కొండపై క్రీస్తును శిలువ చేశారు. ఏసయ్యను శిలువపై ఉంచి చేతులు, కాళ్లలోకి మేకులు దించినప్పుడు.. రక్తం వస్తున్న సమయంలో అదే శరీరంతో క్రీస్తు ఇలా ప్రార్థించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Good Friday 2021 : గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ గురించి ఆసక్తికరమైన నిజాలు...Good Friday 2021 : గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ గురించి ఆసక్తికరమైన నిజాలు...

నన్నేందుకు వదిలిపెట్టవు..

నన్నేందుకు వదిలిపెట్టవు..

‘దేవుడా.. నా దేవుడా.. నన్నెందుకు వదిలిపెట్టావు! అంటూ స్తు చేసిన ఆర్తనాదాలు ఆకాశం వరకు వినిపించాయి. వీరు ఏమి చేస్తున్నారో.. వీరికి తెలియడం లేదు కాబట్టి వీరిని క్షమించు' అని ప్రార్థించారు.

మరణం ఓటమి..

మరణం ఓటమి..

మానవులు చేసిన పాపాలకు ప్రక్షాళన కోరుతూ తన ప్రాణాన్ని విడిచి మరణాన్ని సైతం క్రీస్తు ఓడించారని, బైబిల్ లో పేర్కొన్నారు. అందుకే ఈరోజును గుడ్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా క్రైస్తవులందరూ జరుపుకుంటారు.

ఉపవాసాలు..

ఉపవాసాలు..

క్రిస్మస్ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ఉపవాసాలను పాటిస్తారు. ఇవి ‘ఈస్ట్ వెడ్నెస్ డే' నుండి ప్రారంభమై గుడ్ ఫ్రైడే వరకు జరుగుతుంది. దీన్నే లెంట్ అని అంటారు. గుడ్ ఫ్రైడే వంటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

Easter Sunday 2022 : ఈస్టర్ చరిత్ర గురించి మీకు తెలుసా?Easter Sunday 2022 : ఈస్టర్ చరిత్ర గురించి మీకు తెలుసా?

నల్లని దుస్తులు..

నల్లని దుస్తులు..

గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తును ఎలా శిలువ చేశారనే విషయంపై మత పెద్దలు, పాస్టర్లు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు. ఈరోజున కొన్నిచోట్ల నల్లని దుస్తులు ధరించి క్రీస్తును ప్రార్థిస్తారు. ఒక సమారోహాన్ని ఏర్పాటు చేసి, అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. అనంతరం సామూహిక ప్రార్థనలు చేస్తారు.

ఎందుకు హింసించారంటే..

ఎందుకు హింసించారంటే..

క్రైస్తవ మతం ప్రకారం, ఏసు దేవుని కుమారుడు ఈ ప్రపంచంలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి.. చీకటిని తొలగించే ప్రయత్నాలు చేయడం వల్ల అతనికి మరణ శిక్ష విధించబడింది. ఆ సమయంలో యూదుల మౌలికవాద రబ్బీలు, అంటే మతపెద్దలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారు ఏసును వ్యతిరేకించారు.

మూడు రోజుల వరకు..

మూడు రోజుల వరకు..

ఏసును శుక్రవారం రోజున ఉరి తీసినప్పటికీ.. ఆయన మూడు రోజుల పాటు అంటే ఆదివారం వరకు ఆయన బతికే ఉన్నారు. గుడ్ ఫ్రైడే తర్వాత జరుపుకునే ఈస్టర్ పండుగకు కారణం కూడా ఇదే. అయితే గుడ్ ఫ్రైడే రోజున ఏ చర్చిలోనూ గంటలు మోగవు. కానీ ఆదివారం అయిన ఈస్టర్ రోజున మాత్రం చర్చిలో ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు గంటను మోగిస్తారు.

English summary

Good Friday 2022 date, history and significance

Here we are talking about the good friday 2021 date, history and significance. Read on
Desktop Bottom Promotion