For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Good Friday 2022: గుడ్ ఫ్రైడే రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదంట...!

గుడ్ ఫ్రైడే రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

క్రైస్తవుల సంవత్సరంలో ముఖ్యమైన రోజులలో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రిస్ మస్ తర్వాత ఈ పవిత్రమైన రోజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజున ఏసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని సూచిస్తుంది. ఈ శిలువ వేసినప్పటికీ ఏసు మూడు రోజుల వరకు ప్రాణాలతో ఉన్నాడని.. చాలా మంది నమ్ముతారు.

Good Friday 2022

తమ ప్రభువు ఏసు మానవత్వం యొక్క మంచి, రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని భావిస్తారు. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. ఈ ఏడాది 2022లో ఏప్రిల్ 15వ తేదీన శుక్రవారం నాడు గు డ్ ఫ్రైడే వచ్చింది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను చేయకూడదంట.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Good Friday 2021 : గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ గురించి ఆసక్తికరమైన నిజాలు...Good Friday 2021 : గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ గురించి ఆసక్తికరమైన నిజాలు...

నిశ్శబ్దం పాటించాలి..

నిశ్శబ్దం పాటించాలి..

ఈరోజు ఏసు క్రీస్తు మరణాన్ని స్మరించుకునే రోజు. కాబట్టి ఈరోజున ఏ చర్చిలోనూ గంటలు మోగనివ్వరు. ఈ పవిత్రమైన నిశ్శబ్దం మరియు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఈరోజున కలర్ ఫుల్ డ్రస్సులు కూడా ధరించకూడదట. ఎందుకంటే ఈరోజున ఏసుక్రీస్తు మరణానికి సంతాపం వ్యక్తం చేసే రోజు. కాబట్టి చాలా మంది నల్లని వస్త్రాలు ధరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

కొవ్వొత్తులు వెలిగించరు..

కొవ్వొత్తులు వెలిగించరు..

గుడ్ ఫ్రైడే రోజున అద్దాలను మూసేస్తారు. ఒక అద్దం కూడా బయటపడకుండా ఉండాలని భావిస్తారట. అలాగే ఏసు మరణించిన వారి చిహ్నాల ముందు కొవ్వొత్తులు మరియు దీపాలను వెలిగించకూడదట.

మధ్యాహ్నం సమయంలో..

మధ్యాహ్నం సమయంలో..

ఈరోజున మీరు ఎలాంటి పొరపాట్లు పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం వేళ ఏసు శిలువ వేయబడ్డాడు కాబట్టి ఈ సమయాన్ని పూజలు చేసేందుకు గడపాలి.

Good Friday 2021: గుడ్ ఫ్రైడే రోజున కొన్ని చోట్ల నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు...Good Friday 2021: గుడ్ ఫ్రైడే రోజున కొన్ని చోట్ల నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు...

ఎక్కడికి వెళ్లకూడదు..

ఎక్కడికి వెళ్లకూడదు..

ఏసు శిలువ వేయబడిన సమయంలో మీరు రేడియో, టెలివిజన్ మరియు గ్యాడ్జెట్లను ఉపయోగించకూడదట. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో కర్టెన్లు తెరవకూడదు. తెరవనివ్వకూడదు. బయటకు అంటే ఏదైనా సినిమాకు లేదా క్రీడా కార్యక్రమాలు లేదా ఇతర వినోద కార్యక్రమాలను చూడటానికి కూడా వెళ్లకూడదంట.

కలయికలో పాల్గొనకూడదు..

కలయికలో పాల్గొనకూడదు..

ఈ పవిత్రమైన రోజున జంటలు కలయికలో పాల్గొనకూడదట. అలాగే ఎలాంటి రెస్టారెంట్ వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలట. ఈ రోజున ఆటలను కూడా ఆడకూడదట.

దురలవాట్లకు దూరంగా..

దురలవాట్లకు దూరంగా..

యేసు శిలువ వేయబడిన ఈరోజున అనవసరంగా మాట్లాడటం మానుకోవాలి. ఎందుకంటే వీలైనంత మేరకు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించాలి లేదంటే ఏసు ఆరాధనలో పాల్గొనాలి. అలాగే ఈరోజు మద్యం సేవించడం, పొగతాగడం వంటివి చేయకూడదట. లాటరీ టికెట్లు కొనడం, అమ్మడం వంటివి చేయరాదు. పేకాట వంటివి కూడా బంద్ చేయాలంట.

FAQ's
  • 2022లో గుడ్ ఫ్రైడ్ ఎప్పుడొచ్చింది?

    క్రైస్తవ మతాన్ని విశ్వసించే వారికి గుడ్ ఫ్రైడే అనేది ఒక ప్రత్యేకమైన రోజు. తాము దేవుడిగా భావించిన యేసు సిలువ వేయబడిన రోజు ఈరోజున. ఆ సిలువ వేసిన తర్వాత కూడా యేసు మూడు రోజుల తర్వాత కూడా ఇంకా జీవించి ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.తమ ప్రభువు అయిన యేసు మానవత్వం యొక్క మంచి మరియు రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని నమ్ముతారు. ఈ సంవత్సరం 2022లో ఏప్రిల్ 15వ తేదీన శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడ్ పండుగను జరుపుకుంటారు.

English summary

Good Friday 2022: Things to Avoid Doing on This Day

Good Friday is an important day for people who have faith in Christianity. Every year the day is observed on the first Friday after the Spring Equinox. This year the festival will be observed on 2 April 2021. Scroll down the article to read more.
Desktop Bottom Promotion