For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి గ్రహ దోషం అయినా శ్రావణ మాసంలో శివుడికి ఈ అభిషేకాలు చేస్తే పోతుంది

ఇక శ్రావణంలో ప్రత్యేక పూజలు చేసే వారిపై శివుడు కరుణ చూపుతాడు. కొన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలిగిపోతాయి. మనకు నవగ్రహాలుంటాయి. అయితే ఒక్కో గ్రహ ప్రభావం ఒక్కొక్కరిపై పడే అవకాశం ఉంటుంది.

|

మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం రానుంది. శ్రావణంలో శివుణ్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో శివుణ్ని పలు విధానాల్లో పూజిస్తారు. ఇక శ్రావణంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. ఈ మాసమంతా విష్ణువు నిద్రిస్తూ ఉంటాడు. అందువల్ల శివుడు ముల్లోకాలను చూసుకోవాల్సి వస్తుంది.

ఇక శ్రావణంలో ప్రత్యేక పూజలు చేసే వారిపై శివుడు కరుణ చూపుతాడు. కొన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలిగిపోతాయి. మనకు నవగ్రహాలుంటాయి. అయితే ఒక్కో గ్రహ ప్రభావం ఒక్కొక్కరిపై పడే అవకాశం ఉంటుంది. దీంతో మనశ్శాంతి కరువవుతుంది. గ్రహదోషాలు తొలిగిపోవడానికి చాలా మంది చాలా రకాల పూజలు చేస్తుంటారు. అయినా కొందరినీ గ్రహదోషం వెంటాడుతూ ఉంటుంది.

ఎలాంటి గ్రహ దోషాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోండి

ఎలాంటి గ్రహ దోషాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోండి

అయితే శ్రావణ మాసంలో మీరు కొన్ని రకాల పూజలు చేస్తే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు ముందుగా ఎలాంటి గ్రహ దోషాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోండి. దాని తర్వాత మీ దోషాన్ని బట్టి మీరు కొన్ని పూజలు, పనులు చేస్తే చాలు. కొందరిపై రెండు మూడు గ్రహాల దోషాలు కూడా ఉంటాయి. అయితే ఎలాంటి గ్రహ దోషం అయినా శ్రావణ మాసంలో శివుడికి ఈ అభిషేకాలు చేస్తే పోతుంది

సూర్యుడికి సంబంధించిన దోషం

సూర్యుడికి సంబంధించిన దోషం

కొందరిపై సూర్యుడికి సంబంధించిన దోషం ఉంటుంది. ఇలాంటి వారు శివుడికి ఎరుపు రంగులో ఉండే పూలతో పూజలు చేయాలి. ఇలా శ్రావణమాసంలో మీరు ఎంత ఎక్కువగా ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు ఆకులతో శివుణ్ని పూజిస్తే అంత మంచిది. మీపై ఉన్న సూర్యగ్రహదోషం తొలగిపోతుంది.

చంద్రగ్రహం దోషం

చంద్రగ్రహం దోషం

కొందరు చంద్ర గ్రహ దోషం కలిగి ఉంటారు. దీన్నే చంద్రబాధ అని కూడా అంటారు. చంద్ర గ్రహం అనుగ్రహం లేకపోతే మీరు అష్టకష్టాలు పడుతుంటారు. మీరు శ్రావణ మాసంలో శివుడికి కొన్ని రకాల పూజలు చేస్తే చంద్ర గ్రహ దోషం నుంచి విముక్తులవుతారు. శ్రావణంలో రోజూ శివుడికి ఆవు పాలను సమర్పించి పూజ చేయాలి. దీంతో చంద్రగ్రహం అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చేయడం కూడా మంచిది.

కుజుడు, అంగారకుడు, మంగళగ్రహం

కుజుడు, అంగారకుడు, మంగళగ్రహం

కుజ గ్రహాన్ని అంగారకుడు, మంగళగ్రహం అని కూడా అంటారు. కొందరిపై కుజ గ్రహానికి సంబంధించిన దోషాలుంటాయి. వీళ్లు చాలా ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారు మాత్రం శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయాలి. తిప్పతీగ ఆకుల (గిలోయ్) రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయాలి. అలా చేస్తే కుజ దోషం పోతుంది.

బుధుడు

బుధుడు

బుధుడు దోషం ఉన్నవారు శ్రావణంలో కొన్ని రకాల పూజలు చేయాలి. శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయాలి. విదారా మొక్క ఆకుల నుంచి (ఎలిఫెంట్ క్రీపర్ ) రసాన్ని తీసి దాన్ని నీటిలో కలిపి శివుడికి అభిషేకం చేస్తే బుధ గ్రహం ప్రభావం నుంచి బయటపడొచ్చు.

బృహస్పతి (గురుడు)

బృహస్పతి (గురుడు)

బృహస్పతికి సంబంధించిన దోషం ఉంటే శివుడికి పాలలో పసుపు కలిసి అభిషేకం చేయాలి. పసుపు బృహస్పతికి చాలా ప్రీతికరం. అందువల్ల శివుడికి ఆ విధంగా అభిషేకాలు చేస్తే మంచిది.

శుక్రుడు

శుక్రుడు

కొందరిపై శుక్రుడి దోషం ఉంటుంది. అలాంటి వారు పంచామృతంలో నెయ్యి కలిపి శివుడికి అభిషేకం చెయ్యాలి. అలా చేస్తే కచ్చితంగా శుక్రుడి గ్రహ దోషం తొలగిపోతుంది. పంచామృతాన్నితేనె, పాలు, పెరుగు, గంగాజలం (శుద్దమైన నీరు) బెల్లం కలిపి తయారు చేసుకోవాలి.

శని

శని

చాలామందిపై శని గ్రహం ప్రభావం ఉంటుంది. ఈ దోషం వల్ల జీవితాంతం ఇబ్బందులుపడుతూ ఉంటారు. అలాంటి వారు చెరకు రసంలో మజ్జిగను కలిపి శివుడికి అభిషేకం చేయాలి.

రాహు, కేతు దోషం

రాహు, కేతు దోషం

రాహు, కేతుల దోషం వల్ల చాలా మంది జీవితంలో పైకి ఎదగరు. వారు అనుకున్న పనులు ఏవీ కూడా జరగవు. కొందరు జన్మనక్షత్రం ప్రకారం రాహు, కేతుల దోషం ఉండడంతో వారికి పెళ్లిళ్లు కాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతుంది. అలాంటి వారంతా కూడా శివుడికి ఈ అభిషేకం చేస్తే మంచిది.

English summary

grah shanti through shiva puja in shravana masam

grah shanti through shiva puja in shravana masam
Story first published:Tuesday, August 7, 2018, 15:32 [IST]
Desktop Bottom Promotion