Latest Updates
-
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే!
ఇంటి ముందట ఈ మొక్కలు వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే..? ఏ మొక్క పెరిగితే ఏమవుతుందో తెలుసా..?
ఇంటి ముందర అనుకోకుండా కొన్ని చెట్ల మొక్కలు పెరుగుతాయ్. వీటి వెనక కూడా ఒక కారణం వుందని హిందూ శాస్త్రం మనకు చెబుతూ వస్తోంది. మన ఇంట్లో, లేదా జీవితంలో ఏవైనా పెద్ద అనుకోని సంఘటనలు జరిగే ముందు ముక్కలు, జంతువులు, పక్షుల ద్వారా మనకు సంకేతం అందుతుంది. ఈ సంకేతాలను మనము అర్థం చేసుకోగలిగితే మనకు వచ్చే సమస్యను ముందుగానే గ్రహించవచ్చు. మన కర్మఫలం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ వుంటాయ్.
ఇంటల్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మొక్కలను నాటినా, మొక్కలను దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. పురాణాల్లో మొక్కలను చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పటికీ చాలా రకాల చెట్లను మనం పూజిస్తాం. ప్రతీ దేవాలంలో ఏదో ఒక చెట్టుకు మొక్కలు సమర్పించుకోవడమో, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడమో చేస్తాం.

కొన్ని రాకాల మొక్కలు ఇంటి ముందట పెరగడం వల్ల ఇంటికి, ఇంట్లో వున్న వారికి శుభం జరగబోతోందనడానికి సంకేతంగా భావించవచ్చు. అశుభ ఫలితాలను ఇచ్చే మొక్కలు కూడా ఇంటి పరిసరాల్లో పెరుగుతుంటాయ్. అలాంటి సందర్భంలో అలాంటి మొక్కలను వెంటనే పీకి పారేయాలి.
ఇంటి పరిసరాల్లో, ఇంటి ముందట వాకిట్లో తులసి మొక్క గనుక పెరిగితే మహాలక్ష్మీదేవి ఇంట్లో వస్తుందనడానికి సంకేతమని శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందట తులసి మొక్కకు నీళ్లు పోయకపోయినా దానంతట అదే పెరిగితే ఇంట్లో ధనం కూడా అలాగే పెరుగుతుందని సంకేతంగా భావించాలి. ఇలా పెరిగిన మొక్కలను ఎవరికైనా దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఎట్టిపరిస్థితిలో తులసి మొక్కను అమ్మకూడదు. అలా అమ్మితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.
తులసి మొక్క ఎండిపోతే అశుభ ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క ఎండిపోయిందని అనవద్దు. తులసి మొక్క నిద్రపోతోందని అనాలి. కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇంట్లో బొప్పాయ్ మొక్క పెరగడం ఇంటికి మంచిది కాదని హిందూ శాస్త్రం చెబుతోంది. ఇంట్లో గనుక ఈ మొక్క పెరిగితే దాన్ని తీసివేయాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అలాగే పెంచడం వల్ల కష్టాలు రాబోతున్నాయని సంకేతంగా భావించాలి. ఇంట్లోంచి ఈ మొక్కను తీసి వేరే ఎక్కడైనా పాతిపెట్టాలి.
ఇంట్లో వేపమొక్క పెరగడం శుభాన్ని కలిగిస్తుంది. వేప మొక్కలో ఎన్నో ఔషధగుణాలుంటాయ్. వేపమొక్క ఎక్కడైతే వుంటుందో అక్కడ రోగాలు రాకుండా దూరంగా వెళ్లిపోతాయ్. ఎవరి ఇంట్లో అయితే వేపమొక్క పెరుగుతుందో వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా వుంటాయ్. ఇంటి పరిసరాల్లో వేపమొక్క పెరిగితే అస్సలు తీయకూడదు.
ఇంటి ముందట తెల్లజిల్లేడు మొక్క పెరగడం ఇంటికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ మొక్కలోంచి పాలు కారుతాయ్. ఇలా పాలు కారే మొక్కలు ఇంటి పరిసరాల్లో వుండడం మంచిది కాది వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఈ మెక్కను పసుపూ కుంకుమ పూసి పూజ చేసి ఈ మొక్కను బయట ఎక్కడైనా పాతిపెట్టాలి.
ఇంట్లో ఒక్కడైనా నీటిలో లేదా వాటర్ ట్యాంక్‌లో కమలం మొక్క వస్తే సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఇంటికి వచ్చినట్టేనని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి వారి ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా రావు. రావి చెట్టు పెరిగితే కూడా చాలా మంచిది. రావి చెట్టులో సకల దేవీదేవతలు వుంటారు. రావి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది, ప్రతీ రోజూ పూజ చేయకపోతే అశుభం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కకు పూజ చేసి ఎక్కడైనా పాతిపెట్టాలి.



Click it and Unblock the Notifications