For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gupt Navratri 2020 : ఇలా చేస్తే దుర్గామాత ఆశీర్వాదం తప్పక లభిస్తుందట...!

గుప్త నవరాత్రుల సమయంలో ఈ వాస్తు చిట్కాలను పాటించి ఆరోగ్యం, ఐశ్వర్యం రెండింటిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి.

|

గుప్త నవరాత్రుల సమయంలో తాంత్రిక ప్రయోజనాలను పొందడానికి, దుర్గా మాత ఆశీస్సులు పొందడానికి చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

Gupt Navratri 2020:Try these vaastu tips to bring health and wealth

అయితే గుప్త నవరాత్రుల్లో కేవలం తాంత్రిక పూజలే కాకుండా, ఇళ్లలో సాత్విక పూజలు కూడా చేస్తారు. అయితే మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ కొన్ని వాస్తు చిట్కాలను పాటించాల్సిందే.

Gupt Navratri 2020:Try these vaastu tips to bring health and wealth

అలా వాస్తు చిట్కాలను పాటించినప్పుడే మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం అనేవి కచ్చితంగా లభిస్తాయి. దీని వల్ల మీ జీవితంలో అన్ని రకాల బాధలు తొలగిపోయి, ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది.

Gupt Navratri 2020:Try these vaastu tips to bring health and wealth

గుప్త నవరాత్రుల సందర్భంగా పూర్తి భక్తి, శ్రద్ధలతో కొన్ని నివారణలను ఏ విధంగా పాటించాలి. ఏవి పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం దక్కుతుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆశాఢ గుప్త నవరాత్రి డే 2 ప్రాముఖ్యత: బ్రహ్మచారిని పూజ, విధి మరియు మంత్రంఆశాఢ గుప్త నవరాత్రి డే 2 ప్రాముఖ్యత: బ్రహ్మచారిని పూజ, విధి మరియు మంత్రం

తేనేను అర్పించాలి..

తేనేను అర్పించాలి..

హిందూ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి అందమైన రూపం కోరుకుంటే, గుప్త నవరాత్రుల సమయంలో తేనేను అర్పించాలి. ఆ తర్వాత ఆ తేనేను అందరితో పంచుకోవాలి. ఈ తేనే యొక్క ఈ పరిహారం వ్యక్తిత్వంతో అందమైన రూపాన్ని పెంచుతుంది.

రోగం నయమయ్యేందుకు..

రోగం నయమయ్యేందుకు..

మీరు కొంత కాలంగా లేదా ఎప్పటినుండో అనారోగ్యానికి గురయ్యారా? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ పరిహారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. గుప్త నవరాత్రుల సమయంలో వచ్చే శనివారం, సోమవారాల్లో శివలింగంపై నల్ల నువ్వులు మరియు గంగా జలాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే మీ వ్యాధి నుండి మీకు కచ్చితంగా విముక్తి లభిస్తుంది.

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

పర్ఫ్యూమ్..

పర్ఫ్యూమ్..

గుప్త నవరాత్రి పూజల సందర్భంగా మీరు దుర్గామాతకు తేనేతో పాటు పర్ఫ్యూమ్ కూడా సమర్పించండి. తొమ్మిది రోజుల ఆరాధన తర్వాత మిగిలి ఉన్న పర్ఫ్యమ్, తేనేను ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ వాడాలి. ఇలా చేస్తే తల్లి ఆశీర్వాదం నిత్యం కొనసాగుతూ ఉంటుంది.

ఎర్రని దుప్పటి..

ఎర్రని దుప్పటి..

వాస్తు శాస్త్రం ప్రకారం దుర్గా మాతను ఆరాధించడానికి, ఎర్రటి దుప్పటిపై కూర్చోవాలి. అలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం తగ్గిపోతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

ఆర్థికంగా బాధలు పోయేందుకు..

ఆర్థికంగా బాధలు పోయేందుకు..

మీరు ఇప్పటివరకు ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, గుప్త నవరాత్రుల సమయంలో ఏడు గులాబీ రేకులను ఆకులలో ఉంచి, లక్ష్మీ దేవి చిత్రపటం దగ్గరే దుర్గా మాతకు అర్పించండి. అప్పుడు మీకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది!

English summary

Gupt Navratri 2020:Try these vastu tips to bring health and wealth

Consider these Vastu tips To bring health and wealth during Gupt Navratri.
Desktop Bottom Promotion