For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Guru Purnima 2021:గురు పూర్ణమి రోజున ఏం చేయాలి.. ఏ పనులు చేయకూడదు...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, అంటే వ్యాస మహర్షిన పుట్టిన రోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 2021లో జులై 24వ తేదీన గురుపూర్ణిమ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున గురువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది. ఈరోజున చాలా మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు.

గురువు భగవంతుని కంటే ఉన్నతమైన వారు అనేక గ్రంథాల్లో చెప్పబడింది. గురువు లేకుండా మనం ఎలాంటి జ్ణానాన్ని పొందలేము. గురువు సహాయం వల్లే మనం విజయం సాధించడానికి మార్గం సులభమవుతుంది. తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని.. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ణానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్క గురువు తమ శిష్యులకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతాడు.

అంతేకాదు విద్యార్థులు విజయం సాధిస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం అనేది శిష్యుల కర్తవ్యం. శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడి పేరు క్రిష్ణద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవానుడిని, గురువు పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. గురు పూర్ణిమ రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరికొన్ని పనులు కచ్చితంగా చేయాలి.. ఇంతకీ గురు పూర్ణిమ రోజున చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పనులేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Guru Purnima 2021: గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

గురువు ప్రార్థన..

గురువు ప్రార్థన..

గురు పూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్నానం చేయాలి. శుభ్రమైన తెలుపు లేదా పసుపు రంగులో ఉండే బట్టలను వేసుకోవాలి. గురు విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆరాధించాలి. గురు దక్షిణగా పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి. మీ జీవితంలో అజ్ణానం మరియు అహంకారాన్ని ఎల్లప్పుడూ తొలగించాలని గురువును ప్రార్థించాలి.

కష్టాలు తొలగిపోవాలంటే..

కష్టాలు తొలగిపోవాలంటే..

గురు పూర్ణిమ రోజున మీకు కష్టాలు తొలగిపోవాలంటే.. మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించాలన్న మీరు కొన్ని పనులు తప్పక చేయాలి. ఈ పవిత్రమైన రోజున మీరు అవసరమైన వారికి లేదా పేదలకు పసుపు ధాన్యాలు దానం చేయాలి లేదా ఈరోజున పసుపు రంగులో ఉండే మిఠాయిలను అందరికీ పంచాలి. అప్పుడు మీ కష్టాలు తొలగిపోయే అవకాశం ఉందని పండితులు చెబుతారు.

గీతా పఠనం..

గీతా పఠనం..

గురు పూర్ణిమ రోజున విద్యార్థులు గీతా పఠనం తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విద్యలో ఎదురయ్యే అడ్డంకులను సులభంగా అధిగమించొచ్చు. విద్యపై ఆసక్తి లేని విద్యార్థులంతా గీతా పఠనం చేసి.. గోమాతకు సేవ చేస్తే.. మీరు చేసే అధ్యయనంలో మంచి ఫలితాలొస్తాయి.

Happy Guru Purnima 2021 Wishes:గురు పూర్ణిమ విషెస్ ను మిత్రులకు, బంధువులతో షేర్ చేసుకోండిలా...

వివాహ జీవితంలో విజయం..

వివాహ జీవితంలో విజయం..

మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న లేదా పెళ్లి కాకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తులు గురు యంత్రాన్ని తీసుకొని, గురు పూర్ణిమ రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. మీ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఈ మంత్రాలను పఠించండి..

ఈ మంత్రాలను పఠించండి..

గురు పూర్ణిమ రోజున జ్ణానం మరియు అదృష్టం పెరగాలంటే ఈ మంత్రాలను జపించండి.

‘ఓం గురవే నమః'

‘ఓం శ్రీ బృహస్పతి నమః'

ఇవి చేయకూడదు..

ఇవి చేయకూడదు..

ఈ రోజున నల్లని రంగులో ఉండే దుస్తులు వేసుకోరాదు.

గురు పూర్ణిమ రోజున మద్యం, మాంసం జోలికి వెళ్లకూడదు.

ఆల్కహాల్ వంటివి అస్సలు ముట్టుకోకూడదు.

ఈరోజున ఎవరిపైనా కోప్పడకూడదు.

English summary

Guru Purnima 2021 Do's and Don'ts in Telugu

Here we are talking abouth the guru purnima 2021 do's and don'ts in Telugu. Have a look
Story first published: Wednesday, July 21, 2021, 11:56 [IST]