For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hanuman Chalisa : హనుమాన్ చాలీసాలో కొన్ని ముఖ్యమైన శ్లోకాలను నేర్చుకోండి...

హనుమాన్ చాలీసాను తెలుగులో నేర్చుకుందాం రండి...

|

మన దేశంలో ఇప్పటికీ గ్రామాల్లో.. మారుమూల ప్రాంతాల్లో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయని చాలా మంది తెగ భయపడిపోతుంటారు. అయితే ఇలాంటివి మన దరికి చేరకుండా ఉండాలంటే మనం హనుమాన్ చాలీసాను జపించాలని పండితులు చెబుతున్నారు.

hanuman-chalisa-in-telugu

ఈ హనుమాన్ చాలీసాను చదవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే అందులోని ప్రతి పదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇందులోని శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు.

hanuman-chalisa-in-telugu

అయితే ఈ శ్లోకాలు తెలుగులో ఉండకపోవడంతో చాలా మందికి ఇవి అర్థం కావు.. అందుకే హనుమాన్ చాలీసాను తెలుగులో వివరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ హనుమాన్ చాలీసాను చదవటం వల్ల ఏయే ప్రయోజనాలుంటాయి... అందులో ముఖ్యమైన శ్లోకాలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

దివ్య జ్ణానం...

దివ్య జ్ణానం...

హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా అంటే ‘జయ హనుమాన్ జ్ణాన గుణ సాగర' శ్లోకాన్ని జపించడం వల్ల మీ జీవితంలో స్వాభావిక దివ్య జ్ణానాన్ని పొందుతారట. దీని సహాయంతో మీరు జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, మీరు ఆశలు వదులుకున్న వాటినన్నింటినీ తిరిగి సాధించగలుగుతారు.

పవిత్రమైన రఘువీర..

పవిత్రమైన రఘువీర..

శ్రీ గురు చరణ సరోజ రజ

నిజమన ముకుర సుధారి

వరణౌ రఘువర విమల యశ

జో దాయక ఫలచారి

అర్థం : శ్రీ గురుదేవుల పాదపద్మాలను దూళితో అద్దం వంటి నా మనసును శుభ్రపరచుకుని, చతుర్విద ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచుకుంటాను.

నా కష్టాలను తొలగించు..

నా కష్టాలను తొలగించు..

బుద్ధిహీన తను జానికే

సుమిరౌ పవనకుమార

బల బుద్ధి విద్యా దేహు మోహి

హరహు కలేశ వికార

అర్థం : బుద్ధిహీన శరీరాన్ని తెలుసుకుని, ఓ పవనకుమారా(ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలం, బుద్ధి, విద్యను ప్రసాదించి.. నా కష్టాలను, సమస్యలను తొలగించుము.

జయము జయము

జయము జయము

చౌపా ఈ -

జయ హనుమాన జ్ణాన గుణసాగర

జయ కపీశ తిహు లోక ఉజాగర

అర్థం : ఓ హనుమా, జ్ణానం మరియు మంచి గుణాల సముద్రము వంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము

అంజనీ పుత్రుడిగా..

అంజనీ పుత్రుడిగా..

రామదూత అతులిత బలధామా

అంజనిపుత్ర పవనసుత నామా

అర్థం : నీవు శ్రీరాముడికి దూతవు, అమితమైన బలం కలవాడివి. అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అనే నామము కలవాడవు.

వజ్రం వంటి దేహం..

వజ్రం వంటి దేహం..

మహావీర విక్రమ భజరంగీ

కుమతి నివార సుమతి కే సంగీ

అర్థం : నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రం వంటి దేహం కలవాడవు. చెడు ఆలోచనలు ఉన్న వారిని నివారించి.. మంచి ఆలోచనలు ఉన్న వారితో కలిసి ఉండేవాడవు.

శంకరుని అవతారంగా..

శంకరుని అవతారంగా..

శంకర సువన కేసరీనందన

తేజ ప్రతాప మహా జగవందన

అర్థం : శంకరుని అవతారంగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనాలు చేసినాయి.

ఉత్సాహంగా ఉంటావు..

ఉత్సాహంగా ఉంటావు..

విద్యావాన గుణీ అతిచాతుర

రామ కాజ కరవే కో ఆతుర

అర్థం :- విద్యావంతుడవు, మంచి గుణాలు కలవాడవు, బుద్ధి చాతుర్యం కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యం చేయుటకు ఉత్సాహంగా ఉండేవాడివి

సీతారాములను నీ గుండెల్లో..

సీతారాములను నీ గుండెల్లో..

ప్రభు చరిత్ర సునివే కో రసియా

రామ లఖన సీతా మన బసియా..

అర్థం : శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో నీవు తన్మయత్వం పొందావు, శ్రీ సీతారామ, లక్ష్మణులను నీ గుండెల్లో దాచుకున్నావు.

లంకను కాల్చినవాడవు..

లంకను కాల్చినవాడవు..

సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా

వికటరూప ధరి లంక జరావా

అర్థం : సూక్ష్మ రూపం ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానక రూపం ధరించి లంక మొత్తాన్ని కాల్చినవాడవు.

ఇలా చాలీసాలోని ఇంకా అనేక శ్లోకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఇవి. ఇందులో ప్రతి దోహాతో మన జీవితానికి అనేక లాభాలు ఉన్నాయి. అందుకే హనుమాన్ చాలీసాకు పురాణాల కాలం నుండి నేటి కలియుగం వరకు అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.

English summary

Hanuman Chalisa in Telugu: Know Lyrics, Meaning, Importance and Benefits of Chanting

Hanuman Chalisa is an immensely popular work that celebrates and admires the indomitable spirit and unflinching courage of Lord Hanuman. Known to be an extremely powerful devotional work, the Hanuman Chalisa was composed by the great Tulsidas, a devout devotee of Lord Rama.
Desktop Bottom Promotion