For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జునుడికి ఆంజనేయుడికి జరిగిన వాగ్వాదం ఏమిటి? అర్జునుడి రథంపై ఆంజనేయుడి బొమ్మ ఎందుకు ఉంటుంది

అర్జునుడికి కోపం వస్తుంది. నాకే సవాల్ విసురుతావా. సరే నేను బాణాలతో బ్రిడ్జి నిర్మిస్తాను అంటాడు. నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణం త్యాగం చేస్తానంటాడు అర్జునుడు. అర్జునుడు వెంటనే బా

|

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారధిగా శ్రీక్రుష్ణుడు ఉంటారు. అయితే అర్జునుడు రథానికి ఉండే జెండాపైనా హనుమంతుడు ఉంటాడు. అయితే దీని వెనుకాల ఒక కథ ఉంది. అర్జునుడ ఒకసారి దేశాటనకు వెళ్తాడు. చాలా ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్తాడు అర్జునుడు.

Hanuman Flag on Arjuna Ratha Story in Telugu

అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసినా ఒక లింగాన్ని పూజిస్తాడు. తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీరంలో తిరుగుతాడు. అక్కడ రామసేతువు కనిపిస్తుంది. దాన్ని చూడగానే అర్జునుడికి డౌట్ వస్తుంది. రాముడు తలుచుకుంటే తన బాణాల ద్వారానే వారది నిర్మించొచ్చు. అయితే వానరాల ద్వారా ఎందుకు నిర్మించాడనుకుంటాడు అర్జునుడు.

మనస్సులో అనుకున్న విషయం

మనస్సులో అనుకున్న విషయం

అయితే అర్జునుడు ఇలా మనస్సులో అనుకున్న విషయం కూడా అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలిసింది. వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు మారి అర్జునుడి దగ్గరకు వస్తాడు. మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నట్లున్నారు. మీ సమస్య నాకు చెప్పండి. నేను మీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు. దీంతో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు.

అర్జునుడికి నచ్చలేదు

అర్జునుడికి నచ్చలేదు

శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతో వారది నిర్మించగలడు. అయితే ఆ వంతెనపై వానరసేన మొత్తం వెళ్లలేదు కదా. అందుకే రాళ్లతో శ్రీరాముడి డైరక్షన్ లో వానరసేన రామ సేతు నిర్మించింది. అయితే ఆంజనేయుడు ఇచ్చిన ఆన్సర్ అర్జునుడికి నచ్చలేదు. రాముడు బాణాలతో వారధి నిర్మించి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అన్నాడు అర్జునుడు.

బాణాలతో వంతెన వేసి చూపించు

బాణాలతో వంతెన వేసి చూపించు

దీంతో ఆంజనేయడు మళ్లీ సమాధానం ఇచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు. చివరకు ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది. అయితే నువ్వు గొప్ప విలుకాడివి అయితే బాణాలతో వంతెన వేసి చూపించు. దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను. అది నా బరువును మోయగలిగితే మా శ్రీరాముడు చేసింది తప్పు అని నేను ఒప్పుకుని నీకు నమస్కారం చేస్తానంటాడు ఆంజనేయుడు.

Most Read :బద్దకోణాసనం వేస్తే కచ్చితంగా సుఖ ప్రసవం, మగవారికి ఆ సమస్య రాదుMost Read :బద్దకోణాసనం వేస్తే కచ్చితంగా సుఖ ప్రసవం, మగవారికి ఆ సమస్య రాదు

హనుమంతుడు ఒక్క అడుగుపెట్టగానే

హనుమంతుడు ఒక్క అడుగుపెట్టగానే

అర్జునుడికి కోపం వస్తుంది. నాకే సవాల్ విసురుతావా. సరే నేను బాణాలతో బ్రిడ్జి నిర్మిస్తాను అంటాడు. నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణం త్యాగం చేస్తానంటాడు అర్జునుడు. అర్జునుడు వెంటనే బాణాలతో వంతెన నిర్మిస్తాడు. దానిపై హనుమంతుడు ఒక్క అడుగుపెట్టగానే అది కూలిపోతుంది. అర్జునుడు ఆశ్చర్యపోతాడు.

 బాణాలతో బ్రిడ్జి నిర్మించండి

బాణాలతో బ్రిడ్జి నిర్మించండి

తన ఓటమిని అంగీకరించి అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి వెళ్తాడు. అయితే అక్కడే ఉన్న బ్రాహ్మణుడు అర్జునుడుని ఆపుతాడు. నా ఆధ్వర్యంలో ఈసారి మళ్లీ పోటీ పెడతాను. మళ్లీ మీరు బాణాలతో బ్రిడ్జి నిర్మించండి అంటాడు. నేను న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాను అంటాడు. దీంతో మళ్లీ అర్జునుడు బాణాలతో వారధి నిర్మిస్తాడు.

జెండాపై ఆంజనేయుడి బొమ్మ

జెండాపై ఆంజనేయుడి బొమ్మ

అయితే ఆంజనేయడు ఎంత గట్టిగా దానిపై నిలబడినా అది కూలదు.

ఆంజనేయడు ఆశ్యర్యపోతాడు. అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అని ఇద్దరికీ అర్థం అవుతుంది. శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. మీరు అనవసరంగా గొడవకు దిగకండి. మీ మధ్య స్నేహం చూడాలని ఉంది అంటాడు. అర్జునా ఆయన వానరుడు కాదు. ఆయన ఆంజనేయుడు అని వివరిస్తాడు క్రిష్ణుడు. అలా అర్జునుడిని, ఆంజనేయుల మధ్యలో స్నేహబంధం ఏర్పరుస్తాడు. దాంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడి బొమ్మ పెట్టుకుంటాడు.

Most Read :పాండవులు లేకుంటే ద్రౌపది 14మందితో కాపురం చేయాల్సి వచ్చేది!Most Read :పాండవులు లేకుంటే ద్రౌపది 14మందితో కాపురం చేయాల్సి వచ్చేది!

English summary

Hanuman Flag on Arjuna Ratha Story in Telugu

hanuman flag on arjuna ratha story
Desktop Bottom Promotion