For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telugu Hanuman Jayanti 2021 : ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైనది.. ఎందుకో తెలుసా...

హనుమాన్ జయంతి 2021 తేదీ, శుభముహుర్తం, పూజా సమయంతో పాటు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. శ్రీరామ నవమి జరుపుకున్న వారం రోజులకే హనుమాన్ జయంతి వస్తుంది.

Hanuman Jayanti 2021 Date, Shubh Muhurat, Puja Timings and Significance

చైత్ర మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసంలో క్రిష్ణ పక్షంలోని చతుర్దశి రోజు కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరామునికి అత్యంత విశ్వాసుడు.. నమ్మిన భక్తుడు హనుమంతుడు.

Hanuman Jayanti 2021 Date, Shubh Muhurat, Puja Timings and Significance

అంతటి గొప్ప ఆంజనేయుడు శివుని అంశతో పుట్టాడని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో హనుమంతుడిని ఎలా పూజించాలి.. ఈ ఏడాది హనుమాన్ జయంతి పండుగ ఎప్పుడొచ్చింది.. ఈ పవిత్రమైన రోజుకు ఉన్న ప్రాధాన్యత అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Hanuman Jayanti 2021 : తేదీ మరియు శుభ ముహూర్తం- హనుమంతుని గురించి వాస్తవాలు:Hanuman Jayanti 2021 : తేదీ మరియు శుభ ముహూర్తం- హనుమంతుని గురించి వాస్తవాలు:

హనుమాన్ జయంతి పవిత్ర సమయం..

హనుమాన్ జయంతి పవిత్ర సమయం..

2021 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 27వ తేదీన అంటే మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. మంగళవారం రోజున హనుమంతుడికి అంకితం చేసిన రోజుగా పరిగణించబడుతుంది. దీంతో ఈసారి హనుమాన్ జయంతికి మరింత ప్రత్యేకత పెరిగింది. ఈ నెల పౌర్ణమి రోజున ఏప్రిల్ 26వ తేదీన మధ్యాహ్నం 12:44 నుండి ప్రారంభమవుతుంది. 27వ తేదీన ఉదయం 9 గంటలకు ముగుస్తుంది.

ఆంజనేయుడి ఆరాధనతో..

ఆంజనేయుడి ఆరాధనతో..

హనుమంతుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని, గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు. ఎవరైతే ఆంజనేయ స్వామిని స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తారో.. అలాంటి వారికి కష్టాల నుండి విముక్తి లభించడమే కాదు.. పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మీ జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తుంది. అంతే కాదు శని ప్రభావం ఉండే వారు కూడా.. ఆంజనేయుడిని ఆరాధిస్తే.. మంచి ఫలితాలను పొందుతారు.

హనుమాన్ జయంతి వ్రతం, పూజా విధి..

హనుమాన్ జయంతి వ్రతం, పూజా విధి..

హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ పవిత్రమైన రోజున నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి. శ్రీరాముడు, సీతాదేవి మరియు హనుమంతులను గుర్తు చేసుకోవడానికి మీరు బ్రహ్మ ముహుర్తాలలో మేల్కొంటారు. తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో హనుమంతుడికి పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో భజరంగీ మంత్రాలను పఠించాలి.

hanuman jayanti 2021 : రామునికి, హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?hanuman jayanti 2021 : రామునికి, హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?

ప్రత్యేక ఆశీర్వాదం..

ప్రత్యేక ఆశీర్వాదం..

భజరంగబళి ఆశీర్వాదం పొందడానికి, హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన గల నూనె, మరియు సింధూరాన్ని అర్పించాలి. ఈరోజున సుందరకాండ పారాయణం, రామలక్ష్మణ చరితం, భజరంగబళి పఠనం చేయాలి.

సర్వత్రా విజయం కావాలంటే..

సర్వత్రా విజయం కావాలంటే..

శివుని అంశ, వాయు పుత్రుడు.. అర్జునుడికి ప్రియ సఖుడు.. శ్రీరామదాసుడు.. ఎర్రని కన్నులుగలవాడు.. అమిత విక్రముడు.. సాగరాన్ని దాటినవాడు.. లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు.. సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు.. పది తలలున్న రావణుని గర్వం అణచినవాడు, హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు. వీరికి సర్వత్రా విజయం లభిస్తుంది.

హనుమాన్ జయంతి..

హనుమాన్ జయంతి..

మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతిని ఛైత్ర మాసంలో పౌర్ణమి రోజు జరిపితే.. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో వైశాఖ దశమి నాడు జరుపుతారు. ‘కలౌ కపి వినాయకౌ' అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్లని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ ఆంజనేయుడు కచ్చితంగా ఉంటాడని భక్తుల నమ్మకం. ‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర క్రుతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్' అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన హనుమంతునికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని అర్థం.

English summary

Hanuman Jayanti 2021 Date, Shubh Muhurat, Puja Timings and Significance

Hanuman Jayanti is celebrated on full moon day during Chaitra month. This year, Hanuman Jayanti falls on Tuesday, April 27, 2021. Check out the details in Telugu.
Desktop Bottom Promotion