For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రోజు మీ సోదరి ఇంటికి వెళ్తే మీకు నరకం అనేది ఉండదు, అకాల మరణం రాదు, యముడే చెప్పాడు

ఈ పండుగను భాయ్ దూజ్‌, భాయి టీకా, భాయ్ తిహార్‌ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ రోజు సోదరులంతా వాళ్ల సోదరీమణుల ఇళ్లకు చేరుకుని వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు.మీకు నరకం అనేది ఉండదు.

|

యుమున నది గురించి మనకందరికీ తెలుసు. అయితే ఆమె సోదరుడు యముడు.. యమ ధర్మరాజు. యముడు నిత్యం మానవులకు శిక్షలు వేసే పనిలో బిజీగా ఉండి కనీసం తన చెల్లెలిని చూడడానికి కూడా రాలేడు. దీంతో ఒక రోజు యముడిని తన చెల్లి చూడాలని కోరుతుంది.

అన్న నువ్వు కచ్చితంగా రావాలి అని అంటుంది. సరే అని యముడు వెళ్తాడు. తన అన్న రాగానే సకల మర్యాదలు చేసింది. యముడు కడుపు నిండా చెల్లి చేతి వంట తిని ఆనందించాడు.

మా ఇంటికి రావడమే గొప్ప

మా ఇంటికి రావడమే గొప్ప

తర్వాత చెల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు యముడు. అప్పుడు యమునా దేవి.. అన్నా నువ్వు మా ఇంటికి రావడమే నాకు గొప్ప. ప్రతి ఏడాది నువ్వు ఇదే రోజు మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది. సరే అమ్మా.. అలాగే వస్తాను అని యముడు మాటిస్తాడు.

అస్సలు నరకం ఉండదు

అస్సలు నరకం ఉండదు

అలాగే ఇదే రోజు ఎవరైతే చెల్లెలు లేదా అక్కల ఇళ్లలో భోజనం చేసి సోదరి బాగోగులు తెలుసుకుంటారో అలాంటి వారందరికీ అస్సలు నరకం ఉండదని చెబుతాడు యముడు. అలాగే అకాల మరణం కూడా వారికి సంభవించదు అని అంటాడు. అలాగే ఆ రోజు సోదరుడిని ఇంటికి పిలిచి అన్నం పెట్టిన సోదరి కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటుందని యుముడు చెబుతాడు.

భాతృ విదియ రోజు

భాతృ విదియ రోజు

యముడు తన సోదరి ఇంటికి ఎప్పుడు వెళ్లాడనే కదా మీ డౌట్. భాతృ విదియ రోజు యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లాడు. దీపావళి తర్వాత రెండో రోజున ఇది వస్తుంది. ఈ రోజునే యమ ద్వితీయం అని అంటారు. నరకాసురుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడిని సుభద్ర ఇంటికి ఆహ్వానిస్తుంది. అందువల్ల భాతృ విధియను జరుపుకుంటూ ఉంటారు.

దీపావళి తర్వాత రెండో రోజు

దీపావళి తర్వాత రెండో రోజు

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఎవరి సంసారాల్లో వారు బిజీగా ఉండి సోదరీ సోదరులు అస్సలు కలుసుకోలేరు. వారి మధ్య ఉన్న ఆప్యాయతను అనురాగాన్ని గుర్తు చేసుకునేందుకు దీపావళి తర్వాత రెండో రోజు ఈ పండుగ చేసుకోవాలి.

సోదరి బాగోగులు, ఆమె కష్టసుఖాలు తెలుసుకుని ఆమె చేతి వంట తిని రావాలనే ఈ పండుగను పెట్టారు పెద్దలు. అయితే దీన్ని ఎక్కువగా ఉత్తరాదిలో చేసుకుంటూ ఉంటారు. దక్షిణాదిలో ఈ పండుగ చేసుకోవడం తక్కువ.

భాయ్ దూజ్‌, భాయి టీకా

భాయ్ దూజ్‌, భాయి టీకా

ఈ పండుగను భాయ్ దూజ్‌, భాయి టీకా, భాయ్ తిహార్‌ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ రోజు సోదరులంతా వాళ్ల సోదరీమణుల ఇళ్లకు చేరుకుని వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలా చేస్తే తమ సోదరుడికి అకాల మరణం రాదని, సంతోషంగా ఉంటాడని నమ్మకం. అలాగే సోదరీమణుల చేతి వంటను సంతృప్తిగా తిని వారు చల్లగా ఉండాలని కోరుకుంటారు సోదరులంతా. సోదరులు, సోదరీమణులను దగ్గరకు చేర్చే ఈ సంప్రదాయం నిజంగా చాలా మంచిదే. ఈ పండుగను తీసుకొచ్చిన యముడ్ని కొందరు ఈ రోజు పూజిస్తారు.

English summary

History behind Bhai Dooj festival or yama dwitiya

History behind Bhai Dooj festival or yama dwitiya
Story first published:Thursday, August 16, 2018, 9:53 [IST]
Desktop Bottom Promotion