Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Christmas: క్రిస్మస్ చెట్టు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు.. ఇందులో ఇంత అర్ధం ఉందా?
డిసెంబర్ నెల ప్రారంభమయ్యిందంటే చాలు క్రిస్టమస్ వేడుకలు మొదలైపోతాయి. మన దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లో కూడా క్రిస్టమస్ వేడుకలను ప్రారంభించేస్తారు. ఇంటిపైన స్టార్ వెలిగించడం, ఇంటి ముందు క్రిస్టమస్ చెట్లను పెట్టడం వంటివి చేస్తారు. క్రిస్టమస్ చెట్లను అందంగా అలంకరించి కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు. అయితే క్రిస్టమస్‌కు ఎందుకు స్టార్ వెలిగిస్తారు?, చెట్లను ఎందుకు పెట్టుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆచారం ఎప్పుడు మొదలయ్యిందంటే?
సాధారణంగా క్రిస్టమస్‌కు చెట్లను ఏర్పాటు చేసుకొని అందంగా వెలిగించుకోవాలనే ప్రతిపాదన ఏదీ లేదట. కొన్ని వందల సంవత్సరాల క్రితం 'జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్' అనే వ్యక్తి సైనికులకు ఇచ్చిన విందులో సైనికులను అబ్బుర పరిచేందుకు ఈ చెట్లను వినియోగించారట. ఆ చెట్లను డెకరేట్ చేయడంతో అది ప్రాచుర్యం పొందిందని టాక్.

అలాగే 18వ శాతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజా భవనంలో క్రిస్టమస్ వేడుకలో ఈ క్రిస్టమస్ చెట్టును అలంకరించారు. దీంతో ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు విస్తరించింది. రష్యా, ఆస్ట్రేలియా వంటి తదితర దేశాలకు కూడా ఈ సంప్రదాయం పాకింది. అప్పటి నుంచి క్రిస్టమస్ వస్తే ఇంటిపైన స్టార్ వెలిగించడం, ఇంటి ముందు క్రిస్టమస్ చెట్టు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు.
ఎందుకు పెడతారంటే?
క్రిస్టమస్ చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని దేశాలన్నీ పరిగణిస్తుంటాయి. ఈ చెట్టుకు ఇవ్వడం మినహా తీసుకోవడం వంటివి తెలియదని చెబుతుంటారు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు.
అలాగే ఇంటిపై స్టార్‌ను దివ్య నక్షత్రంగా భావిస్తుంటారు. దీనిని క్రీస్తు జన్మ నక్షత్రమని క్రైస్తవులు చెబుతుంటారు. క్రీస్తు ఈ భూమి మీదకు వస్తున్నారని చెబుతూ, అలాగే రావాలని కాంక్షిస్తూ ఇళ్లపై ఈ స్టార్లను అలంకరిస్తూ ఉంటారు. కొన్ని వందల సంత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా కొనసాగుతాయి.
క్రిస్టమస్ ఎందుకు జరుపుకుంటారంటే?
డిసెంబర్ 25వ తేదీన ప్రపంచం మొత్తం క్రిస్టమస్ జరుపుకుంటుంటుంది. మన దేశంలోని క్రైస్తవులతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మేరీ, జోసెఫ్ దంపతులకు డిసెంబర్ 24వ తేదీన యేసు జన్మించారు. మేరీ కన్యగా ఉన్నప్పుడే దేవదూతలు ఆమెకు యేసును ప్రసాదిస్తారు. అలా ఆమె డిసెంబర్ 24వ తేదీ అర్థరాత్రి యేసును జన్మనిస్తుంది. యేసు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీన క్రిస్టమస్ జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications