For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi 2021 : ఈ ఏడాది హోలీ ఎప్పుడొచ్చింది? ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసా?

|

రంగు రంగుల హోలీ పండుగ వస్తోందంటే చాలు.. దేశమంతా కలర్ ఫుల్ గా మారిపోతుంది. మన దేశంలో దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే కలర్ ఫుల్ డేుకల్లో హోలీ పండుగ ఒకటి.

హిందూ పురాణాల ప్రకారం ఈ పండుగను సత్య యుగం నుండి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీకి ముందు కాముని దహనం వంటి కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాతి రోజున రంగులు జల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

అలాంటి కలర్ ఫుల్ ఫెస్టివల్ ఈ ఏడాది మార్చి 28వ తేదీ మరియు 29వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా హోలీ అంటే ఏమిటి? హోలీ పండుగ నాడు ఎందుకని రంగులను చల్లుకుంటారు? కాముని దహనం ఎందుకు చేస్తారనే ఆస్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హోలీ అంటే..

హోలీ అంటే..

హిందూ పురాణాల ప్రకారం, హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదనే అర్థం వస్తుందని పండితులు చెబుతారు. ‘హోలీకా పూర్థిమ'గా కూడా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగనే హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

అరుదైన యోగం..

అరుదైన యోగం..

ఈ సంవత్సరం హోలీ పండుగ సమయంలో అంటే మార్చి 29వ తేదీన చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు. అదే సమయంలో శని గ్రహం దాని రాశిచక్రంలో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇలాంటి గ్రహాలు మొత్తం 1952 మార్చి మూడో తేదీన వచ్చింది. సుమారు 499 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఈసారి హోలీలో, సర్వార్దసిద్ధి యోగాలతో పాటు అమ్రుత సిద్ధి యోగా కూడా ఉంటుంది.

హోలీ కథ..

హోలీ కథ..

పురాణాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశపుడు కుమారుడు ప్రహ్లదుడు నిత్యం శ్రీవిష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాడు. అది తన తండ్రి నచ్చదు. దీంతో ప్రహ్లదున్ని వధించాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తి, సామర్థ్యాలతో ప్రహ్లాదున్ని మంటల్లో కలిపేయాలని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లదుడిని తన ఒడిలో కూర్చుబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు సహాయంతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో పడి మరణిస్తుంది. అందుకే హోలిక దహనమైన రోజునే ‘హోలీ' అనే పండుగ వచ్చినట్లు ప్రచారంలో ఉంది. అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో ‘హోలీక దహనం' నిర్వహిస్తారు.

డోలోత్సవంగా..

డోలోత్సవంగా..

మరో కథనం ప్రకారం.. శ్రీక్రిష్ణుడు గోపికలతో కలిసి బ్రుందావనంలో పువ్వులతో, రంగులతో డోలోత్సవం లేదా డోలికోత్సవం అనే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నట్లు భావిస్తారు. అందుకే రంగులు, పూలు చల్లుకుంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని కొందరి నమ్మకం.

క్రుత యుగంలో..

క్రుత యుగంలో..

క్రుత యుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా కలిసి ‘హోలిక' అనే రాక్షసి వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ రాజుతో మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నారదుడు.. ప్రతి ఏటా ఫాల్గుణ పున్నమి నాడు హోలికను పూజిస్తే మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అందరూ రాత్రి వేళ కార్యక్రమాన్ని నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుండి ‘హోలీ'పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెబుతుంటారు.

రాధను ఊయలలో..

రాధను ఊయలలో..

పురాణాల ప్రకారం.. డోలిక అంటే ఊయల అని అర్థం. బాలాబాలక్రిష్ణుడిని ఫాల్గుణ మాసం, పున్నమి తిథిలో ఊయాలలో వేసినట్లు పండితులు చెబుతుంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లో హోలీ రోజున శ్రీక్రిష్ణుడి విగ్రహాన్ని ఊయలలో వేసి ‘డోలికోత్సవం' జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీక్రిష్ణుడు..రాధను ఊయలలో పెట్టి రంగులు జల్లినట్లు కూడా చెబుతుంటారు.

కొన్ని ప్రాంతాల్లో..

కొన్ని ప్రాంతాల్లో..

పురాణాల ప్రకారం మరో కథనం ఇలా ఉంది. రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయ్యిందని చాలా మంది నమ్ముతారు. అందుకే వివిధ ప్రాంతాల్లో కర్రలను పోగు చేసి.. ప్రజలు ఎక్కువగా తిరిగే చోట లేదా వీధి చివర్లలో హోలిక దహనం చేస్తారు. సంప్రదాయ పూజలు చేసిన తర్వాత ఈ మంటలకు ప్రదక్షిణలు చేస్తారు. తర్వాతి రోజు ఈ విజయాన్ని దులహండి రోజుగా ఘనంగా జరుపుకుంటారు.

వసంత రుతువు..

వసంత రుతువు..

హోలీ పండుగ వెనుక మరో రహస్యం కూడా దాగి ఉంది. ఈ పండుగ సమయంలో వివిధ రకాల రంగుల ఉత్పత్తి అవ్వడమే కాదు.. అవి వ్రుద్ధి చెంది.. వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. హోలీ పండుగ సమయంలో వసంత రుతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సమయంలో వేడి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రతల వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. ఇదే సమయంలో రంగులను జల్లుకోవడం ద్వారా చర్మం నుండి కలిగే చికాకును తగ్గిస్తాయి.

English summary

Holi 2021 Vrat Vidhi, Vrat Katha, Puja Vidhi, Vrat Kahani, Story, Samagri, Mantra in Telugu

Here we are talking about the holi 2021 vrat vidhi, vrat katha, puja vidhi, vrat kahani, story, samagri mantra in Telugu. Read on