For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi Remedies :హోలీ వేళ ఈ పరిహారాలు పాటిస్తే డబ్బు సమస్యలే ఉండవట...!

హోలీ పండుగ సందర్భంగా ఈ నివారణలు పాటిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసేయ్యండి.

|

కలర్ ఫుల్ గా అందరిలోనూ జోష్ నింపే 'హోలీ' పండుగ అంటే అందరికీ ఆనందమే. ఈ పండుగ రోజున ఆడ, మగ, చిన్న పెద్ద తేడాలేమీ లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలను జరుపుకుంటారు.

Holi Remedies : Remedies to Fulfill Your Wishes on Holi in telugu

ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో మార్చి 8వ తేదీన బుధవారం నాడు హోలీ పండుగ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ పండుగ రోజున సంతోషం కోసం.. సంపద కోసం.. కొన్ని పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు.

Holi Remedies : Remedies to Fulfill Your Wishes on Holi

ఫాల్గుణ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ రోజున గ్రహాల, నక్షత్రాల అరుదైన కలయిక సంభవిస్తుంది. ఈ సమయంలో గురుడు, శని ఒకే రాశిచక్రంలో ఉంటారు. దీంతో హోళీని వృద్ధి యోగంలో జరుపుకుంటూ ఉంటారు.

అలాగే సర్వర్థ సిద్ధి యోగం, అమృత సిద్ధియోగం, అమృత కాలంతో పాటు దృవ యోగంలో ఈ పండుగ వస్తోంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు అనేవే ఉండవట. ఇంతకీ ఆ పరిహారాలేంటి.. వాటిని ఎలా పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Holi 2022 :ఈ ఏడాది 'హోలీ' ఎప్పుడొచ్చింది? రంగులను చల్లి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...Holi 2022 :ఈ ఏడాది 'హోలీ' ఎప్పుడొచ్చింది? రంగులను చల్లి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

నిండు చంద్రుడికి..

నిండు చంద్రుడికి..

హోలీ పండుగ రోజున సాయంకాలం సంధ్యా సమయం తర్వాత చంద్రుడిని పూజించాలి. ఏదైనా వెండి పల్లెం లేదా ఏదైనా తెల్లని లోహంతో చేసిన ప్లేటును తీసుకోండి. అందులో నైవేద్యంగా కొన్ని ఖర్జురాలు, మఖానా ఉంచండి. దీపారాధన చేసి చంద్రుడికి పాలు సమర్పించండి. అనంతరం ధూపం వెలిగించి తర్వాత ప్రార్థనలు చేయండి.

ద్విముక దీపారాధన..

ద్విముక దీపారాధన..

హోలీ పండుగ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద రంగు రంగుల ముగ్గులతో, వాటిపై పిండితో చేసిన ద్విముఖ దీపారాధన చేయండి. దీపం వెలిగించేటప్పుడు మీ ఆదాయం పెరగాలని కోరుకోండి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరిగే అవకాశముంది. అదేవిధంగా మీ కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తుంది. దీపం శాంతి(ఆరిపోయిన) తర్వాత దాన్ని హోలీ దహనం కోసం ఏర్పాటు చేసిన అగ్నిలోకి వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.

బకాయిలను పొందడానికి..

బకాయిలను పొందడానికి..

మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి, వాటిని తిరిగి పొందలేకపోతున్నారా? అప్పుడు దానిమ్మ చెట్టు నుండి ఎండి కొమ్మను తీసుకోండి. ఆ కొమ్మలపై మీకు ఎవరి నుండి డబ్బు రావాలో వారి పేరు రాయండి. హోలికా దహన్ అగ్నిలో వాటిని వేయండి. ఇలా చేయడం వల్ల మీరు మీ బకాయిలన్నింటినీ తిరిగి పొందేందుకు ఇది సహాయపడుతుంది.

Holi 2022: హోలీ పండుగ వేళ పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట...!Holi 2022: హోలీ పండుగ వేళ పొరపాటున కూడా వీటిని దానం చేయకూడదట...!

ఖర్చులను తగ్గించేందుకు..

ఖర్చులను తగ్గించేందుకు..

హోలీకా దహనం రోజున, హోలికా దహనం తర్వాత అందులో మిగిలిన బూడిదలో కొంత బూడిదను తీసుకోండి. దాన్ని ఎర్రని వస్త్రంలో వేసి ముడి కట్టండి. ఈ వస్త్రాన్ని మీ క్యాష్ లేదా వాలెట్లో ఉంచండి. దీని వల్ల మీ ఖర్చులు తగ్గిపోతాయి.

సంపద పెరిగేందుకు..

సంపద పెరిగేందుకు..

హోలీ పండుగకు ముందు రోజున గబ్బిలాలు నివసించే చెట్ల కొమ్మలను ఇంటికి తీసుకురండి. వాటి కొమ్మలను సూర్యోదయం కంటే ముందే విరగ్గొట్టి రాత్రి వేళ వాటి ఆకులను చించేసి దాన్ని డబ్బులు పెట్టే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. అంతేకాదు మీ డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు చాలా విషయాల్లో ప్రయోజనం చేకూరుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..

హోలీకా దహనం రోజున రాత్రి వేళ తూర్పునకు ఎదురుగా పీట వేసుకుని కూర్చోండి. ఆ తర్వాత బియ్యం కుప్పగా పోసి వాటిపై ఏడు కోడిగుడ్లు, ఓ శంఖాన్ని ఉంచండి. అనంతరం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పూజ తర్వాత ఈ సామాగ్రిని ఎవరూ తిరగని ప్రదేశానికి తీసుకెళ్లి గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

FAQ's
  • 2022 సంవత్సరంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోనున్నారు?

    ఈ ఏడాది 2022 సంవత్సరంలో మార్చి 17, 18వ తేదీల్లో అంటే గురు, శుక్రవారం నాడు రానుంది. స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది.

English summary

Holi Remedies : Remedies to Fulfill Your Wishes on Holi in telugu

Here we are talking about the Holi Remedis: Remedies to fulfill your wishes on holi. Have a look
Desktop Bottom Promotion