Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
రుద్రక్ష ధరిస్తే ఎన్నో ఉపయోగాలు..! రుద్రాక్ష వేసుకుంటే ఫలితం స్పష్టంగా బయటపడుతుంది..!
రుద్రాక్షలు శివుడి కన్నీటి బిందువు నుంచి వచ్చిందని పురాణాలు చెబుతాయ్. శివుడు ముగ్గురు రాక్షసులను హతమార్చిన తరువాత ఘోరమైన తపస్సును చేస్తాడు. ఆ తపస్సు తరువాత కళ్లు తెరిచినప్పుడు ఒక కన్నీటి బిందువు కిందపడుతుంది. ఆ కన్నీటి బిందువు భూమిలో పడినప్పుడు అక్కడి నుంచి రుద్రాక్ష చెట్టు మొలకెత్తిందని పురాణం చెబుతోంది. రుద్రాక్షను అంత ఉన్నతమైన పవిత్రమైన చరిత్ర వుందని పండితులు చెబుతున్నారు. రుద్రాక్ష వల్ల ఎన్నోప్రయోజనాలున్నాయ్. ఆరోగ్యసమస్యలను నయం చేయడం, నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేయడం, ప్రాణగండాలు లేకుండా చేయడం ఈ రుద్రాక్ష వల్లే సాధ్యమని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పుడు కూడా రుద్రక్షను ప్రత్యేక కోణంలోంచి చూస్తున్నారు, రుద్రాక్షపై ఎన్నో పరిశోధనలు జరుగుతూనే వున్నాయ్. రుద్రాక్షకు సంబంధించి ఇంకా ఎన్నో అంతుచిక్కని రహస్యులు వున్నాయ్.
రుద్రక్ష ధరించిన తరువాత తమ జీవితంలో ఎన్నో మార్పులను చూశామని చాలామంది చెబుతూనే వున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వుంటే కానీ రుద్రాక్షను ధరించలేమని పండితులు చెబుతున్నారు. రుద్రక్షకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయ్. మహళలు రుద్రాక్ష ధరించవచ్చా, రుద్రాక్ష వేసుకొని స్నానం చేయవచ్చా, రుద్రాక్ష ధరించి నిద్రపోవచ్చా, రుద్రాక్ష వేసుకొని మాంసం తినవచ్చా లాంటి ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూ వుంటాయ్.
యంత్రాన్ని ధరించడానికి ఎలాంటి కట్టుబాట్లను పాటిస్తామో, రుద్రాక్షను వేసుకునేటప్పుడు కూడా అలాంటి కట్టుబాట్లనే పాటించాలి. శారీరక సంబంధంలో రుద్రక్షను ధరించవద్దు, స్నానం చేసేటప్పుడు వేసుకోవద్దు, మాంసాహారం భుజించేటప్పుడు కూడా రుద్రాక్షను ధరించవద్దని పండితులు చెబుతున్నారు.

రుద్రక్ష ధరించిన వారిలో చాలా శక్తి వుంటుంది. కాబట్టి వారి తరువాత వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షకు సంబంధించిన భీజమంత్రాన్ని చదివిన తరువాతే రుద్రక్షను వేసుకోవాలి. ఉదయం 4 నుంచి 7 గంటల లోపు రుద్రక్షను శుద్ధిగా కడిగిన తరువాత మాత్రమే రుద్రాక్షను ధరించాలి.
స్వయంగా పరమేశ్వరుడి శక్తి రుద్రాక్షలో వుంటుంది. ఏ సాధన చేయాలన్నా రుద్రాక్షతోనే చేయాలి. శివుని పూజచేసే ప్రతి ఒక్కరూ రుద్రాక్షను దరించే వుంటారు. రాశులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రుద్రాక్షను ధరించమని సూచిస్తారు.
రుద్రక్షతో ఫలితం త్వరగా వస్తుంది కాబట్టి చాలా మంది రుద్రాక్షను ధరిస్తారు. రాజకీయనాయకులు ఎన్నికల్లో విజయం సాధించడానికి, సినిమా స్టార్లు బ్లాక్ బస్టర్లు కొట్టడానికి, విద్యార్ధులు మంచి మార్కులు రావడానికి, రోగులు, తమకు వున్న అనారోగ్యాలు తొలగిపోవడానికి దరిస్తారు.
రుద్రాక్షను ధరించడం వల్ల శరీరంలోని అనాహత చక్రం, అంటే గుండెకు సంబంధించిన చక్రం క్రియాశీలకంగా మారుతుంది. అందుకే గుండెకు రుద్రాక్ష తాకే విధంగా వేసుకోవాలని చెబుతారు. దీన్నే సిద్ధమాల అని అంటారు. ఈ సిద్ధమాల ఎవరి వద్దనైతే వుంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి వ్యాపించి వుంటుంది. ఈ మాల నెగటివ్ ఎనర్జీని దగ్గరకు రానివ్వదు.
గుండెకు సంబంధించిన రోగాలను కూడా నయం చేసే శక్తి రుద్రాక్షలో వుంటుంది. మానసిక సమస్యలు వున్నవారికి రుద్రాక్ష ఒక ఔషదంగా ఉపయోగిస్తున్నారంటే రుద్రాక్షకు వున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు.
16 ముఖాలున్న రుద్రాక్షను ఎక్కువగా చికిత్సకు ఉపయోగిస్తారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వున్నవారికి 16 ముఖాల రుద్రాక్షను చూపిస్తే వారికి నయం అవుతుందని అనేక సంఘటనలు రుజువు చేశాయ్. కేవలం రుద్రాక్ష వల్ల అనారోగ్య సమస్యలు నయం కావు, వైద్యల సహాయం, చికిత్స కూడా తప్పనిసరిగా వుండాలి.
ప్రతి రుద్రాక్షకు ఒక ముఖం వుంటుంది. రుద్రక్ష పైన వుండే ఒక గీతను ఒక ముఖంగా గుర్తిస్తారు. ఇలా ఎన్ని గీతలుంటే అన్ని ముఖాలున్న రుద్రాక్ష అని అర్థం. 29 ముఖాలున్న రుద్రాక్ష కూడా వుంటుంది. ఆధ్యాత్మికం కోసం ఉపయోగించే రుద్రాక్షలు నేపాల్‌లో లభ్యమవుతాయ్. అసలైన రుద్రాక్షలు నీటిలో మునుగుతాయ్, నకిలీవి మాత్రమే పైకి తేలుతాయ్.



Click it and Unblock the Notifications