For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వరథుడు అనే రాకుమారుడు విశ్వామిత్రుడిలా ఎలా మారాడు, విశ్వామిత్రుడు ఎలా విర్రవీగేవాడో తెలుసా?

విశ్వామిత్రుడు అంతకు ముందు విశ్వరథుడుగా ఉండేవాడు. ఆయన తప్పస్సు చేశాకా విశ్వామిత్రుడిగా మారాడు. విశ్వరథుడు తన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరింపజేశాడు. విశ్వరథుడు అనే రాకుమారుడు విశ్వామిత్రుడిలా ఎలా

|

విశ్వా మిత్రుడి పేరు గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ ఆయన కథ మాత్రం చాలా కొంత మందికే తెలుసు. విశ్వామిత్రుడు గాధి రాకుమారుడు. విశ్వామిత్రుడి తండ్రి గాధిరాజు కన్యా కుబ్జ రాజ్యం అధిపతి. ఇక గాధి తండ్రి పేరు కుశ నాభుడు. విశ్వామిత్రుడి తండ్రి పేరు వల్లే అతన్ని గాధేయుడు అంటారు. అలాగే వాళ్ల తాత పేరు కలిసేటట్లుగా కౌశికుడు అని అంటారు.

సుదాసుడు అనే రాజుకు విశ్వామిత్రుడు సలహాదారుడు

సుదాసుడు అనే రాజుకు విశ్వామిత్రుడు సలహాదారుడు

విశ్వామిత్రుడికి వశిష్ట మహర్షితో వైరం ఏర్పడుతుంది. అందుకు ఒక కారణం ఉంది. సుదాసుడు అనే రాజుకు విశ్వామిత్రుడు సలహాదారుడిగా ఉండేవారు. అతని సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలను కూడా విశ్వామిత్రుడే నిర్వహించేవాడు. అయితే సుదాసుడు మొత్తం పది మంది రాజులతో (దాసరాజు కూటమితో) యుద్ధం చేయాల్సి వస్తుంది.

వశిష్టుడిని సలహాదారుడిగా పెట్టుకోమని కోరుతారు

వశిష్టుడిని సలహాదారుడిగా పెట్టుకోమని కోరుతారు

ఆ సమయంలో విశ్వామిత్రుడు ఇచ్చే సలహాలు సుదాసుడికి నచ్చవు. ఆ సలహాలు పాటిస్తే తాను యుద్ధంలో ఓడిపోతాననుకుంటాడు. దాంతో త్రస్తులు అనే వారి సాయం కోరుతాడు. అయితే త్రస్యులు తమ గురువు అయిన వశిష్టుడిని సలహాదారుడిగా పెట్టుకోమని కోరుతారు. దీంతో సుదాసుడు విశ్వామిత్రుని తొలగించి వశిష్టుడిని సలహాదారుడిగా పెట్టుకుంటాడు.

వశిష్టుడంటే చాలా కోపం పెరిగిపోతుంది

వశిష్టుడంటే చాలా కోపం పెరిగిపోతుంది

అయితే విశ్వామిత్రుడిని సుదాసుడు వ్యతిరేక వర్గమైన దాసరాజు కూటమి సలహాదారునిగా నియమించుకుంటుంది. అయితే వశిష్ట మహర్షి సలహాల వల్ల సుదాసుడు యుద్ధంలో విజయం సాధిస్తాడు. విశ్వామిత్రుడి సలహాలు తీసుకున్న దాసరాజు కూటమి ఓడిపోతుంది. దీంతో విశ్వామిత్రుడికి వశిష్టుడంటే చాలా కోపం పెరిగిపోతుంది. అంతేకాదు విశ్వామిత్రుడికి, వశిష్టుడికి మధ్య వైరం ఏర్పడడానికి మరో కారణం ఉందని ఒక కథ ప్రచారంలో ఉంది.

అతని దగ్గర లేనిది ఏదీ లేదని విర్రవీగేవాడు

అతని దగ్గర లేనిది ఏదీ లేదని విర్రవీగేవాడు

విశ్వామిత్రుడు అంతకు ముందు విశ్వరథుడుగా ఉండేవాడు. ఆయన తప్పస్సు చేశాకా విశ్వామిత్రుడిగా మారాడు. విశ్వరథుడు తన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరింపజేశాడు. అంతేకాదు ఈ విశ్వంలో విశ్వరథుడికి తెలియనిది, అతని దగ్గర లేనిది ఏదీ లేదని విర్రవీగేవాడు. అయితే ఒక రోజు విశ్వరథుడు వేటకు వెళ్లాలనుకుంటాడు.

విశ్వామిత్రుడు, తన సైన్యం, అంగరక్షకులతో కలిసి వేటకు వెళ్తాడు. రాత్రి వరకు వేటాడుతూనే ఉంటాడు. రాత్రి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అప్పుడే విశ్వామిత్రుడికి ఒక ముని ఆశ్రమం కనపడుతుంది.

వశిష్టుడి దగ్గర హోమ ధేనువు ఉండేది

వశిష్టుడి దగ్గర హోమ ధేనువు ఉండేది

అయితే తన ఆశ్రమానికి వచ్చిన అందరికీ సకల సౌకర్యాలు కల్పించడం వశిష్టుడి లక్షణం. వశిష్టుడి దగ్గర హోమ ధేనువు అనే ఆవు ఉండేది. అది వశిష్టుడు ఏది అడిగితే అది ఇచ్చేది. దీంతో వచ్చిన వారందరికీ పంచభక్తపరమాన్నం పెట్టగలుగుతాడు.

కామధేనువు కూతురైన ఆ హోమ ధేనువును తాను తీసుకెళ్లాలనుకుంటాడు విశ్వామిత్రుడు. నా దగ్గర అన్నీ ఉన్నా కూడా ఇదొక్క నందినిని లేదే అని బాధపడతాడు. అయినా ఈ ముని దగ్గర హోమ ధేనువు ఉంటే ఏం లాభం నా లాంటి వాళ్ల దగ్గర ఉంటే గర్వంగా చెప్పుకోవొచ్చు అని అనుకుంటాడు.

ఆ హోమ ధేనువును తీసుకురండి

ఆ హోమ ధేనువును తీసుకురండి

తిరుగుప్రయాణానికి మొదలైనప్పుడు వశిష్ఠుడిని ఒక కోరిక కోరుతాడు. మీ నందినిని నాకు ఇవ్వండి అంటాడు. నీకు బదులుగా లక్షలాది ఆవులను ఇస్తా. సంపదను ఇస్తాను అని చెబుతాడు. నాకు అన్ని గోవులు ఎందుకు రాకూమారా?నాకు ఈ ఒక్క హోమ ధేనువు చాలు అంటాడు వశిష్టుడు. ఎంత అడిగినా కూడా కుదరదని ముఖంపైనే చెప్పేస్తాడు.

దీంతో విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. ఏయ్... ఆ హోమ ధేనువును తీసుకురండి అని సైనికులను ఆజ్ఞాపిస్తాడు విశ్వామిత్రుడు. కానీ ఆ నందిని మాత్రం వెళ్లదు. దాంతో దాన్ని కొడతారు. అంతే వశిష్టుడి దగ్గరకు వెళ్లి రోధిస్తుంది. కానీ వశిష్టుడు ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాడన్నట్లు గమనిస్తుంది. అంతే ఒక్కసారిగా హోమధేనువు శరీరం నుంచి లక్షలాది మంది సైనిక బలం వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది.

రాకుమారుడి నుంచి రుషిగా

రాకుమారుడి నుంచి రుషిగా

దాంతో విశ్వరథుడిగా విర్రవీగిన విశ్వామిత్రుడికి కనువిప్పు కలుగుతుంది. తన బలంకంటే తపోబలం గొప్పదనుకుంటాడు. వెంటనే తపస్సుకు పూనుకుంటాడు. సర్వ శక్తులు సాధిస్తాడు. ఎంతో మేధస్సును సాధిస్తాడు. ఒక పెద్దగా రుషిగా మారుతాడు విశ్వరథుడు. అలా విశ్వరథుని నుంచి విశ్వామిత్రుడిగా మారుతాడు. మళ్లీ వశిష్టుడిపై చాలాసార్లు దాడులు చేస్తాడుగానీ ఎప్పుడూ గెలవలేడు.

English summary

how the king vishwamitra became a great sagem

how the king vishwamitra became a great sagem
Story first published:Tuesday, August 7, 2018, 18:28 [IST]
Desktop Bottom Promotion