Latest Updates
-
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం!
దీపావళి స్పెషల్: లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించటం ఎలా?చేయాల్సినవి, చేయకూడనివి
పురాతన హిందూమత గ్రంధాల ప్రకారం, సముద్ర మధనం సమయంలో కొంతమంది ప్రముఖ హిందూ దేవతలు కనిపించరు, వారిలో ఒకరు లక్ష్మీదేవి. దేవతలందరూ స్వర్గం నుండి వస్తే, ఇంద్రుడు తన నేతృత్వంలో వారి సంపదను, సౌభాగ్యాన్ని దోచుకున్నాడు, అప్పుడు వారిని రక్షించడానికి వచ్చిన దేవతే లక్ష్మి. ఇంద్రుడు ప్రార్ధించగా, లక్ష్మీదేవి దయవల్ల అతను తన శ్రేయస్సు, సంపద, కీర్తి, ప్రశాంతత తన మతపరమైన గౌరవాన్ని పొందడానికి ద్వాదసాక్షర మంత్రాన్ని ప్రయోగించింది. ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే ఈ ద్వాదసాక్షరీ మత్ర౦తో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారో వారు కుబేరుడి ఆశీర్వాదం వల్ల అంతులేని సౌభాగ్యాన్ని పొందుతారు.
సంపదకి, సుఖసంతోషాలకి అధిదేవత లక్ష్మీ అమ్మవారు. హిందూ దేవతలలో ఆమె ప్రముఖమైనది. లక్ష్మీదేవి ఐశ్యర్యం, వృద్ధిలను మన జీవితాలలోకి తీసుకువస్తుంది. హిందూమతానికి చెందిన ప్రతి ఒక్కరూ తమ మాయామోహాలలో లక్ష్మేదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. మాయామోహం లేనివారు కూడా మోక్షం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఇంట్లో లక్ష్మి ఉండటం వలన మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా, శాంతితో ఉంటారు. ఏదీ లేదన్న కొరత ఏ మాత్రం ఉండదు. మీరు లక్ష్మిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలా అని ఆలోచిస్తుంటే, ఇదిగో ఈ చిట్కాలు మీకోసమే.
లక్ష్మీ పూజకి, లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించటానికి దీపావళి చాలా పవిత్రమైన సమయం. కొన్నిపనులు చేస్తే లక్ష్మీ దేవి తప్పక మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి మరింత చదవండి....

పూజగదిలో శ్రీయంత్రాన్ని స్థాపించండి
హిందూమతస్థులు జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కోసం వివిధరకాల యంత్రాలను ఇళ్ళలో ప్రతిష్టించుకుంటారు. కానీ శ్రీయంత్రం కన్నా మిన్న మరేదీ లేదని చెబుతారు.దీన్ని మీ పూజగదిలో పెట్టుకోవచ్చు. కానీ తప్పక దానికి రోజూ పూజలు చేయటం అవసరం. అన్ని పద్ధతులు సరిగా పాటిస్తే, ఇల్లంతా అదృష్టం, సంపదతో నిండిపోతుంది.

కమలాల జపమాలను వాడటం
లక్ష్మీదేవి హృదయానికి దగ్గరగా ఉండే అనేక విషయాలలో కమలాలు కూడా ఒకటి. లక్ష్మీదేవి కమలంలోనే నివసిస్తుందని చిత్రాలలో వ్యక్తీకరిస్తారు. పద్మాన్ని సంపదకి, మంచిసమయంకి గుర్తుగా భావిస్తారు. పూజగదిలో పద్మాలతో తయారైన జపమాలను లక్ష్మీ మంత్రాలు చదవటానికి వాడండి. దీనివల్ల మీ మనస్సు స్వచ్చత,ప్రేమ, దయతో నిండిపోయి పూజలో లగ్నమవుతుంది.

ముత్యపు శంఖాన్ని ఇంట్లో పెట్టుకోండి
ముత్యపు శంఖం అంటే శంఖం ముత్యపుకాంతితో మెరిసేది అని అర్థం. అరుదుగా దొరికే ఇవి ఎంతో ఆధ్యాత్మిక శక్తిని కలిగివుంటాయి. ఇవి ఇంట్లో ఉంచుకోటం వలన ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. శంఖాన్ని శుభ్రమైన ఎరుపు, పసుపు లేదా తెల్లని రంగులోని గుడ్డలో చుట్టి ఉంచాలి.

నేతిదీపాలను వెలిగించండి
లక్ష్మీదేవి మీ భవిష్యత్తు దారిని కాంతిమయం, సంతోషమయం చేసే దేవత. మీ పూజగదిలో లక్ష్మీ విగ్రహం కానీ, పటం కాని పెట్టండి. దానిముందు ప్రతిరోజూ పొద్దున, సాయంత్రం నేతిదీపం వెలిగించండి. తులసిమొక్క ఉన్నట్లైతే దాని ముందు కూడా దీపం వెలిగించండి.

సముద్రపు ఆల్చిప్పలు,గవ్వలను పెట్టండి
పూజచేసే చోట ఆల్చిప్పలు, గవ్వలను ఉంచండి. ఇవి ఇంట్లోకి సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయి. సంపద రూపాన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే అవి మరింత సంపదని ఆకర్షిస్తాయని అంటారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ఇంట్లో పెంచుతుంది.

లక్ష్మీదేవిని కొబ్బరికాయలతో పూజించండి
కొబ్బరికాయ పవిత్రమైన పండు. ఇది ఎంత పవిత్రమంటే దీన్ని శ్రీఫలమని కూడా అంటారు. ఇది అన్నిపూజలలో నైవేద్యంగా పెడతారు.లక్ష్మీదేవికి ప్రతిరోజూ కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి మంచిసమయాలను ఇంట్లోకి ఆహ్వానించండి.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోటానికి చేయదగినవి మరియు చేయకూడనివిః
ప్రేమ,కరుణ వంటివి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేట్లా చేస్తాయి.
పరిశుభ్రత చాలా ముఖ్యం. చిందరవందరగా,అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసించదు. అదేవిధంగా అపార్థాలు,గొడవలు ఉన్నచోటిని ఆమె అసహ్యించుకుంటుంది కూడా. మీ ఇంట్లో శాంతి, సామరస్యం ఉండేట్లా చూసుకోండి.
మీ ఇంట్లో స్త్రీలను ఎప్పుడూ అగౌరవంగా చూడవద్దు. మీ ఇంట్లో ఆడవారు ఆనందంగా ఉంటే, లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది.
సూర్యోదయంకి ముందే నిద్రలేచి సూర్యాస్తమయం తర్వాత పడుకోండి.
వంట చేసేటప్పుడు మీరు రుచి చూడకండి.
స్నానం చేసి, అగ్నిదేవుడు, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాకనే మీరు తినండి.
పవిత్రదినాలను గౌరవించండి. దీపావళి వంటి పండగలు, శుక్రవారాలు లక్ష్మీదేవికి ముఖ్యం. ఆరోజుల్లో పూజచేయటం మరవద్దు.

దీపావళినాడు లక్ష్మీదేవిని పూజలో చేయవలసినవి మరియు చేయకూడనివి
పూజ మరియు దీపావళి హారతి కుటుంబసభ్యులు అందరి సమక్షంలో జరగాలి. దానిద్వారా అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.

లక్ష్మీదేవికి సందోహంగా ఉన్న ప్రదేశాలు నచ్చవు. వాతావరణం శాంతిగా,సామరస్యంగా ఉండాలి.
ఇతర దేవతలకి హారతి ముగించాక, భక్తులు ఆనందంలో చప్పట్లు కొడతారు. కానీ లక్ష్మీపూజ హారతి తర్వాత చప్పట్లు కానీ, శబ్దాలు కానీ చేయవద్దు. ఒక చిన్న గంట శబ్దం చేస్తే చాలు.
హారతి అయిన వెంటనే బాణసంచా కాల్చవద్దు.



Click it and Unblock the Notifications











