Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
శివుడు మనతోనే వున్నాడా తెలిపే సంకేతాలు ఇవే..?
దేవుడు అంతటా వుంటాడని అంటారు. దాంట్లో నిజం వుందా నాకు ఆధారాలు కావాలి అని ప్రశ్నించేవారు చాలా మందే వున్నారు. శివుడు నాతో వున్నాడు అని కొందరంటారు. అయితే శివుడు మనతో నిజంగా వున్నాడా లేదా తెలుసుకోవచ్చని కొందరు ఆధ్మాత్మిక గురువులు చెబుతున్నారు. మనలో వున్న శివుడిని ఎలా గమనించాలి. మనలోనే దైవత్వం వుందన్న విషయాన్ని మనం ఎలా గ్రహించాలో తెలుసుకుందాం.
మనలోనే పరమశివుడిని దర్శించాలంటే ఏమి చేయాలి ?
పరమశివుడు మనతోనే వున్నాడు అని తెలపడానికి మనకు ఎలాంటి సంకేతాలు వస్తాయ్. ఈ మద్య వచ్చిన కార్తికేయ సినిమాలో ఆ సినిమా కథ మొత్తం శ్రీకృష్ణుడు చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర శ్రీకృష్ణ భగవానుని ఉనికి గురించి చెప్పబడుతుంది. శ్రీ కృష్ణుడంటే ఎక్కడి నుంచో దిగి వచ్చిన పాత్ర శ్రీకృష్ణుడంటే ఆయన జీవించిన జీవన విధానం అని అంటాడు.
మనం ఎలా బ్రతకాలనేది మన చరిత్ర సంస్కృతి చెబుతుంది. మనం చూడలేకపోతున్నామంటే అది మనముందు లేక కాదు మన కళ్లు చూడలేకపోతున్నాయనే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. శ్రీకృష్ణుడు సామాన్యమైన వ్యక్తే, అతన్ని దేవుడిగా చేయవద్దని అంటారు. శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను అనుసరించాలని చెబుతున్నారు. శ్రీకృష్ణుడు ఒక సింగర్, రైటర్, వారియర్, అతని అన్నీ అని ఆ సినిమాలో చెప్పబడుతుంది.

మానవ మేధస్సును వందశాతం ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయని శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉదహరిస్తారు. అంటే మనమందరం మన మేధస్సుని పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోతున్నామని అర్ధం. ఎవరైతే తమ మేధస్సును పూర్తిస్థాయిలో ఉపయోగిస్తారో, ఉన్నత విలువలతో జీవిస్తారో వారే ఈ ప్రపంచానికి దేవుడౌతారు.
మన పురాణాల్లో వున్న దేవుళ్లంతా ఒకప్పుడు భూమిపై మనలాగే బ్రితికి 100 శాతం మేధస్సును ఉపయోగించి అద్భుతంగా జీవించారు. అంత గొప్పగా బ్రతకడం వల్ల వాళ్లందరూ మనకు దేవుళ్లయ్యారు.
శివుడు మనతోనే వున్నడని తెలిపే సంకేతాలు
శివుడే భక్తులను తనవైపుకు తిప్పుకుంటాడు. భక్తులు వారి పనుల్లో బిజీగా వున్నా, సెల్‌ఫోన్‌లో ఏవో పనులు చేసుకుంటున్నా శివుడు వారికి ఏదో రూపంలో దర్శనమిస్తారు. రోడ్డుపై వెళ్లున్నప్పుడు శివుడి ఫోటోలు కనిపిస్తాయ్., శివాలయాలు కనిపిస్తాయ్, శివుడి భక్తులు ఊరేగింపుగా వెళ్లడం కనిపిస్తుంది. టీవీలో ఏది చూసినా పరమశివుడికి సంబంధించినవి కనిపిస్తాయ్. ఎవరో ఒక తులపు తట్టి శివుడికి సంబంధించిన ప్రసాదాన్ని అందించవచ్చు. ఇలాంటివి మీ జీవితంలో జరిగితే మీతోనే ఆ పరమశివుడు వున్నాడని అర్ధం చేసుకోవాలి. మనమేం పట్టించుకోకున్నా ఆ పరమశివుడే మనల్ని పట్టించుకుంటున్నాడని అర్ధం. అదే ఆ దైవత్వంలో వున్న గొప్ప విషయం.
జీవితంలో స్వార్ధం లేకుండా, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, నీకు తోచిన సహాయం చేస్తూ, నీకు అప్పజెప్పిన పని చేసుకుంటూ పోతూ వుంటే, ఇతరులకు ఆదర్శంగా నిలిచినప్పుడు, ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ వుంటావో అప్పుడు నీతో ఆ పరమశివుడు వుండటానికి ప్రయత్నిస్తాడు.
మంచి వాళ్లతోనే పరమశివుడు వుంటాడు. నీతీ నిజాయితీతో వుంటే ఏ కష్టంరాకుండా ఆ పరమశివుడును నిన్ను కాపాడుతూ వుంటాడు. ఎప్పుడైతే జీవిత మార్గం మంచిగా వుంటుందో, అప్పుడు పరమశివుడు నీతో వుంటాడు.



Click it and Unblock the Notifications
