For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీపై నరదిష్టి పోయి మీకు అంతా మంచే జరగాలంటే ఇలా చెయ్యండి, కచ్చితంగా ఫలితం ఉంటుంది

నరదిష్టి అనే మాటను మనం తరుచుగా వింటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం. మీపై నరదృష్టి పోయి మీకు అంతా మంచే జరగాలంటే ఇలా చెయ్యండి, కచ్చితంగా ఫలితం ఉంటుంది.

|

నరదిష్టి అనే మాటను మనం తరుచుగా వింటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం. ఒకరంటే శతృత్వం లేదా వారంటే పడకపోవడం వల్ల చూసే చూపుతో ఇలా జరిగే అవకాశం ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకి ఇష్టం లేనివారికి చెడు జరగాలి అనుకుని చూసే చూపు అన్నమాట. ఈ కనుదృష్టి నివారణకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన నివారణోపాయాలున్నాయి. అన్ని మతాల్లోనూ ఈ కనుదృష్టి దోషం వల్ల కలిగే లక్షణాలు వాటికి తగ్గ విరుగుళ్ళూ పేర్కొన్నారు. కనుదృష్టి తగలడం వల్ల కలిగే పరిణామాలు వాటి విరుగుళ్ళేమిటో చూద్దాం..

 మీపై నరదృష్టి పోయి మీకు అంతా మంచే జరగాలంటే ఇలా చెయ్యండి, కచ్చితంగా ఫలితం ఉంటుంది

మీపై నరదృష్టి పోయి మీకు అంతా మంచే జరగాలంటే ఇలా చెయ్యండి, కచ్చితంగా ఫలితం ఉంటుంది

వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి, నరదిష్టితొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.

సాంబ్రాణీ వేయడం మంచిది

సాంబ్రాణీ వేయడం మంచిది

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.

సముద్రతీరానికి వెళ్లి

సముద్రతీరానికి వెళ్లి

ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

తీవ్రమైన జబ్బు

తీవ్రమైన జబ్బు

అనారోగ్యం కలుగుతుంది. దీనికి విరుగుడుగా సముద్రపు నీటిని శుభ్రమైన తెల్లని బట్టలో వడకట్టి గోమూత్రం కలిపి సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ నీటిని పౌర్ణమి, పాడ్యమి రోజుల్లో అన్ని గదుల్లో చిలకరించాలి. మంగళ, శుక్ర వారాల్లో కూడా చెయ్యొచ్చు. దీని వల్ల దృష్టి దోషం పోవడంతో పాటు తీవ్రమైన జబ్బులు తగ్గుతాయి.కనుదిష్టి వల్ల పెంపుడు జంతువులకి ఆకలి తగ్గిపోవడం లేదా నిరంతరం జబ్బుపడటం లాంటివి జరుగుతాయి. మీ జంతువులని పసుపు నీటితో కడగడం వల్ల చెడు దృష్టిని దూరం చేసుకోవచ్చు.

వ్యాపారంలో నష్టాలు, కలిసిరాకపోవడం

వ్యాపారంలో నష్టాలు, కలిసిరాకపోవడం

పోటీదారులు లేదా శతృవుల కనుదృష్టి వల్ల వ్యాపారంలో నష్టపోవడం లేదా సజావుగా సాగకపోవడం వంటివి జరుగుతాయి. వ్యాపారంలో దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయ వేసి ఉంచాలి. ఈ గ్లాసుని అందరూ వచ్చి వెళ్ళే చోట ఉంచి నీటిని ప్రతి రోజూ మారుస్తూ ఉండాలి. నిమ్మకాయని ప్రతి శనివారం మార్చాలి.

వస్తు నష్టం

వస్తు నష్టం

నరదిష్టి, కను దిష్టి వల్ల ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నష్టపోతారు. ఒక తెల్లటి బౌల్లో రంగు రంగుల రాళ్ళు లేదా పూసలు వేసి ఉంచితే ఫలితం ఉంటుంది.పుట్టిన పిల్లలని చూడటానికి వచ్చినవాళ్ళు వెళ్ళిన తరువాత అకస్మాత్తుగా అనారోగ్యం కలుగొచ్చు. ఈ దిష్టి పోవాలంటే చేతిలో ఉప్పు వేసుకుని పిలల్ల తల చుట్టూ అటూ ఇటూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వెయ్యాలి. అలాగే హాలులో పశ్చిమ దిశలో ఆక్వేరియం ఉంచితే ఇలాంటి సమస్యలు సమసిపోతాయి.

గర్భిణీల మీద

గర్భిణీల మీద

గర్భవతులు ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు 2-3 వేప ఆకులు వెంటపెట్టుకెళ్ళి ఇంటికి తిరిగి రాగానే ఆ ఆకులని కాల్చెస్తే చెడు దృష్టిని కాల్చినట్లే. ప్రవచనకర్తలు లేదా తరచూ బహిరంగ సభల్లో ప్రసంగించేవారిలో కను దృష్టి వల్ల గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే రావి చెట్టు చిన్న కొమ్మ ని గుమ్మానికి వేలాడదీసి అదే చెట్టు నుంది మరొక చిన్న కొమ్మ ని ముక్కలు చేసి జేబులో పెట్టుకోవాలి. ఇది ఇంటి నుండి చెడు దృష్టిని పారదోలడానికి చక్కటి సాధనం.

పిల్లల చదువులు, సంబంధ బాంధవ్యాల మీద చెడు దృష్టి

పిల్లల చదువులు, సంబంధ బాంధవ్యాల మీద చెడు దృష్టి

వీటి మీద చెడు కన్ను పడకూడదనుకుంటే కనుక వేయించిన పటిక, మిరపకాయ, నిమ్మకాయ లేదా పెద్ద సీ షెల్(గవ్వ)స్ విరుగుడుగా పనిచేస్తాయి. తమకి ఏది నప్పుతుందో చూసుకుని ఆ పద్ధతిని పాటిస్తే చెడు దృష్టి నుండి పిల్లల చదువులను, మన సంబంధాలను కాపాడుకోవచ్చు. నరదృష్టి అనేది బాగా బతికే ప్రతి ఒక్కరిపై పడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి సుమా.

English summary

how to ward off evil eye

how to ward off evil eye
Desktop Bottom Promotion