For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Krishna Janmashtami 2023:మీ రాశిని బట్టి శ్రీక్రిష్ణుడిని ఇలా పూజిస్తే.. కచ్చితంగా ఫలితం లభిస్తుందట...!

|

పురాణాల ప్రకారం.. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఎనిమిదో అవతారంగా శ్రీ క్రిష్ణుని అవతారమని చెబుతారు. ఈ క్రిష్ణ భగవానుడి ఆశీస్సులు, అనుగ్రహం లభిస్తే.. మన కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.

అలా శ్రీ క్రిష్ణుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజే చిన్ని క్రిష్ణుడు జన్మించాడు. ఈరోజున చాలా మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ క్రిష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే చిన్ని క్రిష్ణుడు ఇష్టపడేవి మీరు చేస్తే.. ఆ క్రిష్ణుని అనుగ్రహం, ఆశీర్వాదం మీకు తప్పక లభిస్తుంది.

Krishna Janmashtami 2023: How To Worship Lord Krishna As Per Zodiac Signs

ఈ నేపథ్యంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా మీ రాశిని బట్టి శ్రీ క్రిష్ణుడిని ఎలా పూజించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీ క్రిష్ణుని పుట్టుక ఓ అద్భుతం..శ్రీ క్రిష్ణుని పుట్టుక ఓ అద్భుతం..

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు రాధక్రిష్ణలకు జలాభిషేకం చేయాలి. అలాగే శ్రీక్రిష్ణుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యం సమర్పించాలి. వాటిలో కొబ్బరితో తయారు చేసిన పదార్థాలు, అలాగే వెన్నతో తయారు చేసిన పదార్థాలను, దానిమ్మ పండ్లను సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. శ్రీక్రిష్ణుడిని స్మరించేటప్పుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు శ్రీ క్రిష్ణుడికి పంచామృతాభిషేకం సమర్పించాలి. అలాగే రసగుల్లా, పాలతో తయారు చేసిన ఇతర పదార్థాలను సమర్పించొచ్చు. శ్రీ క్రిష్ణుడిని ఆరాధించేటప్పుడు 'శ్రీ రాధా కృష్ణ శరణం మమ్' అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు బాల క్రిష్ణుడికి అభిషేకం చేయాలి. జీడిపప్పు మిఠాయిలు మరియు ఐదు రకాల పండ్లను సమర్పించాలి.తులసి లేదా క్రిస్టల్ రోసరీని ఉపయోగించి పదకొండు సార్లు 'శ్రీ రాధా కృష్ణయే నమో స్వాహా' అనే మంత్రాన్ని పఠించాలి. మీరు కృష్ణుడికి అందించే పండ్లలో అరటిపండ్లు కచ్చితంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇది సమాజంలో మీ గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు శ్రీక్రిష్ణుడిని ఆరాధించే సమయంలో ‘ఓం హిరణ్యగర్భాయ అవ్యక్తరూపేణ నమః' అని మంత్రాన్ని జపించండి. శ్రీ క్రిష్ణ జన్మాష్టమి రోజున పిండిలో చక్కెర మిఠాయిలు కలిపి ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి రోజున తీపి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. క్రిష్ణుడిని ఆరాధించే సమయంలో ‘ఓం క్లీన్ జగధరయే నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు కుంకుమ కలిపిన పాలు మరియు రోటీని ఆవుకు తినిపించడం ద్వారా శ్రీక్రిష్ణుడిని పూజించాలి. క్రిష్ణుని ఆరాధన సమయంలో ‘ఓం పితాంబరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

తుల రాశి..

తుల రాశి..

శ్రీ క్రిష్ణ జన్మాష్టమి రోజున ఈ రాశి వారు మీరు స్వయంగా చేసిన ఆహారాన్ని ఆవుకు తినిపించాలి. అలాగే ఐదు రకాల పండ్లను శ్రీక్రిష్ణుడికి సమర్పించాలి. అదే విధంగా ‘ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు శ్రీ క్రిష్ణ జన్మాష్టమి రోజున జున్నుతో నింపిన పదార్థాన్ని ఆవుకు తినిపించాలి. అలాగే శ్రీక్రిష్ణుడికి కుంకుమ బియ్యం సమర్పించాలి. క్రిష్ణుని ఆరాధన సమయంలో ‘ఓం శ్రీ వత్సలే నమః' అనే మంత్రాన్ని జపించండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు క్రిష్ణ జన్మాష్టమి రోజున శ్రీ క్రిష్ణుడికి జున్నుతో తయారు చేసిన పదార్థాలను సమర్పించాలి. మీరు ‘ఓం శ్రీ దేవక్రిష్ణాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు క్రిష్ణ జన్మాష్టమి రోజున క్రిష్ణుడికి నల్ల మిరియాలు కలిపిన పప్పులతో నైవేద్యం సమర్పించాలి. అనంతరం శ్రీ క్రిష్ణుడికి పూజలు మరియు ప్రార్థనలు చేయాలి. అదే సమయంలో ‘ఓం నారాయణ్ సుర్సింధే నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు క్రిష్ణ జన్మాష్టమి రోజున ఆవులకు బార్లీ పిండిని తినిపించాలి. శ్రీక్రిష్ణుడికి పాయసం సమర్పించాలి. అనంతరం క్రిష్ణుడిని పూజించాలి. అదే సమయంలో ‘ఓం లీలా ధరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి రు క్రిష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా ఇద్దరు చిన్నారులకు వేణువును బహుమతిగా ఇవ్వాలి. శ్రీ క్రిష్ణుడిని పసుపు బట్టలతో పూజించాలి. అనంతరం లడ్డూలను సమర్పించాలి. పూజ సమయంలో ‘ఓం దేవకీ-నందనాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

English summary

Krishna Janmashtami 2023: How To Worship Lord Krishna As Per Zodiac Signs

In this article we have brought to you information on how to worship Lord Krishna as per zodiac signs. Take a look.
Desktop Bottom Promotion