For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Nag Panchami 2021: సర్పదేవతలను సంతోషపరచేందుకు ఏ రాశి వారు ఎలాంటి ఆరాధన చేయాలో తెలుసా...

నాగ పంచమి 2021 సందర్భంగా మీ రాశిని బట్టి నాగదేవతలను ఎలా పూజించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం నాగ దేవతల ఆశీస్సులు పొందడానికి నాగ పంచమి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.

Nag Panchami 2021: How To Worship On Nag Panchmi as per Your Zodiac Signs in Telugu

జ్యోతిష్యశాస్తరం ప్రకారం వృషభం, సర్ప విషం, చెడు విషం మరియు రాహు కేతు వల్ల కలిగే సమస్యలను పరిష్కరించుకోవాలనుకునే వారందరికీ నాగ పంచమి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సర్ప దేవతలను పూజిస్తే, నాగదేవతలు సంతోషిస్తారని.. తమ జీవితం సంతోషంగా ఉంటుందని.. తమకు ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

Nag Panchami 2021: How To Worship On Nag Panchmi as per Your Zodiac Signs in Telugu

అందుకే మన దేశంలో నాగ పంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మీ రాశిని బట్టి నాగ పంచమి రోజున సర్పాలకు కొన్ని పరిహారాలు చేస్తే.. నాగదేవతల అనుగ్రహం సులభంగా పొందొచ్చు. ద్వాదశ రాశులకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటారు. ఈ సందర్భంగా నాగ పంచమి రోజున ద్వాదశ రాశుల వారు నాగ దేవతలను ఎలా పూజిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆగష్టు 13 నాగపంచమి: ఆ రోజు ఏం చేయాలి మరియు చేయకూడనివి ఇక్కడ ఉన్నాయిఆగష్టు 13 నాగపంచమి: ఆ రోజు ఏం చేయాలి మరియు చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి

నాగ పంచమి ఆరాధనతో కలిగే ప్రయోజనాలు

నాగ పంచమి ఆరాధనతో కలిగే ప్రయోజనాలు

* మన జాతకంలో సర్ప దోషం ఉంటే.. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల సులభంగా వాటిని నివారించవచ్చు.

* మన జాతకంలో కాలసర్ప యోగం ఉంటే, ఈరోజు ప్రత్యేక పూజలు చేసి వాటి ప్రభావాలను తగ్గించే అవకాశం ఉంది.

* నాగ పంచమి రోజు చేసే పూజ ద్వారా మీరు ఎలాంటి విషపూరిత చెడునైనా తొలగించవచ్చు.

* ఈరోజున దోష నివారణ పూజ మరియు పితృ దోష నివారణ పూజలు కూడా జరుగుతాయి.

* ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా వివాహ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ఈ సందర్బంగా మీ రాశిని బట్టి నాగదేవతలను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం, వృశ్చికం..

మేషం, వృశ్చికం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి మార్స్ అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశుల వారు నాగదేవతలకు ఎర్రని పువ్వులు సమర్పించి పూజను ప్రారంభించాలి. అలాగే పాలు, ఇతర వస్తువులతో ఆరాధించేటప్పుడు దక్షిణ దిశ వైపు అభిముఖంగా ఉండే నాగ ప్రతిమలను పూజిస్తే వీరు మరింత ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో సర్ప స్తోత్రాలను మరియు గణేష్ స్తోత్రం పఠిస్తే మంచిది.

వృషభం, తుల

వృషభం, తుల

ఈ రాశుల వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడు వివేకానికి, జ్ణానానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఈ రాశుల వ్యక్తులు ఉత్తర దిక్కుకు అభిముఖంగా ఉన్న నాగదేవుని విగ్రహాలకు మరియు తెల్లని పువ్వులు ఇతర వస్తువులతో పూజిస్తే మంచి ఫలితాలొస్తాయి. అలాగే నాగస్తోత్రం మరియు గణేష్ చాలీసా జపిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

మీ సన్నిహితులకు నాగ పంచమి శుభాకాంక్షలు చెప్పండిలా...మీ సన్నిహితులకు నాగ పంచమి శుభాకాంక్షలు చెప్పండిలా...

మిధునం, కన్య..

మిధునం, కన్య..

ఈ రాశుల వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాశుల వారు ఈశాన్య దిశ వైపు అభిముఖంగా నాగ దేవతల విగ్రహాలకు పూజలు చేయడం మంచిది. మీరు పూజ చేసే సమయంలో చెరకు రసం నైవేద్యంగా సమర్పిస్తే శుభప్రదంగా ఉంటుంది. అదే విధంగా గణేష్ కవాచ్ ను పఠించడం మంచిది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారు పశ్చిమ దిక్కుకు ఎదురుగా ఉన్న నాగ ప్రతిమలకు పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. నాగదేవతలకు పెరుగు మరియు తెల్లని పువ్వులను సమర్పించండి. గణేష్ అథర్వశీర్ష పారాయణం చేయండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు. సూర్యుడు కూడా ఆగస్టు 17వ తేదీన ఇదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సింహ రాశి వారు తూర్పు వైపున అభిముఖంగా ఉన్న నాగప్రతిమలకు పూజలు చేస్తే శుభప్రదంగా ఉంటుంది. పూజ చేసే సమయంలో ఎర్రని పువ్వులు మరియు కుంకుమను సమర్పించాలి. అనంతరం నాగస్తోత్రాన్ని పఠించాలి.

ధనస్సు, మీన రాశి..

ధనస్సు, మీన రాశి..

ఈ రాశుల వారికి బృహస్పతి అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశుల వారు తూర్పు-ఉత్తరం వైపున చూస్తున్న నాగ దేవతల విగ్రహాలకు పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. సర్పాల ఆరాధన సమయంలో పసుపు, పసుపు రంగులో ఉండే పువ్వులు, పసుపు వస్తువులను ఉపయోగిస్తే మంచి ఫలితాలొస్తాయి.

మకరం, కుంభం..

మకరం, కుంభం..

ఈ రాశుల వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ రెండు రాశుల వారు పశ్చిమ వైపునకు ఎదురుగా ఉన్న నాగ దేవత విగ్రహాలను పూజించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవచ్చు.

గమనిక : ఇక్కడ గ్రహాల ఆధారంగా, రాశిచక్రాలను బట్టి నాగదేవతల అనుగ్రహం కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను మీతో పంచుకున్నాం. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనే ఆశిస్తున్నాం. మీకు మరింత సమాచారం కావాలన్నా.. ప్రత్యేక మార్గదర్శకాలు కావాలన్నా వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించగలరు.

FAQ's
  • తెలుగు క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి ఏ మాసంలో వస్తుంది?

    తెలుగు క్యాలెండర్ ప్రకారం ఐదో నెలలో అంటే శ్రావణ మాసంలో నాగ పంచమి వస్తుంది.

  • నాగ పంచమి రోజున నాగదేవతలకు వేటిని నైవేద్యంగా సమర్పిస్తారు?

    నాగ పంచమి రోజున నాగదేవతలకు పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

English summary

Nag Panchami 2021: How To Worship On Nag Panchami as per Your Zodiac Signs in Telugu

Here is how to worship on nag panchmi as per our zodiac signs. Take a look.
Desktop Bottom Promotion