For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించలేక చనిపోలేదు, కౌరవులు దొంగదెబ్బ తీసి చంపారు

సుభద్ర, అర్జునుల కుమారుడైన అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో తనకంటూ ఒక గౌరవం తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అభిమన్యుడి పేరును అంతగా తలుస్తున్నారంటే అతడి సాహాసోపేతాలు ఏమిటో అర్థం చేసుకోవొచ్చు.

|

మహాభారతంలో అర్జునుడు కొడుకు అభిమన్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాన్ని చాలా సేపు ఎదురించి పోరాడిన యోధుడు.

abhimanyu

అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి అక్కడికి నుంచి వెనక్కి తిరిగిరాలేక చనిపోయాడన్నది తెలిసిన కథే. అయితే అభిమన్యుడు ఎలా చనిపోయాడనే విషయంలో పలు గ్రంథాల్లో రకరకాలుగా ఉంది.

చంద్రుని ఆదేశానుసారమే

చంద్రుని ఆదేశానుసారమే

చంద్రుని ఆదేశానుసారమే అభిమన్యుడు మరణించాడట. అభిమన్యుడు చంద్రుడి కొడుకైన వర్చస్సుతో జన్మించిన వ్యక్తి. ఇక చంద్రుడు కొడుకుని విడిచి ఉండలేక అతనికి పదహారవ ఏట రాగానే తిరిగి రావాలని షరతు విధించాడట. దీంతో అభిమన్యుడు పద్మవ్యూహంలోనే చిక్కుకుని మరణించి చంద్రుడి దగ్గరకు చేరుకున్నాడట.

12 రోజులు పూర్తైన యుద్ధం

12 రోజులు పూర్తైన యుద్ధం

సుభద్ర, అర్జునుల కుమారుడైన అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో తనకంటూ ఒక గౌరవం తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అభిమన్యుడి పేరును అంతగా తలుస్తున్నారంటే అతడి సాహాసోపేతాలు ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. కురుక్షేత్ర యుద్ధం చాలా భయంకరంగా సాగుతోంది. యుద్ధం ప్రారంభమై అప్పటికే 12 రోజులైంది. పాండవుల్లో.. కౌరవుల సైనికుల్లో చాలా మంది చనిపోయారు.

పన్నాగం పన్నాడు

పన్నాగం పన్నాడు

ఇక పద మూడో రోజు ద్రోణుడు కౌరసేనపై ఒక పన్నాగం పన్నాడు. అదే పద్మవ్యూహం. అయితే పాండవుల సైనికుల్లో ఎవరై కూడా వ్యూహం ఛేధించలేకపోయారు. దీంతో ధర్మరాజు అభిమన్యుడా...కృష్ణుడు మీ నాన్నకి అంటే అర్జునుడికి ప్రద్యుమ్నునికి అంటే కృష్ణుడి కుమారుడికి, నీకు మాత్రమే పద్మవ్యూహం ఛేదించే విధానాన్ని నేర్పించాడని గుర్తు చేశాడు.

నువ్వే ఈ రోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టు

నువ్వే ఈ రోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టు

అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఈ భారం నీ మీదనేమోపుతున్నానని ధర్మరాజు అన్నాడు. నువ్వే ఈ రోజు నాయకత్వ బాధ్యతలు స్వీకరించు అని ఆదేశించాడు. పెదనాన్న.. మీ ఆదేశాన్ని శిరసా పాటిస్తాను అని ముందడుగు వేశారు.

లోపలికి వెళ్లడం వరకే తెలుసు

లోపలికి వెళ్లడం వరకే తెలుసు

నాకు పద్మవ్యూహంగురించి తెలుసు. కానీ పద్మవ్యూహం లోపలికి వెళ్లడం వరకే నాకు తెలుసు. నాకు వెనక్కి రావడం తెలియదు. అయినా ఏం ఫర్వాలేదు. వీరులు ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోకూడదు అంటూ వెంటనే రణరంగంలోకి దిగుతాడు అభిమన్యుడు.

మంచిదే అంటూ ముందుకు కదిలాడు

మంచిదే అంటూ ముందుకు కదిలాడు

విజయం అయినా సరే... వీర స్వర్గమైనా సరే ఏది వచ్చినా సరే మంచిదే అంటూ ముందుకు కదిలాడు. అభిమన్యుడిని పాండవసేన అనుసరించింది. పద్మవ్యూహాన్ని ఛేదించాడు. సంధించిన బాణంలా వ్యూహంలోనికి చొచ్చుకెళ్తాడు. ధర్మరాజు, భీముడు అతడిని అనుసరించి వెంట వెళ్తారు. అయితే వారు అభిమన్యుడికి సాయంగా లోనికి ప్రవేశించలేకపోతారు.

కౌరవులను పద్మవ్యూహం మధ్య ఓడిస్తాడు

కౌరవులను పద్మవ్యూహం మధ్య ఓడిస్తాడు

అభిమన్యుడు ఒంటరిగానే కౌరవులను పద్మవ్యూహం మధ్య ఓడిస్తాడు. అభిమన్యుడి రథం కూలిపోతుంది. ఆయుధాలు శిథిలమైపోతాయి. అప్పుడు అభిమన్యుడు రథ చక్రాన్ని ఆయుధంగా తీసుకుంటాడు. దాంతోనే శత్రువులను ఎదుర్కొంటాడు.

యుద్ధ నీతికి విరుద్ధం

యుద్ధ నీతికి విరుద్ధం

అభిమన్యుడి వల్ల సంభవించే నష్టాన్ని గమనించే కౌరవులు అభిమన్యుడిని చంపాలని భావిస్తారు.ఒంటరిగా పోరాడే వీరుడిని చాలా మంది కలిసి ఎదుర్కొని యుద్ధం చేయడమనేది, చంపడం అనేది యుద్ధ నీతికి విరుద్ధం. అది అధర్మం. అయినా కౌరవుల్లోని యుద్ధ వీరులంతా ఏకమై (దుర్యోధనుడు, ద్రోణుడు తదితరులు) ఒక్కసారిగా అభిమన్యుడిపై అన్ని వైపుల నుంచి దాడి చేస్తారు.

సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదు

సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదు

ఇక సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదనేది యుద్ధనీతి. సాయంత్రం అవ్వగానే యుద్ధ సమాప్తికి సంబంధించిన భేరీ మోగుతుంది. అప్పుడు ఎవ్వరూ యుద్ధం చేయకూడదు. అదే నియమంతోనే సాయంకాలం సమయంలో యుద్ధ రంగం నుంచి అర్జునుడు తన విడిది చేరుకుంటాడు. అయితే అందరూ దుఖంలో మునిగి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.

ప్రతిజ్ఞ చేస్తాడు

ప్రతిజ్ఞ చేస్తాడు

అభిమన్యుడు చనిపోయిన విషయం తెలుస్తుంది. తర్వాత అభిమన్యుడు కౌరవుల చేతుల్లో ఎలా చంపబడ్డాడో తెలుసుకుంటాడు. అభిమన్యుడు పద్శవ్యూహం ఛేదించలేక చనిపోలేదు, కౌరవులు దొంగదెబ్బ తీసి చంపారని తెలుసుకుంటాడు. తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు.

చంపేస్తాడు

చంపేస్తాడు

రేపు సూర్యాస్తమానం అయ్యేలోపు జయద్రథుని అంటే సైంధవున్ని చంపుతాను. అలా చేయకుంటే నేను ప్రాణత్యాగం చేస్తాను అంటాడు అర్జునుడు. అలా చెప్పినట్లుగానే అర్జునుడు జయద్రథుని చంపేస్తాడు. అభిమన్యుడి చావుకి కారణమైన వారిపై అలా ప్రతీకారం తీర్చుకుంటాడు అర్జునుడు.

English summary

how was abhimanyu killed in-mahabharat

how was abhimanyu killed in-mahabharat
Desktop Bottom Promotion