Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
కొత్త ఏడాది మొదటి రోజున ఇవి దానం చేస్తే..ఏడాదంతా డబ్బుకు కొరత ఉండదు
సనాతన ధర్మంలో కొత్త సంవత్సరం మొదటి రోజున దాన ధర్మాలు చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ శుభ సందర్భంలో ప్రజలు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారు. ఈ సమయంలో ఇష్ట దైవానికి నమస్కరించడం ద్వారా రోజును ప్రారంభిస్తారు. రోజువారీ పనులను పూర్తి చేసిన తర్వాత స్నానం చేసి గంగాజలం కలిపిన నీటితో ధ్యానం చేయండి. దీని తర్వాత ప్రతి ఒక్కరూ శివుడితో పాటు అన్ని దేవుళ్లు, దేవతలను పూజిస్తారు
పవిత్రమైన పని సమయంలో భగవంతుడిని పూజించడం ద్వారా సాధకుడికి శుభ ఫలితాలు లభిస్తాయని మత విశ్వాసం. దీంతో పాటు జీవితంలో ఆనందం, శ్రేయస్సు,సంపద పెరుగుతుంది. దీని తర్వాత తమ తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా దానధర్మాలు చేస్తారు. శివుని అనుగ్రహం మీపై ఉండాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున శివ దంపతులని భక్తితో పూజించిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయండి. నూతన సంవత్సరం మొదటి రోజు దానం చేయడం వల్ల సంతోషం పెరుగుతుంది.

-మీ జాతకంలో శనిగ్రహం ఆటంకంతో సహా అశుభ గ్రహాల ప్రభావం నుండి బయటపడాలంటే కొత్త సంవత్సరం మొదటి రోజున నల్ల నువ్వులు,దుప్పట్లు,వెచ్చని బట్టలు,తోలు బూట్లు,చెప్పులు మొదలైన వాటిని దానం చేయండి.
-వ్యాపారంలో పురోగతిని పొందాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున పచ్చి కూరగాయలు,ఆకుపచ్చ గాజులు,ఆవుల మేత మొదలైన వాటిని దానం చేయండి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారంలో ఆశించిన విజయం లభిస్తుంది.
-సుఖసంతోషాలు పెరగాలంటే అన్నం, పిండి, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు, ఉప్పు, పంచదార, పిండి, బంగాళదుంపలు మొదలైన వాటిని నూతన సంవత్సరం తొలిరోజు దానం చేయండి. వీటిని దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు. అలాగే సాధకునిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.
-పదవి, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కొత్త సంవత్సరం మొదటి రోజున పసుపు రంగులో ఉండే శెనగపిండి, శనగపప్పు, పసుపు, పండిన అరటిపండ్లు, బొప్పాయి మొదలైన వాటిని తిని లడ్డూలను దానం చేయండి.
-హనుమంతి ఆశీర్వాదం,జాతకంలో కుజుడు బలపడటం కోసం కొత్త సంవత్సరం మొదటి రోజు పప్పు, ఎర్ర మిరపకాయలు, ఎరుపు రంగు బట్టలు, బెల్లం, శనగపప్పు, తేనె మొదలైన ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి. వీటిని దానం చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు, ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి.



Click it and Unblock the Notifications
